dowltabad
-
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి
సాక్షి, దౌల్తాబాద్: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని చిన్న గుంట తాండాలో తమ పొలంలో బోరు మోటర్ బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు రైతులు మృతిచెందారు. వారిని వాల్యా నాయక్ (42), శ్రీశైలం(22)గా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కోస్గి ఆస్పత్రికి తరలించారు. -
పాలమూరులోనే కొనసాగించాలి
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కలుపొద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలో మహిళలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూరవెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన దౌల్తాబాద్‌ను వికారాబాద్‌లో కలిపితే ఆర్థిక, విద్యపరంగా మరింత వెనకబడుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, సీపీఎం నాయకులు రాజు తదితరులున్నారు. -
బీపీఎంపై చర్యలు తీసుకోవాలి
దౌల్తాబాద్: మండలంలోని ఇండాపూర్, కుదురుమళ్ళ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న తపాలా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సంతోష్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి నెలా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని ఈ నెల హస్నాబాద్‌కు వస్తేనే ఇస్తానని ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని బీపీఎంపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.