Dr Ap Vital
-
అసెంబ్లీ సాక్షిగా బాబుకు శృంగభంగం
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర పరాజయానికి గురై కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు అక్కడ ఎదురవుతున్న అవమానాలు చూస్తే చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అనిపించకమానదు. చివరకు అచ్చయ్య, బుచ్చయ్య, రామయ్య వంటి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే బాబు వాదనకు సమర్థనగా నిలబడుతున్న పరిస్థితి. సూటిగా బుగ్గన, అంబటి వంటి నేతలు వాగ్బాణాలు సంధిస్తే, వాటికీ చంద్రబాబే బదులివ్వాల్సి వస్తోంది. టీడీపీ నేతలెవ్వరూ బాబు తరపున నోరు విప్పరు. ప్రజల్లో, పార్టీలో కూడా అభాసుపాలై తేలముఖం వేస్తున్న బాబుకు ప్రస్తుత దీనస్థితి స్వయంకృతాపరాధమే.ఇటీవల ఏపీ శాసనసభలో, ప్రతిపక్ష నేతగా ఉంటున్న చంద్రబాబు గారిని చూస్తే నిజంగానే నాకు పాపం అనిపిస్తున్నది. 70 ఏళ్ల వయస్సులో ఎన్నికల్లో తన పార్టీ తరపున మరే నేతా పడనంత శ్రమ ఆయన అనుభవించాడు. తన చూపుడు వేలు చూపించి ‘‘ఏం తమాషా అనుకుంటున్నారా? మీ అంతు చూస్తాను, అసలు మిమ్మల్ని ఇంత దూరం రానిచ్చిన వాళ్లెవరు?’’ అని ముఖం కందగడ్డ చేసుకుని... తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన అంగన్వాడీ మహిళలను మత్స్య పరిశ్రమ కార్మికులను, నాయీ బ్రాహ్మణులను, ఇలా నోట్లో తడిలేని జనంపై హూంకారాలు, ఘీంకారాలు చేయడం చంద్రబాబు అధికార నైజం. కానీ గతంలో కేవలం రెండు వేళ్లు కదిలిస్తూ వేదికపై కదిలే చంద్రబాబు మొన్న ఎన్నికల ప్రచార సభల్లో వేదిక నాలుగు మూలలకు వెళ్లి, జపాన్ వారి మాదిరి వంగివంగి జనానికి దణ్ణాలు పెట్టడం చూస్తుంటే ఈయనకు ఏం ఖర్మం వచ్చింది అనిపించింది. అంతేనా? ‘‘నా మాటపై విశ్వా సంతో, అర్థరాత్రి దాటినా, అక్కచెల్లెమ్మలు ఓటింగులో పాల్గొన్నారు. కనుక మా పార్టీ గెలవడం నూటికి వెయ్యిపాళ్లు ఖాయం’’ అంటూ ప్రగల్బాలు పలికారు చంద్రబాబు. కానీ ఆ ఓటరు దేవుళ్లు మాత్రం ఆయన పార్టీకి చరిత్రలో గతంలో ఎన్నడూ ఎరుగనంతటి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఆయనకూ ఆయన వెన్నుపోటు పార్టీ వారికి చివరకు పాతాళం కూడా పైనే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇంత జరిగిన తర్వాతైనా చంద్రబాబు, తన బదులు అచ్చెన్నాయుడినో బుచ్చయ్య చౌదరినో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసి, తాను పక్కన కూర్చోవలసింది అనిపిస్తోంది. ‘‘కనీసం తన పుత్రరత్నం గెల్చి ఉన్నట్లయితే–అతణ్ణి అయినా నమ్మి ఆ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవారేమో గానీ, బాబుగారు తననీడను తానే నమ్మనివాడు కదా.. ఈ అచ్చయ్యగారిని, బుచ్చయ్యగారిని నమ్ముతాడటండీ మీ పిచ్చిగానీ!’’ అని పక్కన ఉన్న నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఏమయ్యా ఎన్నయినా చెప్పు, ఆయన అలా గుడ్లప్పగించి ప్రతిపక్ష నేత స్థానం నుంచి అలా జాలిగా, బేలగా, వక్రంగా చూస్తుంటే నేను ఆయన్ని అసలు చూడలేకపోతున్నాను’’ అని అన్నాను. చివరకు నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు అని కూడా స్వయంగా తానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, స్వోత్కర్షకు పరాకాష్టగా శాసనసభ సాక్షిగా బాబు చెప్పుకోవలసి వచ్చింది అంటే ఆ వెన్నుపోటు పార్టీ దీనావస్థ తేటతెల్లమవుతుంది. కనీసం, చంద్రబాబు బదులు మరో పార్టీ శాసనసభ్యుడెవరైనా తమ నేత రాజకీయ అనుభవాన్ని పొగిడేందుకు సిద్ధంగా లేరా? హతవిధీ! అయినా చంద్రబాబు గారిదేమి జాతకమో.. ఆయన హాయిగా నవ్వగా ఎప్పుడైనా చూశామా మనం! అశేష ప్రజల ప్రేమాభిమానాలు పొందిన దివంగత సీఎం వైఎస్సార్ కూడా చంద్రబాబుతో శాసనసభలోనే ‘కాస్త నవ్వవయ్యా అలా ముఖం మాడ్చుకు కూర్చోకుండా’ అని అంతటితో ఆగకుండా, ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం ఒక రోగం’ అనే మాటను ఉటంకించారు. దాంతో చంద్రబాబుగారు ఉడుక్కున్నారు. ఇప్పుడు ఆ వైఎస్సార్ తనయుడు, అన్నింటా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న సామర్థ్యం, హృదయం గల యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయినా బాబుగారి పరిస్థితి అదే! పైగా వైఎస్ జగన్ నిష్కల్మషంగా, నవ్వుతుంటే ఏమిటలా నవ్వడం, హుందా లేకుండా అని బాబుగారు ఉక్రోషం ప్రదర్శిస్తున్నారు. దానికి తోడు సూటిగా బుగ్గన, అంబటి వంటి నేతలు వాగ్బాణాలు సంధిస్తే, పాపం.. వాటికీ చంద్రబాబే బదులివ్వాల్సి వస్తోంది. టీడీపీ నేతలెవ్వరూ బాబు తరపున నోరు విప్పరు. చివరకు ప్రతిపక్ష సభ్యులు ఎవరు కూడా చంద్రబాబు ఏదైనా అభ్యంతరం చెబుతూ సమాధానమిస్తూ ఉంటే ఆయనకు అండగా తమ తమ స్థానాల్లో కూర్చున్నవారు లేవలేదు. సహజంగా అలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడి మాట్లాడతారు. ప్రతిపక్షనేత కూర్చుంటారు. బాబుగారూ కాస్త ఉక్రోషపడకుండా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షనేత పదవిని మీరే ‘ఫెవికాల్’ అంటించుకుని కూర్చోవాలా? ప్రస్తుతం ఉన్న మీరు కాకుండా 22 మంది శాసనసభ్యుల్లో ఆ హోదాకు అర్హులెవరూ లేరని మీ అభిప్రాయమా? లేదా మీ 23 మందిలో ఎందరు మీ పార్టీని వదిలి వెళ్లిపోతారో అన్న భయమా? అనైతిక, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులను ప్రోత్సహించి మా పార్టీలోకి మరోపార్టీ ప్రజాప్రతినిధి చేరాలనుకుంటే, తానప్పుడు ఉన్న పార్టీకే కాదు.. తన చట్ట సభ సభ్యత్వానికి కూడా రాజీనామాలు ఇచ్చి రావాల్సి ఉంది అని స్పష్టంగా వైఎస్ జగన్ శాసనసభ తొలి సమావేశంలోనే చెప్పారు. లేకుంటే గత శాసనసభలో మీరు నైతికతను, రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కినట్లు చేసి ఉంటే.. మీరు, మీ పుత్రరత్నం, మీ వియ్యంకుడితోపాటు ఇంకెవరైనా ఒకరిద్దరు మీ వెన్నుపోటు పార్టీలో మిగిలేవారేమో! అయినా తస్మాత్ జాగ్రత్త! తెలుగుదేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ఈ దీనావస్థ నుంచి కూడా తేరుకుంటాం.. అని మీకు మీరు థూ.. థా.. అంటూ వెన్నుమీద చరుచుకుని ధైర్యం చెప్పుకోవాలనుకుంటున్నారేమో? బాబుగారూ అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు గుంట కాడ నక్కలాగా మీ పార్టీ సభ్యులను ఎగరేసుకుపోయేందుకు మోదీ అమిత్ షాల మతతత్వ, కుతంత్రాల పార్టీ బీజేపీ కాచుకుని ఉన్నది. ఆగస్టు నెల మీ పార్టీకి అచ్చిరాదని, అనుకుంటూ ఉంటారు కదా! సెప్టెంబరులో మీ శాసనసభ్యులలో మూడింట రెండువంతుల మందిని అంటే ఒక 16 మందిని తమ వైపు లాక్కుని వారిచే తమ వెన్నుపోటు పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామని బీజేపీ సభ్యులుగా తమకు గుర్తింపు ఇవ్వాలని, ప్రకటింప చేస్తే ఎలాగూ ప్రస్తుతం ఉన్న మీ ప్రతిపక్ష నేత పదవి కూడా పోతుంది. ఆ పరిస్థితి రాకముందే, మీ వెన్నుపోటు పార్టీలో మరొకరికి ప్రతిపక్ష హోదా ఇప్పిస్తే, మరొక్కరైనా మీతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికారాంతమునందు జూడవలెరా ఆ అయ్య సౌభాగ్యముల్! అన్నట్లు మీ పరిస్థితి చూసి నిజంగా బాధపడుతూ మీ పట్ల సానుభూతితోనే మీకిస్తున్న నా సలహాను, వాస్తవ స్ఫూర్తితో గ్రహించగోరుతాను. పైగా, పోలవరం, రాజధాని నిర్మాణం, అక్రమ భూదందాలు, సదావర్తి సత్రం భూములు, రాష్ట్రంలో వివిధ చోట్ల ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కోసం మీ భూ సమీకరణాల భాగోతం, స్వరాష్ట్ర, స్వదేశీ, సింగపూర్ వంటి పారిశ్రామిక దొంగల ముఠాల గుట్టు, మీ మిత్రుడు సుజనా చౌదరి రట్టు అంతా ఇవ్వాళ గాకున్నా, ఇంకో నాలుగైదు నెలల్లో బయటపడనున్నదని అంటున్నారు. ఆ ప్రభావ తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో! ఒకవేళ ఖర్మం చాలక, బీజేపీ మీ పార్టీని దాదాపు ఖాళీ చేసి తన ఖాతాలో వేసుకుంటే, అది మీకు ఆ బీజేపీ వారికే కాకుండా, యావత్ రాష్ట్రానికే ప్రమాదం. అదే జరిగితే, మీ వెన్నుపోటు పార్టీ ఉనికే లేనంతటి తీవ్ర పరిస్థితి ఏర్పడవచ్చు. అయినా నా పిచ్చిగానీ, ఆ పార్టీ ఆ పదవి మీరు మీ కృషితో నిర్మించుకున్నవి కావు గదా. అవన్నీ పాపం, అమాయక చక్రవర్తి నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి కపట మాయోపాయాలతో కాజేసినవే కదా! అవి మీవి కావు కనుక పోతే పాతాయ్. ఎవడు గన్న బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడన్నట్లు, మీకేమీ బాధ ఉండకపోవచ్చు! కానీ మీకు ఈ సిరిసంపదలు, స్వదేశీ విదేశాల్లో ఆస్తులు సంపాదించిపెట్టిన పార్టీ అన్న భావంతో అయినా కనీస కృతజ్ఞతాపూర్వకంగా, ఒకవేళ మీ వెన్నుపోటు పార్టీ కనుమరుగే అయితే, రెండు కన్నీటి బొట్లు అయినా రాలుస్తారో లేదో? ఎందుకంటే కృతజ్ఞత అనేది మీ నిఘంటువులో లేదు కదా! బీజేపీ వారికీ మీ పార్టీవాళ్లు తమతో చేరినందువల్ల వచ్చే అదనపు ప్రయోజనం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో భ్రష్టుపట్టిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి అన్ని విలువలూ లుప్తమైనవారు ఎంతమంది చేరితే మాత్రం బీజేపీకి ఒరిగేది ఏముంటుంది? పైగా అలా వచ్చిన టీడీపీ నేతలు చంద్రబాబు పాఠశాలలో వెన్నుపోటు పాఠాలు బాగా నేర్చుకుని, ఆరితేరినవారే కదా! తమకు అవసరం అనుకుంటే ఈ బాపతు నేతలు అవకాశం వస్తే అదే వెన్నుపోటు విద్య బీజేపీ వారిపై ప్రయోగించరనీ చెప్పలేము. అలాంటి బీజేపీకి ఆంధ్రప్రజానీకం గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లిచ్చి, వారి స్థానం ఏమిటో వారికి బాగా తెలియజెప్పారు. అయినా సరే 2024లో ఏపీలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఒక మహాస్వప్నం కంటున్నారు బీజేపీ పార్టీ మహిళా నేత ఒకరు.. కానీ మతోన్మాదం, జాతీయోన్మాదం, కుహనా దేశభక్తి తెలుగు జాతి స్వభావం కాదు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని మా తెలుగు జాతి మాతృమూర్తిని నిత్యం స్మరించుకుంటూనే ఈ నేలపై కులమతోన్మాదాలకు, హింసాపూరిత జాతీయోన్మాదానికి తావులేదు. ఈ విషయాన్ని మా సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గ కూర్పులోనే నిరూపించారు. మా ప్రజలు 2019 ఎన్నికల్లోనూ కుల, మత ఉన్మాదాన్ని తోసిరాజన్నారు. కనుక ఈ రాష్ట్రంలో 2024లో తాము అధికారంలో రానున్నట్లు, ఇప్పుడు శాసనసభలో ఒక్క సభ్యుడు లేకున్నా, గోడలు దూకిన వారితో కలిసి ఇప్పుడే తాము ప్రధాన ప్రతిపక్షం అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, వెన్నుపోటు పార్టీలోని వెన్నుపోటు దార్ల అండ చూసుకుని కలలు కనడం ఎండమావిలో దాహం తీర్చుకోవడమే! ఏమైనా వైఎస్ జగన్ తానిచ్చిన నవరత్నాల కార్యక్రమాన్ని సాగిస్తున్నంత వరకు ఆయన రైతు, మహిళా, యువత, దళిత, గిరిజన మైనారిటీలు, కష్టజీవుల ఆకాంక్షలకు అనువుగా పాలన సాగిస్తున్నంతవరకు అవినీతిరహిత పారిశ్రామికాభివృద్ధి వైపుగా, కమీషన్ల కోసం కక్కుర్తి పడకుండా రాష్ట్రాన్ని నిరంతరం సస్యశ్యామలం చేసే ప్రస్తుత దీక్షా, పట్టుదల, కృషి సాగిస్తున్నంతవరకు, వైఎస్సార్సీపీకీ, వైఎస్ జగన్‌కి ఓటమి ఉండదు. ఇది తథ్యం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
జనజాగృతే ప్రజాస్వామ్యానికి రక్ష
ఈవీఎంల ట్యాంపరింగ్ కంటే రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియే అపభ్రంశమయ్యే ప్రమాదం పొంచి ఉంది. బాబు ఇంట్లో పిల్లి ఈనింది కనుక శాంతిభద్రతలు కాపాడాలన్న చందంగా చీటికీ మాటికీ ప్రతిపక్ష నేతలను ముందస్తు నిర్బంధం చేయడం, ప్రతిపక్షాల సభలు, ప్రచారం జరుగకుండా క్షణాల మీద 144వ సెక్షన్ విధించడం సాధారణమైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వసించి తీరిగ్గా, నిర్భయంగా ఓటు వేయవచ్చనుకోవడం అమాయకత్వమే అవుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏ ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలు జరిగితే అప్పుడు నిజంగానే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. ఎప్పుడు తాను ఎన్నికల్లో గెలుపొందాలనుకున్నా, కమ్యూనిస్టులు, బీజేపీ, పవన్ కల్యాణ్ ఇలా ఎవరి భుజాలమీదో స్వారీ చేసి, ఏరుదాటిన తర్వాత తెప్పతెగలేసినట్లు 2014లో అయితే ముక్కీ మూలిగీ కేవలం 1 శాతం తేడాతో వైఎస్సార్ సీపీపై గెలిచారు చంద్రబాబు. ఇవ్వాళ వారెవ్వరూ తనతో పొత్తు కట్టలేని పరిస్థితి వచ్చేసింది చంద్రబాబుకి. కాంగ్రెస్‌పై స్వారీ చేద్దామనుకుంటే ఆ గుర్రం కూడా సిద్ధంగా లేదు. పోనీలే సరిపెట్టుకుందామనుకుంటే మొన్నటి తెలంగాణలో తమ పొత్తుతో ఆ గుర్రమూ తన నడుము విరిగి కిందపడిన చందంగా అవుతుందేమోనన్న భయం పట్టుకుంది. ఇతర రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్‌ను గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలని ఆ నేతలతో బాబు చెబుతుంటే ఆప్, బీఎస్పీ, ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు చాటుగా, ‘ఈయనేంటీ.. ఇక్కడికొచ్చి కోతలు కోస్తున్నారు కానీ ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో గెలిచి రమ్మనండి’ అని చెవులు కొరుక్కుంటున్నారట. ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక వాళ్లు వచ్చి తమ ఓట్లతో గట్టెక్కిస్తారేమో అన్న దింపుడు కళ్లం ఆశ ఏదో బాబుగారికి ఉన్నట్లుంది. ఇక్కడ మనరాష్ట్రంలో మాత్రం ఇంట్లో ఈగల మోతగా ఉంది. టీడీపీవాళ్లకు తమ పార్టీపైనా, తమ నేత చంద్రబాబు కుటిలరాజకీయ చాణక్యంపైన కూడా విశ్వాసం సడలింది. తమనేతనే ఆదర్శంగా చేసుకుని తమ పరిధిలో దోచుకునేందుకు, దాచుకునేందుకు పదవీ అహంకారంతో జనంపై జులుం చెలాయిస్తూ పంచాయితీలు చేస్తూ, ఎప్పుడైనా రాజకీయాలు మాట్లాడాల్సివస్తే వైఎస్ జగన్‌ని విమర్శించడమూ మోదీ నమ్మక ద్రోహం గూర్చి ఘాటుగా విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీకీ, బాబుకూ నమ్మకస్తుడిగా మిగిలింది చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ మాత్రమే అనిపిస్తోంది. చంద్రబాబు 68 ఏళ్ల వయస్సులోనూ మనవడితో ఆడుకోకుండా అహర్నిశలూ ప్రజల గూర్చే శ్రమిస్తున్నారు అని లోకేశ్ తన తండ్రిని పొగడుతుంటే లోకేశ్‌ను చూసి కన్నతండ్రిగా గర్వంగా ఉంది అని బాబుగారు ఆనందపడ్తున్నారట. అయినా స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని పురాణం సుబ్రహ్మణ్యం ఏదో సందర్భంగా రాసినట్లే టీడీపీ వాళ్లందరూ భజన చేసుకునే పరిస్థితికి వచ్చారు. సంక్రాంతి సమయంలో పిట్టలదొర భిక్షాటన చేసుకుంటూ వాగేటట్లుగా వాజ్‌పేయిని ప్రధానిని చేశాను, అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేశాను, దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయనేతను, గాంధీలాగా జీవిస్తున్నాను, సరిరారు నాకెవ్వరూ వంచనలో గానీ, మందిని ముంచడంలో గానీ అంటూ తనకు తానే స్తోత్ర శ్లోకాలు వల్లించుకునే పరిస్థితి వచ్చింది. ఇవి ఇక చాలులే అన్నట్లుగా టీడీపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఇతర నేతలూ చంద్రబాబు సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నారు. వైఎస్సార్సీపీలో చేరుతూ, ధైర్యంగా తమకు బాబుగారి పార్టీలో జరిగిన అవమానాలు, తమ నేత కులపిచ్చి మాటల మాంత్రికత గురించి కథలుకథలుగా చెబుతున్నారు. ఇప్పుడేం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ఆయనలో అసహనం పెరిగిపోతోంది. న్యాయం చేయాలని తన వద్దకు వచ్చిన వారిని వారు ఏపనిమీద వచ్చారో వినేందుకు కూడా విముఖతతో ఆడవారు, మగవారు అనే తేడా కూడా లేకుండా ఏం.. తమాషాగా ఉందా, తాట వలుస్తాను అంటూ ఉగ్రరూపం దాల్చే పరిస్థితికి వచ్చారు. ఇక మాటలతో కాదని తెగించేదాకా వచ్చారు. పోలీసుశాఖలో ప్రజల మాడు పగలగొట్టేందుకు తమ కనుసన్నలలో పనిచేసి తన కులానికి చెందినవారిని కొన్ని ప్రత్యేక పదవుల్లో నియమించుకుంటున్నారు. ఆ పార్టీలోనే ఈ కులగజ్జిని భరించేసిన ఆయన కులానికి చెందిన కొందరు నేతలే బాబుగారి కుల దురహంకారం గూర్చి చెబుతున్నారు. చంద్రబాబు పోలీసుశాఖని టీడీపీకి ఆర్డర్లీగా మార్చుకుని వారిచే చేయరాని పనులను కూడా చేయించుకుంటున్నారు. టీడీపీ వ్యతిరేకులపై తప్పుడు కేసులు బనాయించి, ప్రజలను ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. అయినా చంద్రబాబు అధికార దుర్వినియోగం బయటపడుతూనే ఉంది. ఇటీవల వైఎస్సార్ సీపీ నేత వసంతకష్ణప్రసాద్పై ఒక ఎస్ఐ చేత తనకు లంచం ఇవ్వచూపి ఎన్నికల్లో తనకు సహకరించమని కోరినట్లు తప్పుడు కేసులు పెట్టించారు. కృష్ణప్రసాద్ ఈ ఉడత ఊపులకు బెదిరే రకం కాదు కనుక ఎదురుతిరిగి ఎన్నికల కమిషన్‌ను నేరుగా కలిసి ఈ అన్యాయాన్ని వివరించారు. చివరకు ఆ పోలీసు అధికారులనే ఎన్నికల కమిషన్ తనకు తానుగా బదలాయించింది. ఇక ప్రింట్, టీవీ మీడియాలో తమకు అనుకూలంగా ఉండే వాళ్లతో వ్యక్తిగత భజన చేయించుకోవడం జగమెరిగిన సత్యమే. ఈ అనుకూల యాంకర్లే ప్రభుత్వంపై పక్షపాత వ్యాధితో వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు ప్రత్యేక హాదానే తీసుకుందాం. చంద్రబాబు అనుకూలుడైన ఆ యాంకర్ అయితే, ‘సరే, జరిగిందేదో జరిగింది. బాబు మాట మార్చారా లేదా అనేది కాదు. ప్రస్తుతం రాష్ట్రానికి హోదా కోసం అవన్నీ పక్కనబెట్టి రాజకీయ పార్టీలన్నీ కలిసి వస్తారా లేదా ఇలాగే పరస్పరం బురద జల్లుకుంటూ ఉంటారా’ అంటూ పరమ అమాయకంగా రాష్ట్ర పురోగమన వాంఛాపరుడిగా ప్రశ్నిస్తుంటాడు. ‘చంద్రబాబుకి మోదీ నమ్మకద్రోహం చేశారు అనేది వాస్తవమా కాదా’ అని దమ్మున్న ఛానల్ యాంకర్ ప్రశ్నిస్తాడు. ‘అందుకని చంద్రబాబు తెలుగుప్రజలకు నమ్మక ద్రోహం చేయవచ్చా’ అని చర్చలో పాల్గొన్నవారు ఈ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు మోదీ భక్తిని వివరించబోతే, ‘అదంతా మనకు తెలిసిందే, అవన్నీ చాలాసార్లు చర్చించినవే. ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి కలిసికట్టుగా హోదా కోసం పోరాడాలా లేదా’ అని మళ్లీ మళ్లీ అడుగుతాడు. ఇలా చంద్రబాబు దోషాలను, చేసిన పాపాలను చర్చకు రాకుండా చేయడం జరుగుతోంది. సాక్షి దినపత్రిక ఛానల్ లేకపోయినట్లయితే, ఇంతమాత్రంగానైనా ప్రజలకు ఆ చంద్రబాబు వందిమాగధుల అసత్య ప్రచారంలో మోసపోకుండా వాస్తవాలు తెలిసే అవకాశం వచ్చి ఉండేది కాదు. తాము నిర్భయులమని, తాము ప్రచారం చేసే వార్తల్లో నిజాయితీ ఉంటుందని, తమకు ఏ పార్టీపట్లా పక్షపాతం లేదని బుకాయించేస్తూంటుంది బాబు ముసుగు మీడియా. ఇటీవల రెండు మూడు ఛానళ్లు కొంచెం ధైర్యం చేసి తమ స్వతంత్రతను చాటుకుంటున్నాయి. అందుకు వారికి అభినందనలు. ఎలాగోలా ఈ ఎన్నికల గండం గడిచి బయటపడితే చాలన్నట్లు కల్ల బొల్లి వాగ్దానాలు చేస్తున్నారు బాబు. పదవీకాలం అస్తమించే సమయం ఆసన్నమైనప్పుడు ఇంకా మోసపూరిత వైఖరిని విడనాడకుండా ఇన్నాళ్లూ తాను వంచించిన రైతులు, మహిళలు, నిరుద్యోగులు, బీసీలు, కాపులూ ఇలా ఒకరేమిటి? అందరికీ కొత్త కొత్త తాయిలాలు పంచిపెడతా నని అదీ ఎన్నికల అనంతరం చెల్లుబాటు అయ్యే చెక్కుల ద్వారా అంటే తన ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత చెల్లించే పద్ధతిలో ఊదరగొట్టే ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారు. వాటన్నింటినీ కొంత సొంత పొగడ్తలతో ఆయన బినామీ మీడియా ఈ పథకాలతో ఒక్కసారిగా ప్రజాభిప్రాయం బాబుకు అనుకూలంగా మారినట్లు, చివరి దశలో తులసితీర్థం పోయక తప్పదన్నట్లు వండి వారుస్తున్నాయి. అయితే దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా, దశాబ్దం పాటు ప్రతిపక్ష నేతగా బాబును గమనించిన ప్రజలు ఆయన తప్పుడు వాగ్దానాలను గ్రహించి అదను చూసి తనకు తిరుగులేని పాఠం చెప్పాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు మొక్కవోని పట్టుదలతో, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యేకహోదా విషయంలో తొలినుంచి మాట మార్చని మడమతిప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకుంటున్నారు. కీలెరిగి వాత పెట్టే అదను కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రజల ఆశ నెరవేరేందుకు, చంద్రబాబు దుష్టపాలన వదిలించుకుని వైఎస్ జగన్ నేతృత్వాన తమ పాలనను ప్రజలు పొందడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇకపై ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు, తమ కోర్కె నెరవేరేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందుగా ఈ ఎన్నికలు సజావుగా జరిగేటట్టు ఏ చిన్న అవరోధమూ అడ్డు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరంతర జాగరూకతతో మెలగాలి. ఇప్పటికే దొంగ ఓట్లు, తమ పార్టీ వారి ఓట్ల తొలగింపు, పోలీసు యంత్రాంగం పాలకవర్గపార్టీ పని మనుషులుగా వ్యవహరిస్తున్న తీరును వైఎస్సార్సీపీ ఎండగట్టింది. రెవెన్యూ వంటి శాఖల్లో అధికారులు బాబు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న తీరును సంబంధిత సంస్థలకు, ఉన్నతాధికారులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేస్తుండటం సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనబడుతోంది. కానీ ఇవి మాత్రమే సరిపోవు. ఓట్ల జాబితా నుండి లెక్కింపు ఫలితాల ప్రకటన దాకా అన్నింటా అక్రమాలకు అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కంటే ఈ పోలింగ్ ప్రక్రియే అపభ్రంశమయ్యే ప్రమాదం ఎంతగానో ఉంది. బాబు ఇంట్లో పిల్లి ఈనింది కనుక శాంతిభద్రతలు కాపాడాలన్న చందంగా చీటికీ మాటికీ ప్రతిపక్ష నేతలను ముందస్తు నిర్బంధం చేయడం, ప్రతిపక్షాల సభలు, ప్రచారం జరుగకుండా క్షణాల మీద నిషేధం,144వ సెక్షన్ విధించడం సాధారణమైంది. ప్రతిపక్షనేతలపై బాబు ప్రభుత్వ దాడులు, ముందస్తు గృహనిర్బంధాలు, భౌతిక దాడులు చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రమే విశ్వసించి పైపంచలు భుజాన వేసుకుని తీరిగ్గా నిర్భయంగా ఓటు వేయవచ్చనుకోవడం అమాయకత్వమే అవుతుందన్న భయం కూడా ఉంది. నిన్నటికి మొన్న కొండవీడు ఉత్సవాల కోసం బాబు హెలి కాప్టర్ దిగేందుకు పొలాలను ధ్వంసం చేసి, దాన్ని అడ్డుకున్న కౌలు రైతు కోటయ్యను టీడీపీ కార్యకర్తలు, పోలీసులు చితకబాది చంపేసిన ఘట నలో చంద్రబాబు కనీస మానవత్వంతో వ్యవహరించలేదు. బాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం బరితెగింపునకు వ్యతిరేకంగా పోలింగులో ప్రతి వ్యక్తీ నిర్భయంగా పాల్గొని తన ఓటుహక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు చేపట్టాలి. పాలకపక్షాల దౌర్జన్యాన్ని ఎదుర్కొని మీ హక్కులు కాపాడతాం అనే భరోసా ప్రజలకు కలగాలి. ప్రజల నిరంతర వాస్తవిక జాగరూకతే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. మన దేశ రక్షణకోసం, మన ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్న వీర జవాన్లను మనం సహజంగానే కీర్తిస్తాం. అదేసమయంలో ప్రభుత్వాలను ఎన్నుకునే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరిగేలా చూస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణా కర్తవ్యం నిర్వహించే స్వచ్ఛంద ప్రజా దళాలు కూడా కృతజ్ఞతకు, అభినందనలకు అన్నివిధాలుగా అర్హులవుతారు. డాక్టర్ ఏపీ విఠల్, వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
వంచన ఇంకెన్నాళ్లు?
విశ్లేషణ ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడిందీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుకున్నదీ, ప్రపంచ స్థాయి మహోన్నత రాజధాని పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు సేకరించిందీ ఎందుకు? తనవారి, వందిమాగధుల ఎస్టేట్లు పెంచి, పోషించుకోవాలని కదా! కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడు మరొకడు అన్నట్లయింది మోదీతో పొత్తు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే అఖిల భారతాన్నే అన్యపక్ష విముక్త భారత్ చేయాలని ఆత్రంగా ఉన్నారు మోదీ. పత్రికలలో వాణిజ్య ప్రకటనల పటాటోపం గురించి ‘సాక్షి’ వ్యాసాలలో పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు వందేళ్ల క్రితం రాసినది గుర్తు కొస్తున్నది. ‘కోతి మార్కు నల్ల పళ్లపొడి మీ దంతములను పాలవలె తెల్లగా శుభ్రపరుచును, అన్న ప్రకటనను పత్రికలో చదివినంతనే మరునాడుద యము వరకు పండ్లుండునో లేదో అన్నట్లు హడావిడి పడిపోయి కొనితెచ్చు కొందుము. మాటకున్న వేగము గాలికెక్కడిది?’ అంటూ జంఘాలశాస్త్రి చేత అనిపించారు. రోజులు మారిపోయాయి. ఏది ప్రకటనో, ఏది వార్తో గుర్తిం చలేనంతగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు కొన్ని పత్రికలు తమ రాజకీయ దృక్పథం ఏమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఉదా: సాక్షి దినపత్రిక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రచురిస్తుంది. ఒకప్పుడు మార్క్సిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తి మీద సుత్తీ కొడవలి నక్షత్రం కనిపించేవి. దీనివల్ల పాఠకుడు పత్రిక స్వభావం విషయంలో వంచనకు గురయ్యే అవకాశమే లేదు. కొన్ని పత్రికలు అలా కాదు. అవి ఎలా ఆరంభమైనప్పటికి తమది ‘నిర్భయంగా నిజాలు చెప్పే పత్రిక’ అంటూ,l‘నిష్పక్షపాతంగా’ ఉంటా మంటూ, ‘దమ్ము ధైర్యం’తో వాస్తవాలనే ప్రచురిస్తాం అని చెప్పుకుంటూ శుద్ధ వక్రీకరణలకు, అవాస్తవాలకు పెద్ద పీట వేస్తాయి. ఏదో రాజకీయ పార్టీకి ప్రకటనలనదగ్గ వార్తలను వండి ప్రజలకు వడ్డిస్తుంటాయి. నిర్భయం, నిజా యితీ వంటి మాటల మాటున అలాంటి వంచక తాటస్థ్యం జుగుప్సాకరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో నా అనుభవం ఒకటి చెబుతాను. అప్పుడు నేను ది హిందూ పత్రిక పాఠకుడిని. 1976లో అనుకుంటాను. మద్రాసును తుపాను ముంచెత్తింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మద్రాసులో పర్యటించారు. సన్నగా చినుకులు పడుతున్నాయి. సంజయ్ ముందు నడుస్తున్నారు. ఆయన వెనుక నాటి తమిళనాడు ముఖ్య మంత్రి సుబ్రహ్మణ్యం, ఆయన మంత్రులు, ఇతర అధికారులు నడుస్తు న్నారు. ఎవరో సంజయ్‌గాంధీకి గొడుగు కూడా పడుతున్నారు. అప్పటికి సంజయ్‌కి ఎలాంటి అధికార పదవి లేదు. ఈ ఫొటోను ది హిందూ మొదటి పేజీలో ప్రచురించారు. వెంటనే ఆ పత్రిక ఎడిటర్ పేరున ఒక ఉత్తరం రాశాను. ‘ది హిందూ వంటి ప్రతిష్టాత్మకమైన పత్రిక కూడా ఇలాంటి ఫొటోను ప్రచురించడం ‘తల వంచుము ప్రభుత్వం ఆదేశిస్తే’ అంటూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేసినట్టుంది అని రాశాను. తరువాత కొంత కథ నడిచింది. అది అప్రస్తుతం. అదే సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అధిపతి రామనాథ్ గోయెంకాకు సంబంధించి జరిగిన ఉదంతం గురించి మాకినేని బసవపున్నయ్య ఒక సందర్భంలో చెప్పారు. ఇందిరమ్మ కుటుంబానికి విధే యంగా ఉండమని గోయెంకాపై ఒత్తిడి తెచ్చారట. అందుకు గోయెంకా ఆంధ్రప్రభ, దినమణి వంటి పత్రికలను వారి కుటుంబ సభ్యులే తీసుకోవచ్చు నని, ఒక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన అధీనంలో ఉంచుకుంటానని చెప్పారట. ఈ లోకంలోకి మొలతాడు కూడా లేకుండా వచ్చాను, అలాగే మొలతాడు లేకుండానే పోతాను, అంతేగానీ తల వంచను అని గోయెంకా అన్నాడని మాకినేని చెప్పారు. నిజానికి ఈనాడు కూడా సంజయ్‌గాంధీలు ఉన్నారు. చంద్రబాబు చరిత్ర వినండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర ఈ తరం వారికి తెలియకపోవచ్చు. తన మామగారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనీ, ఎన్టీఆర్‌ను మొదట ఆయన అవహేళన చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసి భంగపడ్డారు. ఆ తరువాత దొడ్డిదారిన ఎన్టీఆర్ పంచన చేరారు. ఎన్టీఆర్ దగ్గర తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరడం లేదని పార్టీలోనే ఉన్న కొందరి ప్రోత్సాహంతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఆయనను పదవీ భ్రష్టు డిని చేసి పార్టీనీ జెండానీ అప్రజాస్వామికంగా తన సొంతం చేసుకున్నారు చంద్రబాబు. నాటి స్పీకర్ (నేటి ఆర్థికమంత్రి), నాటి గవర్నర్ల అండదండ లతో దొడ్డిదారిన అందలం ఎక్కారు చంద్రబాబు. అందుకే ప్రస్తుత తెలుగు దేశం పార్టీని చంద్రబాబు తెలుగుదేశం అని ప్రత్యేకంగా పేర్కొనాలి. లేదా తెలుగుదేశం (వి) అని పిలవడం సమంజసం. కానీ చంద్రబాబును వెన్ను పోటు పొడవడానికి అల్లుడు లేడు. తన తనయుడు లోకేశ్‌నే అప్రకటిత వార సునిగా మంత్రిని చేశారు. కొడుకు అయినంత మాత్రాన అనర్హుడని కాదు. ప్రజాఉద్యమాలలో కానీ, రాజకీయాలలో గానీ ప్రమేయం లేని, కొంచెమైనా అర్హత లేని వారిని అందలం ఎక్కించడమే ప్రశ్నార్థకం. సొంత బలం హుళక్కి ఇవేమీ దృష్టిలో లేనట్టు చంద్రబాబు (వి) పార్టీనీ ఆ పార్టీ నేత చంద్ర బాబునూ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయగల సమర్థుడంటూ వార్తలు ప్రచు రిస్తున్న పత్రికలను ఏమనాలి? ఒక్క ఎన్నిక అంటే ఒక్క ఎన్నిక అయినా చంద్రబాబు (వి) స్వతంత్రంగా గెలిచారా? బీజేపీ, వామపక్షాలు ఇలా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు (వి) గెలిచి అధికారం పొందిన సందర్బం లేదు. తాను 2002లో తీవ్రంగా విమర్శించిన ‘మోదీ’ నేతృత్వాన బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఇంకా రాజకీయ అరంగేట్రం పూర్తిగా చేయని ‘కొణిదల పవర్ స్టార్’ను ఇంటికి వెళ్లి మరీ బ్రతిమలాడి తెచ్చుకుని 2014లో గెలిచారు. వీటికితోడు అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి, కేవలం 1.6 శాతం ఓట్లతో గెలిచిన చంద్రబాబు రాజకీయం తెలుగు పత్రికా రంగ ప్రముఖులకు, మీడియా నేతలకు తెలియనిదా? ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడిందీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుకున్నదీ, ప్రపంచ స్థాయి మహోన్నత రాజధాని పేరుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు సేకరించిందీ ఎందుకు? తనవారి, వందిమాగధుల ఎస్టేట్లు పెంచి, పోషించుకోవాలని కదా! కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడు మరొకడు అన్నట్లయింది మోదీతో పొత్తు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే అఖిల భారతాన్నే అన్యపక్ష విముక్త భారత్ చేయాలని ఆత్రంగా ఉన్నారు మోదీ. ‘మోదీ–షా’ ఇరువురూ కలిసి చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు. అయినా నాలుగేళ్లుగా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ రాగలిగారు చంద్రబాబు. ఈలోపల ప్రజలు కూడా చంద్రబాబు నైజం తెలుసుకోసాగారు. ప్రతి పక్షం వైఎస్పార్సీపీ ఉద్యమం, వామపక్షాలు, పౌర సమాజం తరఫున ప్రత్యేక హోదా సాధన సమితి వాదన ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ సీపీ నేత పాదయాత్ర వలన చంద్రబాబుకు దిక్కు తోచని స్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు తాను సైతం ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తు న్నట్లు ‘నటన’ మొదలెట్టారు. ప్యాకేజీ మంచిదని చెప్పి తాను ప్రజలను మోసం చేసిన విషయం మరచిపోయి, తానే మోసానికి గురైనట్టు, బీజేపీ తనను మోసం చేసినట్టు ప్రచారం చేయించుకోసాగారు. ఇన్నాళ్లు హోదా విష యంలో ప్రజలను వంచించి, ఇప్పుడు మాట మారుస్తూ ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నానంటున్నారు. ఇప్పుడనిపిస్తుంది. సాక్షి పత్రిక, సాక్షి చానల్ లేకపోయినట్లయితే ప్రత్యేక హోదా పరిస్థితి, పోరాటం గురించిన వాస్తవాలు మాత్రమే కాదు, బాబుగారి బండారం కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఒకరిని మించి ఒకరు చంద్రబాబు (వి) భక్త బృందాలు పోటీపడి ప్రజలను చెవిటివారిగా, మూగవారిగా చేసే యత్నం చేశాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజల తరఫున సాక్షికి కృత జ్ఞతలు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మీడియా కర్తవ్యం మరచిపోరాదు ఇక్కడే ఒక విషయం ప్రస్తావించాలి. మీరు మార్క్సిస్టు విశ్లేషకుడినని చెప్పు కుంటారు కదా, రేపు సాక్షి బీజేపీకి మతతత్వంతో జత కడితే ఏమంటారు? అంటూ మిత్రులు, మిత్రులు కాని వారు కూడా అడుగుతూ ఉంటారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత ఒక స్పష్టత ఇచ్చారు. ‘ఏ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకే మా మద్దతు. రేపు ఆ పని బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇంకో కూటమి చేసినా వారికి మా పార్టీ మద్దతు ఉంటుంద’ని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న కీలక సమస్య అది. అది నెరవేరాలంటే తెలుగు ప్రజలంతా కలసి పోరాడాలి. అందుకు కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెడతాం మీరూ కలసి రండి లేదా మీరు పెట్టండి మేం బలపరుస్తామని చెప్పింది వైఎస్పార్సీపీ. వైస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే బలపరుస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ పది గంటలు గడచే లోపునే మాట మార్చారు. ఈ రాజకీయ పోరాటంలో తాను తన పార్టీ నాయకునిగా కాక, అనుచరుడినయ్యానని, ప్రజలలో చులకన అవుతానని అనుకున్నారో ఏమో మళ్లీ మాజీ మంత్రి సుజనా చౌదరి ద్వారా కేంద్రంతో లాలూచీ యత్నాలు చేశారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు బినామీ మీడియా ఒక సూటి ప్రశ్న సంధించింది. చంద్రబాబు తప్ప మరె వరూ అడగలేడన్నట్టు బినామీ పత్రిక తాటికాయలంత అక్షరాలతో మొదటి పేజీలో ఆ ప్రశ్నను ప్రచురించింది. ఆ ప్రశ్న ఏమిటంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పక్షాన ఉన్నారా? లేదా రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తెలుగు దేశం (వి) తరుఫున ఉంటారా? మీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటారా? పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారా అన్నట్టే ఉంది ప్రశ్న. దీనిని గ్రహించలేనంతటి అమాయకులు కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ పరిస్థితిలో చంద్రబాబు చివరి అస్త్రం ఒకటి సంధించేందుకు యత్ని స్తున్నారు. తన వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మరో తృతీయ ఫ్రంట్ రాదా అని ఆశతో యత్నిస్తున్నారు. ఈసారి విజయం వైఎస్సార్‌సీపీదేనని అందులో అను మానం లేదని తెలుగు ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ప్రజాగ్రహంలో చంద్ర బాబుతో కలసి మసై పోవడానికి ఏ ఇతర విపక్షం సాహసించదు. అంతగా అయితే వైఎస్సార్ సీపీతో ఐక్య సంఘటన కట్టలేకపోయినా తెలుగు దేశం (వి) వ్యతిరేక ఓటు చీలకుండా ఆ పార్టీతో పరస్పర పోటీ నివారణ చేసుకునే అవగాహనకైనా అవి సిద్ధపడతాయి. ఈ పరిణామాలను, వాస్తవాలను గ్రహించడం మీడియా కర్తవ్యం. ఇప్పటికైనా మీడియా కొంత నిజాయి తీగా ఉండాలి. నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రపత్రిక స్థాయి లేకున్నా సత్యా న్వేషణ చేయడానికి, ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఇక ముందు మన మీడియా సహకరిస్తుందనుకోవడం దురాశ కారాదు. - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
యాభై వసంతాల ‘మేఘ గర్జన’
గత 50 ఏళ్ల నక్సల్బరీ పోరాట ప«థంలో ఎంత మంది బలి అయివుంటారు? మావోయిస్టు పార్టీ యోధులు, సానుభూతిపరులు తదితరులు ఇంకెంత మంది ఉంటారు? వారి రాజ కీయాలతో విభేదించవచ్చు, వారి మార్గం గమ్యాన్ని చేర్చేది కాదనవచ్చు. కానీ వారుæ ప్రజానీకానికి ఆత్మగౌరవాన్ని, మెరుగైన భౌతిక జీవితాన్ని అందించాలనే ఆశయ సాధనలో ఆత్మబలిదానం చేశారు. వారికి నివాళులర్పించడానికి కమ్యూనిస్టులకే కాదు, సంస్కార వంతులు, ప్రజాభిమానులు అయిన దేశభక్తులకు ఎవరికీ అభ్యంతరం అవసరం లేదు. నక్సల్బరీలో వసంతకాల మేఘ గర్జన వినిపించి 50 సంవత్సరాలు అయింది. దానినే నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటమని, ఆ పోరాటం చేసేవారిని, దానిని బలపరిచేవారిని నక్సలైట్లు అనేవారు. ఉమ్మడి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రివిజనిస్టుగా మారి విప్లవ పోరాటాన్ని వీడి, పార్ల మెంటరీ రాజకీయాలకే పరిమితమైందంటూ 1964లో ఆ పార్టీ నుంచి విడి వడి సీపీఐ–ఎం పార్టీ ఏర్పడింది. జనతా ప్రజాతంత్ర విప్లవ లక్ష్యంతో ఏర్పడ్డ సీపీఎం కూడా రివిజనిస్టు పార్టీయేనని విమర్శిస్తూ 1967లో దేశవ్యాప్తంగా నక్సలైటు ఉద్యమం పుట్టుకొచ్చింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో అది వేగంగా విస్తృతంగా విస్తరించి, సీపీఎం పార్టీని బాగా దెబ్బతీసింది. గుంటూరు మెడికల్ కళాశాల సీపీఎం యూనిట్ 11 మందితో ఉండగా, నేనూ మరొకరు మాత్రమే సీపీఎంలో మిగిలాం. మిగతావారంతా నక్సలైట్ల వైపే మొగ్గారు. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడైన డాక్టర్ చాగంటి భాస్కరరావు నక్సలైటు ఉద్యమంలో చేరి శ్రీకాకుళం ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లో అసువులు బాశారు. దేశంలోని అత్యంత విప్లవకర పార్టీ ఏది? సీపీఎం వ్యవస్థాపక జాతీయ ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ విధానాలపై పొలిట్ బ్యూరోతో విభేదించి, ఆ పదవికి రాజీనామా చేసి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. సూర్యాపేటలో ప్రజావైద్యశాలను నిర్వ హిస్తున్న నేను ఆయన కోరిక మేరకు వైద్యవృత్తిని వదిలి పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేశాను. ఆ సమయంలో, 1984లో సుందరయ్య తన ఆత్మకథ ‘విప్లవపథంలో నా పయనం’ను ఆంగ్లంలో చెబుతుంటే టేపు చేసి పుస్తక రూపంలో ప్రచురించాను. ఆ సందర్భంగా ఆయన, ‘‘మన దేశంలో సీపీఎం మాత్రమే అత్యంత విప్లవకర పార్టీ అని మనం భావిస్తుంటాం. కానీ ఆ విషయం ఇంకా నిరూపితం కావలసే ఉన్నది. ఎందుకిలా అంటున్నానంటే, మనం ఇంకా విప్లవం సాధించలేదు గనుక!’’ అని చెప్పారు. ఆ వాక్యాలను దాని తొలి తెలుగు అనువాదంలో తొలగించారు. శత్రువులు ఆ వ్యాఖ్యలను వాడుకుని, సుందరయ్యగారే మనది విప్లవ పార్టీ కాలేదని అంటారంటూ నాటి రాష్ట్ర కార్యదర్శి లావు బాలగంగాధరరావు వాటిని తొలగించారు. అది సము చితం కాదన్న నా వాదన నెగ్గలేదు. ఏది ఏమైనా నాటి సుందరయ్య మాటలు నేడు దేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీలకు, విప్లవ పార్టీలకు గీటురాళ్లుగా నిలుస్తాయి. సాయుధ పోరాటమే నూతన ప్రజాస్వామ్య సాధ నకు ఏకైక మార్గమంటూ ‘విముక్తి’ ప్రాంతాలను నెలకొల్పుతున్నా మంటూ, ఆ మార్గాన పయనిస్తున్న మావోయిస్టు పార్టీ... దేశవ్యాప్తంగా సాయుధ పోరా టాన్ని విజయవంతం చేసే క్రమంలో ఉన్నామని వాదించవచ్చు. అలా అయితే, మేము కూడా ఎన్నికల ద్వారా బెంగాల్లో ఏకధాటిన 35 ఏళ్లు, త్రిపురలో 20 ఏళ్లు అధికారంలో ఉన్నాం. కేరళలో 1957 నుంచి అధికారంలోకి వస్తూ పోతూ ఉన్నామని సీపీఎం, సీపీఐలూ వాదించవచ్చు. కానీ నేడు దేశంలో కష్టజీవుల వ్యతిరేక పాలన సాగుతుండటమే కాదు, అది పరమ ఛాందసమైన మతతత్వ పార్టీ నేతృత్వంలో నడుస్తోందనేదే వాస్తవం. వారి త్యాగాలను విస్మరించలేం 1946–51 మధ్య ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సాగిన వీర తెలం గాణ విప్లవ సాయుధ గెరిల్లా రైతాంగ పోరాటంలో దాదాపు ఐదు వేల మంది పోరాట యోధులను నాటి పాలకులు హతమార్చారు. జూలై 4న ఆ పోరాట వార్షికోత్సవాన్ని సీపీఎం జరుపుకుంటూ, నాటి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నది, వారి స్ఫూర్తిని పొందుతున్నది. మావోయిస్టు పార్టీ నేతృత్వంలో సాగుతున్న సాయుధ రైతాంగ పోరాటంలో గత 20 ఏళ్లలోనే 20 వేల మంది ప్రజలు మరణించారని స్థూలమైన అంచనా! మరి 1967 నుంచి గత 50 ఏళ్ల నక్సల్బరీ పోరాట పంథాలో మొత్తం ఎంత మంది జనం బలి అయివుంటారు? అందులో మావోయిస్టుపార్టీ యోధులు, సానుభూతిపరులు తదితరులు ఇంకెంత మంది హతులై ఉంటారు? వారి రాజకీయాలతో విభేదించవచ్చు, వారెంచుకున్న మార్గం గమ్యాన్ని చేర్చేది కాదని అభిప్రాయపడవచ్చు. కానీ వారు సాయుధ పోరా టంతో తోటి ప్రజానీకానికి ఆత్మగౌరవాన్ని, మెరుగైన భౌతిక జీవితాన్ని అందించాలనే ఆశయ సాధనలో ప్రభుత్వంతో పోరాడి ఆత్మబలిదానం చేశారు. వారిని స్మరించుకుని, నివాళులర్పించడానికి కమ్యూనిస్టులకే కాదు, సంస్కారవంతులు, ప్రజాభిమానులు అయిన దేశభక్తులకు ఎవరికీ అభ్యం తరం అవసరం లేదు. అయితే మావోయిస్టుల చేతుల్లో మరణించిన వారి సంగతేమిటి? వారిలో అమాయకులుంటారు కదా! అసలీ హింస అనివార్య మైనదేనా? ఆదివాసులకు అన్యాయం చేసి, కష్టజీవులకు కనీస జీవన ప్రమా ణాలను కల్పించక, కలవారి కొమ్ముకాసి ఆధిపత్య కులాలను అందలం ఎక్కించి ఈ హింసాకాండకు కారణమౌతున్నది పాలకులే. ఈ వాస్తవాన్ని మరుగున పరచి మావోయిస్టులే దేశానికి అత్యంత ప్రమాదకరమైన అంతర్గత ఉగ్రవాదులుగా ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకసారి నేను సుందరయ్య గారితో శ్రీకాకుళంలో జరిగే ఒక అమర వీరుని స్మారక సభకు వెళ్లివస్తానని చెప్పాను. అప్పుడాయన ఆ కామ్రేడ్ గొప్పదనాన్ని తెలపడమే కాదు, ఆ సభలో నువ్వు ఆయనతో పాటూ బూటకపు ఎన్కౌంటర్లలో అసువులు బాసిన పంచాది కృష్ణమూర్తి, ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం తదితరుల త్యాగ నిరతికి నివాళులర్పిస్తావు. నక్సలిజాన్ని మనం అంగీకరించం కాబట్టి అవి తప్పుడు రాజకీయాలని విమర్శిస్తావు. ఆ నేతల పట్ల ప్రేమాభిమానాలతో ఉన్న ప్రజల మనోభావాలను గాయపరచినట్టు అవుతుంది అంటూ ఆ సభకు వెళ్లవద్దని వారించారు. అదీ ఒక విప్లవ నేత విప్లవ స్పందన! మావోయిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర మరే మహిళా సంఘాలు, పార్టీల మహిళా విభాగాలు జరిపిన పోరాటాల్లోనూ కానరాని రీతిలో మావోయిస్టు పార్టీలో మహిళలు పరిమాణాత్మకంగానూ, గుణాత్మకంగానూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి ఆదివాసి మహిళలు పెద్ద సంఖ్యలో వారి పోరాటంలో పాల్గొంటున్నారు. అడవులలో, కొండలు, గుట్టలలో నిరంతరం మృత్యువు వెన్నాడుతుండగా నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం సాగిస్తూ మహిళలు ఆ ఉద్యమంలోకి ప్రవేశించడం గమనార్హం. ‘‘పోలీసు ఎదురు కాల్పుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గరు మహిళలు...’’ అంటూ తరచుగా వచ్చే వార్తలతో పాటూ వారి ఫొటోలూ వస్తుంటాయి. ఆ దృశ్యాలు హృదయ విదారకమైనవేకాదు, ఉత్తేజ కరమైనవి కూడా! అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు పోరాటంలో సాపేక్షికంగా పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రత్యేకించి గిరిజన మహిళలు ఎందుకు పాల్గొంటున్నారు? గెరిల్లాలుగా ఎందుకు ప్రాణాలర్పిస్తున్నారు? ఇది అధ్యయనం చేయాల్సిన అంశం. మైదాన ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఆదివాసులు సమష్టి జీవనంలో శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించేవారు. ఆత్మగౌరవం వారికి ప్రధానం. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు, కొమురం భీం తదితరుల నేతృత్వంలో సాగిన ఆదివాసి పోరాటాలు మనకు సుపరిచితమే. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్ తదితర రాష్ట్రా లలో బ్రిటిష్ వలస దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసులు విస్తృత స్థాయిలో ఎంతో వీరోచితంగా పోరాడారు. తెలంగాణలో కాకతీయ రాజ్యానికి వ్యతి రేకంగా సాగిన ఆదివాసి పోరాటంలో సమ్మక్క, సారక్కల పాత్ర చిరస్మ రణీయం. నేటికీ ఆ వీర నారీమణులకు నివాళులర్పించడానికి సమ్మక్క, సార లమ్మ జాతరకు ప్రజలు వెల్లువెత్తుతారు. ఆ సహజసిద్ధమైన సమరశీలత వారికి అనువంశికంగా వస్తూ ఉండాలి. లేదా ఆదివాసులు, ప్రత్యేకించి మహి ళలు ఏ జాతీయతకు చెందిన ప్రజానీకమూ అనుభవించనంతటి దుర్భర జీవితాన్నయినా అనుభవిస్తుండాలి. ఈ దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించి బానిసల్లా బతికేకంటే, మనుషుల్లా గౌరవ ప్రదంగా జీవించాలన్న ప్రగాఢమైన వాంఛ వారిలో రేకెత్తి ఉండవచ్చు. తమకు అందు బాటులో అనువుగా ఉండిన మావోయిస్టు దళాల పరిచయంతో వారు తమ బతుకులను బాగు చేసుకోగలమని ఆశపడి ఉండవచ్చు. వారు సహజమైన మనుషులు. ఆ స్ఫూర్తిదాయకమైన మావోయిస్టు ఉద్య మంలోని మహిళల భాగస్వామ్యం గురించి మరింత సమాచారం మనకు లేదు. పోరాటంలో నేలకొరిగిన ఆ సుగంధ పుష్పాల గూర్చి, వారి జీవితాల గూర్చి ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికింకా చెదురుమదురుగా సాగుతున్న పరిశోధన మరింత విస్తృ తస్థాయిలో జరిగేలా, వాటిని మనకు తెలిపేలా మహిళా సంఘాలు, పౌర సమాజ నేతలు కృషి చేయాలి. ఇతర ప్రజాసంఘాలలో, రాజకీయ పార్టీల విభాగాలలో సమరశీలురు, త్యాగధనులు లేరని నా అభిమతం కాదు. సాపేక్షికంగా స్పష్టంగా కానవస్తున్న ఈ ప్రత్యేకతను గురించి ఈ 50 వసంతాల ‘మేఘ గర్జన’ సందర్భంగా ఆలో చింపజేయడం కోసమే ప్రస్తావిస్తున్నాను. కమ్యూనిస్టు పార్టీలలో ప్రత్యేకించి సీపీఎంలో 1990 వరకు ఉన్న పూర్తి కాలం కార్యకర్తల పరిస్థితి నాకు అను భవమే. సుందరయ్య పిలుపు మేరకు నేను సూర్యాపేట వీడి విజయవాడకు పూర్తి కాలం కార్యకర్తగా వెళ్లానని చెప్పాను. ఆ సందర్భంగా ఆ ప్రాంతపు పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి పూర్తికాలం కార్యకర్తలు నాకు వీడ్కోలు పలు కుతూ అన్న మాటలు మచ్చుకు చెబుతాను. ‘‘పార్టీ వాళ్లు ఎంతో కష్టం మీద మాకు నెలకు రూ. 150 వేతనం ఇవ్వగలుగుతున్నారు. మీకు తెలువదా సారూ– కుటుంబం గడవడానికే కష్టంగా ఉంది. ఎవరికైనా బీమారి వస్తే– మా ఇఠల్ సారున్నడు, మా ఇఠల్ దవఖాన ఉన్నది అని ధీమాగా ఉండేది సారూ– ఇక ఇప్పుడు మీరెళ్లి పోతున్నారు...’’ అంటూ బాధపడ్డాడు రంగయ్య అనే పూర్తికాలం కార్యకర్త. ఇలాగే చాలామంది కార్యకర్తలు, సానుభూతిపరులు ఆప్యాయతను, ప్రేమను పంచారు. నేను విజయవాడ వచ్చాక సుందరయ్య, పార్టీ కార్యకర్తల స్థితిగతుల గురించి జిల్లాల నుంచి సమాచారం తెప్పించి అధ్యయనం చేశారు. పార్టీకి జీవనాడులైన పూర్తికాలం కార్యకర్తలు అత్యంత కష్టంగా బతుకుతున్నారంటూ ఆయన తక్షణమే వారి వేతనాలలో రూ. 300 పెంపుదల కోసం రాష్ట్ర కమిటీలో పట్టుబట్టి ఒప్పిం చారు. ప్రాణత్యాగం ఒకటయితే ఇలా జీవితాంతం కష్టపడుతూ బతకడం సైతం తక్కువేమీకాదు. ఈ సందర్భంగా ప్రజల కోసం కష్టాలనోర్చి శ్రమి స్తున్న వారికి, చివరకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరజీవు లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. రెడ్ శాల్యూట్స్! డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు మొబైల్ : 98480 69720