విత్తన ధ్రువీకరణలో సంస్కరణలకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: విత్తన ధ్రువీకరణలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ, సేంద్రియ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు కన్వీనర్‌గా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది.
ఈ సమావేశానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విత్తన ధ్రువీకరణ అధికారులు హాజరయ్యారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రాసెసింగ్ చేయని విత్తనాన్ని సరఫరా చేసేప్పుడు తప్పనిసరిగా ఎర్రటి ట్యాగ్ ఉండాలని సిఫార్సు చేశారు. వాటి గడువుకాలం 21 రోజులుండాలని నిర్ణయించామని కేశవులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేశామని ఆయన వివరించారు.