రసకందాయంలో డీపీసీ ఎన్నిక
నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నిక రసకందాయంలో పడింది. కమిటీ సభ్యు ల్లో కౌన్సిలర్ల కోటాకు సంబంధించి కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ల మధ్య గట్టిపోటీ ఏర్పడింది. ఈ కోటాలో నాలుగు స్థానాలుండగా, రెండు ఏకగ్రీమవుతుండగా, మరోరెండు స్థా నాలకు 17మంది కౌన్సిలర్లు బరిలో ఉన్నారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో నామినేష న్ల పరిశీలన పూర్తయ్యింది. కౌన్సిలర్ల కోటాలో మహిళా రిజర్వేషన్లో పురుషుడు నామినేషన్ దాఖలు చేయగా, అధికారులు దానిని తిరస్కరించారు. కాగా రెండు పార్టీల మధ్య సమన్వ యం కుదరిన పక్షంలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరించుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జెడ్పీటీసీ కోటాలో 20 మంది సభ్యులకుగాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన మూడు స్థానాలకు నలుగురు పోటీ పడుతున్నారు. ఈ మూడు స్థానాలు కూడా బీసీ మహిళా కోటాకు చెందినవే.
రామన్నపేట, నిడమనూరు, మోతె, యాదగిరిగుట్ట సభ్యులు పోటీలో ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ కాగా, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ టీఆర్ఎస్కు చెందినవారు. టీఆర్ఎస్కు కోటా ప్రకారం 7 స్థానాలు ఇవ్వాల్సి ఉండగా 6 ఇచ్చారు. కాబట్టి పొత్తులో భాగంగా ఈ మూడు స్థానాల్లో ఒకటి టీఆర్ఎస్కు తప్పనిసరిగా కేటాయించాల్సిందే. ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు నామినేషన్ ఉపసంహరిం చుకుంటేనే సరి...లేకపోతే పోటీ ఉంటుంది. కాగా, కౌన్సిలర్ల కోటాలో బీసీ జనరల్ స్థానానికి 8 మంది, జనరల్ స్థానానికి 9మంది కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. వీరిలో బీసీ జనరల్ స్థానానికి నామినేషన్ వేసిన సభ్యులు సైతం జనరల్ స్థానానికి నామినేషన్ వేశారు. సూర్యాపేట మునిసిపాలిటీ మినహా కోదాడ, భువనగిరి, నల్లగొండ,మిర్యాలగూడ మునిసిపాలిటీ, హుజూర్నగర్ , దేవరకొండ నగరపంచాయతీ నుంచి సభ్యులు పోటీలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి డీపీసీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.