Dr Reddys lyaboretaris
-
ఏటా మూడు వినూత్న ఉత్పత్తులు: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికిత్స ప్రమాణాలను మెరుగుపర్చగలిగే మూడు వినూత్న ఉత్పత్తులను ఏటా ఆవిష్కరించాలని ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (డీఆర్ఎల్) నిర్దేశించుకుంది. అలాగే 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు తక్కువ ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి నిర్దేశించుకున్న సుస్థిర వృద్ధి లక్ష్యాల ప్రణాళికను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా, 2030 నాటికి పూర్తిగా 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. అలాగే 2027 నాటికి మార్కెట్లో తామే ముందుగా ప్రవేశపెట్టే ఉత్పత్తులు 25 శాతం ఉండేలా కంపెనీ కృషి చేయనుంది. అటు సీనియర్ లీడర్షిప్ స్థాయిలో మహిళల సంఖ్యను ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు పెంచుకుని 35 శాతానికి పెంచుకోనుంది. సామాజిక, పర్యావరణ లక్ష్యాలపరంగా చూస్తే వ్యర్థాలను గణనీయంగా తగ్గించుకోవడం తదితర అంశాలు ఉన్నాయి. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) -
అన్ని దశల్లోనూ నాణ్యత
సన్ ఫార్మా ఫౌండర్ దిలీప్ శాంఘ్వి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యత పరీక్షల్లో ఔషధం అర్హత సంపాదిస్తే సరిపోదు. తయారీ ప్లాంటు కూడా రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకులు దిలీప్ ఎస్ శాంఘ్వి అన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకులు స్వర్గీయ కె.అంజరెడ్డి స్వయంగా రాసిన జ్ఞాపకాల సమాహారం ‘యాన్ అన్ఫినిష్డ్ ఎజెండా’ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు భారతీయ కంపెనీలపై పెరుగుతున్న నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. ఎఫ్‌డీఏ తనిఖీల సమయంలో భారత అధికారులు తప్పనిసరిగా ఉండాల్సిన ఆవశ్యకత లేదని వ్యాఖ్యానించారు. కంపెనీల్లో ఉత్తమ తయారీ విధానం (జీఎంపీ) పెరిగేలా డీసీజీఐ కృషి చేస్తోందని అన్నారు. అంజిరెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తామని పుస్తకావిష్కరణ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి, సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఫార్మా రంగం వృద్ధి బాటన పడుతుం దన్నారు. యువతకు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 17% డౌన్
క్యూ2లో రూ.574 కోట్లు * ఉత్తర అమెరికా జనరిక్ మార్కెట్లో ధరల ఒత్తిడి * హుదూద్ నష్టం రూ. 40 కోట్లు * వైజాగ్ యూనిట్లలో ఉత్పత్తి షురూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 17 శాతం క్షీణతను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 690 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ. 574 కోట్లకు పడిపోయింది. ఉత్తర అమెరికా జెనరిక్ వ్యాపారంలో వృద్ధి స్వల్పంగా ఉండటం, ధరలపై ఒత్తిడికి తోడు రష్యా,ఉక్రెయిన్ కరెన్సీల క్షీణత లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ మాట్లాడుతూ ఉత్తర అమెరికాలో కొనుగోలుదారులు ఏకమవ్వడంతో ధరలు తగ్గాయన్నారు. దీనికి తోడు కొత్త ఉత్పత్తుల అనుమతుల్లో జాప్యం కావడం ఫలితాలపై ప్రభావం చూపిందన్నారు. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం 7% వృద్ధితో రూ. 3,357 కోట్ల నుంచి రూ. 3,587 కోట్లకు చేరింది. డాక్టర్ రెడ్డీస్‌కి ప్రధానమైన ఉత్తర అమెరికా మార్కెట్లో కేవలం 8 శాతం వృద్ధి, యూరప్, రష్యా మార్కెట్లో ప్రతికూల వృద్ధి నమోదు కావడం బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపిందన్నారు. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు ఏ త్రైమాసికంలో నమోదు చేయని విధంగా 14 శాతం వృద్ధితో రూ. 682 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఆర్‌అండ్‌డీకి 37 శాతం నిధులు పెంచడం కూడా లాభాలు తగ్గడానికి మరో కారణంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి వివరించారు. అమెరికా మార్కెట్లో ధరల పతనం కనిష్ట స్థాయికి చేరిందని భావిస్తున్నామని, వచ్చే త్రైమాసికాల్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుండటంతో భవిష్యత్తు ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు. హుదూద్ నష్టం రూ. 40 కోట్లు హుదూద్ తుపాన్ వల్ల డాక్టర్ రెడ్డీస్‌కి సుమారు రూ. 40 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేసినట్లు చక్రవర్తి తెలిపారు. డాక్టర్ రెడ్డీస్‌కి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, శ్రీకాకుళం సమీపంలో రెండు యూనిట్లు ఉన్న సంగతి తెలిసింది. తుపాన్ వలన ముడి పదార్థాలతో పాటు యూనిట్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ మొత్తానికి బీమా రక్షణ ఉందన్నారు. ప్రస్తుతం ఈ రెండు యూనిట్లు సాధారణ స్థితికి చేరుకొని ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.