Gol Maal Actress Manju Singh Passed Away At 73: ప్రముఖ హిందీ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, ప్రొడ్యూసర్ మంజు సింగ్ (73) కన్నుమూశారు. గీత రచయిత, గాయకుడు, నటుడు స్వానంద్ కిర్కిరే సోషల్ మీడియా వేదికగా మంజు సింగ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. 'మంజు సింగ్ ఇకలేరు. ఆమె దూరదర్శన్‌లో ప్రసారమయ్యే స్వరాజ్ షోకి రాసేందుకు నన్ను ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. డీడీ కోసం ఏక్ కహానీ, షో టైమ్ మొదలైన అనేక అద్భుతమైన ప్రదర్శనలు రూపొందించారు. మా ప్రియమైన మంజు గారి ప్రేమను అందరూ ఎలా మరిచిపోగలరు. వీడ్కోలు..' అని ట్వీట్ చేశారు.
స్వానంద్‌తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, సహచరులు ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. మంజు సింగ్ భారతదేశంలోనే గొప్ప టెలివిజన్ మార్గదర్శకురాలు. స్వరాజ్, ఎక్ కహానీ, షో టైమ్ వంటి ప్రసిద్ధ షోలను నిర్మించారు. పిల్లల షో 'ఖేల్ ఖిలోన్'కు ఏడేళ్లపాటు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమెను అందరూ ప్రేమగా 'దీదీ' అని పిలిచేవారు. సింగ్ హృషికేష్ ముఖర్జీ గోల్‌మాల్ సినిమాలో రత్న అనే పాత్రను పోషించారు. అనేక అంతర్జాతీయ బాలల, యువకుల చలనచిత్రోత్సవాలలో మంజు సింగ్ పాల్గొన్నారు. సృజనాత్మక కళలు, విద్యకు ఆమె చేసిన సేవలకుగానూ 2015లో భారత ప్రభుత్వం మంజు సింగ్‌ను 'సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఎబీఈ)'కి నియమించింది.
मंजू सिंह जी नहीं रही ! मंजू जी मुझे दिल्ली से मुंबई लायी थी दूरदर्शन के लिए उनका शो स्वराज लिखने ! उन्होंने DD के लिए कई नायब शोज़ एक कहानी, शो टाइम आदि बनाए थे . हृषिकेश मुखर्जी की फ़िल्म गोलमाल की रत्ना हमारी प्यारी मंजू जी आपका प्यार कैसे भूल सकता है .. अलविदा ! pic.twitter.com/aKFvMJeFYF
— Swanand Kirkire (@swanandkirkire) April 15, 2022
చదవండి: మోహన్ లాల్ ఉదారత.. ఆ విద్యార్థులకు 15 ఏళ్లపాటు ఉచిత విద్య
Comments
Please login to add a commentAdd a comment