Dr Richard Beale
-
జయలలిత బుగ్గపై ఆ చుక్కలు ఎందుకొచ్చాయి??
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బీలే, అపోలో ఆస్పత్రి వైద్యులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్మీట్లో వైద్యులకు ఎదురైన ప్రధాన ప్రశ్న.. ఎందుకు జయలలిత బుగ్గులపై నాలుగు చుక్కలు ఉన్నాయి? అని.. ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని రాజాజీ హాల్లో ఉంచిన సందర్భంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పెనుదుమారం రేపాయి. ముఖ్యంగా జయలలిత భౌతికకాయం మారిపోయిన తీరు.. ఆమె బుగ్గపై నాలుగు చుక్కలు (డాట్లు) ఉండటం.. అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు జయలలిత రెండు కాళ్లు తొలగించారని, ఆమె ముందు చనిపోయారని, ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఆమె భౌతికకాయం కుళ్లిపోకుండా ఉండేందుకే తీసుకున్న చర్యల వల్లే బుగ్గపై ఉన్న ఈ నాలుగు చుక్కలు వచ్చాయని సోషల్ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బీలే స్పందిస్తూ.. ’జయలలిత కాళ్లు తొలగించలేదు. ఎలాంటి ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయలేదు. బుగ్గల మీద ఉన్న చుక్కలు అంటారా.. తీవ్రంగా జబ్బుపడ్డ రోగులకు బుగ్గలపై అలాంటి చుక్కలు వస్తాయి’ అని వివరణ ఇచ్చారు. ఇక మద్రాస్ మెడికల్ కాలేజీ అనాటమీ డైరెక్టర్ డాక్టర్ సుధా శేషియన్ మాట్లాడుతూ.. జయలలిత మృతదేహాన్ని భద్రపరిచే చర్యలు తీసుకున్నామని, ఈ సందర్భంగా సాధారణ పద్ధతినే పాటించామని ఆమె తెలిపారు. జయలలిత భౌతికకాయంలోకి ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్ ఎక్కించామని, అయితే ఈ సందర్భంగా ఎలాంటి లీకులు చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు. వెంటీలేటర్‌పై ఉంచడం వల్ల జయలలిత పెదవులు ఉబ్బి ఉంటాయని, ట్రేకియాటమీ (శ్వాసలో అడ్డంకులు తొలగించే క్రమంలో) చేసే క్రమంలో ఆమె బుగ్గపై చుక్కలు వచ్చి ఉంటాయని వివరణ ఇచ్చారు. వీఐపీలు చనిపోయినప్పుడు.. ప్రజల సందర్శనార్థం ఉంచే సమయంలో వారి భౌతికకాయాలను కుళ్లిపోకుండా భద్రపరిచే చర్యలు తీసుకోవడం సహజమేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, జయలలిత బుగ్గపై చుక్కల గురించి వైద్యులు ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జయలలిత మృతిపై అనేక అనుమానాలు వస్తున్న సమయంలో వాటిని నివృత్తి చేసేందుకు వైద్యబృందం ఎంచుకున్న సమయం కూడా వివాదాస్పదంగా మారింది. తమిళనాడు కొత్త సీఎంగా శశికళను ఎంచుకున్న మర్నాడే.. ఈ ప్రెస్‌మీట్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుత్నునాయి. -
జయ మృతిలో కుట్ర లేదు
► లండన్ డాక్టర్ రిచర్డ్ బీల్ ► వైద్యం ఖర్చు 5.5 కోట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిలో కుట్ర కోణం, రహస్యం ఏమీలేదని లండన్ వైద్యుడు రిచర్డ్ బీల్ స్పష్టం చేశారు. ఆమెపై విషప్రయోగం జరగలేదని, గుండెపోటుతోనే జయ మృతి చెందారని తేల్చిచెప్పారు. జయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి అపోలో యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం, రిచర్డ్ బీల్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జయ మరణంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్న దృష్ట్యా వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం కోరడంతో ఇక్కడికి వచ్చానని బీల్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ బీల్తో పాటు అపోలో వైద్యుడు డాక్టర్ బాబు అబ్రహాం, ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాలు.. ♦ గతేడాది సెప్టెంబర్ 22న జయలలితను ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు ఆమె స్పృహలోనే ఉన్నారు. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే నియంత్రించలేని స్థాయిలో డయాబెటిస్ ఉంది. ♦ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత మెరుగైన చికిత్స అందించాం. చికిత్స వివరాలను శశికళకు, ప్రభుత్వ పెద్దలకు వివరించాం. ఒక దశలో ట్రీట్మెంట్ కోసం లండన్ కు తీసుకెళ్లాలలనుకున్నాం.. కానీ ఆమె శరీరం అందుకు సహకరించలేదు. ♦ జయలలిత కాళ్లు తొలగించలేదు. ♦ బాగా కోలుకున్నారనుకున్న దశలో గుండెపోటు రావడంతో జయ కన్నుమూశారు. ఇది మేం ఊహించలేదు. ♦ భౌతికకాయం చెక్కు చెదరకుండా ఉండేందుకు డిసెంబర్ 5వ తేదీ రాత్రి 12.20 గంటలకు 5.5 లీటర్ల ప్రత్యేక ద్రవాన్ని ఆమె శరీరంలోకి పంపించాము. వీవీఐపీల భౌతికకాయాలకు ఇలా చేయడం సాధారణమే. ఎంజీఆర్ పార్థివదేహానికి కూడా చేశారు. ♦ చికిత్సకు అయిన రూ. 5.5 కోట్లను జయ కుటుంబీకులే చెల్లించారు. ♦ ఉప ఎన్నికల్లో బీ ఫారంలపై జయ వేలిముద్ర వేసినపుడు డాక్టర్ బాలాజీ, డాక్టర్ అబ్రహం సంతకం చేశారు. అపుడు ఆమె స్పృహలోనే ఉన్నారు. -
జయ మరణంపై సందేహాలకు వివరణ