ఆప్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీపై దాడిలో ఓ అడుగు ముందుకేసింది కాంగ్రెస్ పార్టీ. మొహల్లా సభల పేరుతో ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజ ల్లోకి వెళ్లి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ యత్నిస్తోందని, కానీ 49 రోజుల ఆ పార్టీ పాల నతో విసిగిపోయిన ప్రజలు నిరాకరించాలని నిర్ణయించుకున్నారని డీపీపీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ తెలి పారు.
49 రోజుల పాల నలో ఆప్ ఏ ఒక్క అభివృద్ది పనిని చేపట్టలేదని, ఒక్క టెండర్‌ను కూడా పిలవలేదని ఆరోపించా రు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ పాటించడం లేదని, పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాకుండానే ప్రధాన మైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోఎపించారు. అప్‌కి మొహల్లా సభ ల మీద అంత ప్రేమ ఉంటే... దానిపై బిల్లు ఎందుకు తీసు కు రాలేదని ఆయన ప్రశ్నించారు. దేశ రాజ ధానిలో విద్యుత్ కోతకు ఆప్, బీజేపీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
15 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే నీరు, విద్యుత్ కొరత ఏర్పడలేదని, ప్రస్తుతం ప్రజలు నిరంతరాయంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు గెలిచిన 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొహల్లా సభలు నిర్వహిస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం నియోజకవర్గ నిధులను ఎలా ఖర్చు పెట్టాలని ప్రజలను అడగడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పోగొట్టుకున్న క్షేత్రస్థాయి బలాన్ని పుంజుకోవడం.