28న గవర్నర్ రాక
కాకినాడ సిటీ:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్శింహ¯ŒS ఈ నెల 28వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 7.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉదయం 8.40 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కాకినాడ ఆర్అండ్బీ అతిథిగృహానికి 9.40 గంటలకు చేరుకుని తదుపరి 9.50కు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి బయల్దేరి 10 గంటలకు కాకినాడలోని కుసుమ సత్య కాన్వెన్ష¯ŒS హాలుకు చేరుకుని 11 గంటల వరకు రోటరీ డిస్ట్రిక్ట్ 3020 సదస్సులో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి 11.20 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి 2.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు.
ఏర్పాట్లపై సమీక్షించిన జేసీ–2
గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి సమీక్షించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని ఆదేశించారు. జిల్లాలో గవర్నర్ పర్యటనను ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని, పర్యటన ప్రాంతాలలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో రాజమండ్రి ఇ¯ŒSచార్జి సబ్ కలెక్టర్ ఎం.జ్యోతి, కాకినాడ ఆర్డీఓ బీఆర్ అంబేడ్కర్, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎ¯ŒS మూర్తి, ఏఆర్ డీఎస్పీ వి.ఎస్.వాసన్, సమాచార శాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్, కాకినాడ సిటీ తహసీల్దార్ జి.బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.