ఆమ్ ఆద్మీ బీమా యోజన ప్రారంభించిన తేది?
ఎకానమీ: ప్రణాళికలు: 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12): పదకొండో పంచవర్ష ప్రణాళిక 2007 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ప్రణాళిక సంఘం ఈ ప్రణాళిక ముసాయిదా పత్రాన్ని 2006 అక్టోబరు 19న ప్రతిపాదించింది. ఈ ప్రణాళికను జాతీయ అభివృద్ధి మండలి 2007 డిసెంబరు 19న ఆమోదించింది. 11వ ప్రణాళిక పెట్టుబడి రూ. 36,44,718 కోట్లు. దీంట్లో పదో ప్రణాళిక కంటే 120 శాతం ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఇందులో కేంద్రం వాటా రూ. 21,56,571 కోట్లు (59.2 శాతం), రాష్ట్రాల వాటా రూ. 14,88,147 కోట్లు (40.8 శాతం). దీంట్లో ఎక్కువ మొత్తంలో ప్రణాళిక పెట్టుబడి పొందిన రాష్ర్టం - ఉత్తరప్రదేశ్ (రూ. 1,81,094 కోట్లు). రూ. 1,47,395 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
11వ ప్రణాళిక - వనరుల కేటాయింపులు:
1. సామాజిక సేవలు: 30.3%
2. శక్తి/ విద్యుచ్ఛక్తి: 23.4%
3. వ్యవసాయం, నీటి పారుదల: 18.5%
4. రవాణా, సమాచారం: 18.3%
5. పరిశ్రమలు, ఖనిజాలు: 4.2%
6. సైన్స అండ్ టెక్నాలజీ, పర్యావరణం: 2.4%
7. సాధారణ ఆర్థిక సేవలు: 1.7%
8. ఇతర సేవలు: 1.2%
సామాజిక సేవలు అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచినీరు, పారిశుధ్యం, గృహ వసతి మొదలైనవి. ఈ సామాజిక సేవలో భాగమైన విద్యకు 9.5%, ఆరోగ్యానికి 5% కేటాయింపులు చేశారు. విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా పద కొండో ప్రణాళికను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘విద్యా ప్రణాళిక’గా పేర్కొన్నారు.
పదకొండో ప్రణాళికలో ప్రాధాన్యం ఇచ్చిన రంగాలు:
1. వ్యవసాయం
2. గ్రామీణాభివృద్ధి
3. సామాజిక రంగాలు
ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం ‘సత్వర ప్రగతి, సమ్మిళిత వృద్ధి’ సాధించడం, జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల 9% సాధించడం.
నూతన దృష్టితో విశాల పరిధి ఉన్న పథకాల ద్వారా సత్వర వృద్ధి సాధించాలని ఈ ప్రణాళికలో నిర్ణయించారు. ఈ ప్రణాళికకు ఉపలబ్ధ్దిలను జాతీయస్థాయిలో 27గా, రాష్ర్టస్థాయిలో 13గా నిర్ణయించారు. జాతీయ స్థాయిలో 27 లక్ష్యాలను స్థూలంగా ఆరు అంశాలుగా పేర్కొన్నారు. అవి:
1. ఆదాయం, పేదరికం
2. ఆరోగ్యం
3. విద్య
4. మౌలిక సౌకర్యాలు
5. మహిళలు, పిల్లలు
6. పర్యావరణం
పదకొండో ప్రణాళిక జాతీయ స్థాయి లక్ష్యాలు:
-. ఆదాయం, పేదరికం:
- జీడీపీ వృద్ధి రేటు 9 శాతం సాధించడం
- వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించడం
- పారిశ్రామిక రంగంలో 10.5% వృద్ధిరేటు సాధించడం
- సేవా రంగంలో 9.9% వృద్ధిరేటు సాధించడం
- 70 మిలియన్ల (7 కోట్లు) మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం
- విద్యావంతుల్లో నిరుద్యోగం 5% కంటే తక్కువగా ఉండేట్లు చూడటం
- నైపుణ్యాలు లేని శ్రామికుల నిజ వేతన రేటు 20 శాతానికి పెంచడం
- జనాభా నిష్పత్తి ఆధారంగా లెక్కించిన వినియోగ పేదరికాన్ని 10 శాతానికి తగ్గించడం
- 2012 నాటికి పేదరికాన్ని 15 శాతానికి తగ్గించడం, 2017 నాటికి 10 శాతానికి మించకుండా చూడటం
- 10 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం
ఆరోగ్యం:
- శిశు మరణాల రేటును 28కి తగ్గించడం
- {పసూతి మరణాల నిష్పత్తిని ప్రతి వేయి ప్రసూతులకు 1కి తగ్గించడం
- మొత్తం సంతాన సాఫల్యత రేటును 2.1కి తగ్గించడం
- 2009 నాటికి అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం
- పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 3 సంవత్సరాల వయసులోపు పిల్లల శాతాన్ని సగానికి తగ్గించడం.
- రక్త హీనతతో బాధపడుతున్న మహిళలు, బాలికల శాతాన్ని సగానికి తగ్గించడం
ఐఐఐ. విద్య:
2003-04లో ప్రాథమిక విద్యను అభ్యసించే వారిలోని 52.2% డ్రాప్‌అవుట్స్ రేటును 2011-12 నాటికి 20 శాతానికి తగ్గించడం.
- {స్తీ, పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసాన్ని 10% కంటే తక్కువకు తగ్గించడం.
- ఉన్నత విద్యను అభ్యసించే వారిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచడం.
- 2011-12 నాటికి 7 సంవత్సరాల పైన ఉన్న వారిలో అక్షరాస్యత రేటు 85 శాతానికి పెంచడం.
{పాథమిక పాఠశాలలో కనీస అవసరాలతో కూడిన నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం.
- సర్వశిక్షా అభియాన్ పథకం కింద బాల
- బాలికలను 100 శాతం నమోదు చేయడం.
- మౌలిక సౌకర్యాలు:
- 2009 నాటికి ప్రతి గ్రామంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు 24 గంటలు విద్యుత్ సౌకర్యాన్ని అందించడం.
- 2009 నాటికి వేయి మంది, ఆపై జనాభా ఉన్న నివాస స్థలాలకు, 500 జనాభా ఉన్న గిరిజన, కొండ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం.
- అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం, 2012 నాటికి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించడం.
- 2012 నాటికి అందరికి ఇళ్ల స్థలాలు అందించడం, 2016-17 నాటికి గ్రామాల్లో పేదలందరికీ గృహ నిర్మాణానికి తోడ్పాటు అందించడం.
గ. మహిళలు, పిల్లలు:
- {స్తీ-పురుష నిష్పత్తి 2011-12 నాటికి 935కి, 2016-17 నాటికి 950కి పెంచడం.
- {పభుత్వ పథకాల లబ్ధిదారుల్లో కనీసం 33% మహిళలు, బాలికలు ఉండేట్లు చూడటం.
- ఎలాంటి నిర్బంధం లేకుండా సురక్షితమైన బాల్యాన్ని పిల్లలందరికీ అందించడం.
గఐ. పర్యావరణం:
- అదనంగా 5% అడవులు, చెట్లు పెంచడం.
- 2011-12 నాటికి దాదాపుగా అన్ని పట్టణాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన రీతిలో వాయుకాలుష్య రహిత పరిస్థితులను కల్పించడం.
- 2011-12 నాటికి అన్ని నదీ జలాల కాలుష్యం తొలగింపు, పట్టణ ప్రాంతాల్లో వృథా నీటి సక్రమ వినియోగం.
- 2016-17 నాటికి ఇంధన సామర్థ్యాన్ని 20 శాతానికి పెంచడం.
అభివృద్ధి కార్యక్రమాలు
రాష్ట్రీయ స్వాస్థ బీమా యోజన (ఖఆ్గ): అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే బీపీఎల్ కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2007 అక్టోబరు 1న ప్రారంభించారు. ఈ పథకంలో రూ. 30,000 వరకు ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఈ పథకానికి కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. లబ్ధిదారులకు స్మార్టకార్డలను జారీ చేస్తారు. దీంతో వారు నగదు లేకుండానే ఆసుపత్రి నుంచి ఆరోగ్య సేవలు పొందవచ్చు.
ఆమ్ ఆద్మీ బీమా యోజన (అఅఆ్గ): గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేద కుటుంబాలకు రూ.75,000 వరకు బీమా రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2007 అక్టోబరు 2న ప్రారంభించారు. దీని ద్వారా 1.5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నిధులను భరిస్తాయి. దీనికి కావాల్సిన బీమా సంరక్షణను ఎల్ఐసీ నిర్వహిస్తోంది. బీమా పరిధిలో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం బారిన పడినా రూ.75,000 వరకు అందజేస్తారు. పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే రూ.37,500 వరకు, సహజ మరణం సంభవిస్తే రూ. 30,000 బీమా సంస్థ చెల్లిస్తుంది. ఈ పథకాన్ని ‘ఇందిర జీవిత బీమా పథకం’గా వ్యవహరిస్తారు. గ్రామీణ పేద కుటుంబంలో ఇంటి పెద్ద లేదా సంపాదించే వ్యక్తి పేరుతో బీమా చేయిస్తారు. బీమా చేయించే వ్యక్తికి 18-59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈ పథకం అమల్లో రాష్ర్ట ప్రభుత్వం ‘నోడల్ ఏజెన్సీ’గా వ్యవహరిస్తుంది.
ఒక్కొక్క వ్యక్తికి బీమా ప్రీమియం రూ. 200. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 100, రాష్ర్ట ప్రభుత్వం రూ. 100 భరిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించడానికి వీలుగా రూ. 1000 కోట్ల నిధిని సర్కారు తరఫున ఎల్ఐసీ నిర్వహిస్తుంది. మరణించిన వ్యక్తి ఇద్దరు పిల్లలకు 9-12వ తరగతి వరకు ప్రతి నెలకు రూ. 300 ఉపకార వేతనంగా చెల్లిస్తారు.
మాదిరి ప్రశ్నలు
1. జనతా ప్రభుత్వం 6వ పంచవర్ష ప్రణాళికను ఏ కాలానికి రూపొందించింది?
1) 1978-80 2) 1978-83
3) 1980-85 4) ఏదీకాదు
2. ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ధరలను నియంత్రణ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని సాధించడానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చారు?
1) 5 2) 4 3) 7 4) 6
3. ఏకకాలంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వ్యవస్థాపనా సౌకర్యాలను అభివృద్ధి చేయడం ఎన్నో ప్రణాళికలో వ్యూహంగా తీసుకున్నారు?
1) 4 2) 5 3) 6 4) 7
4. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు
దాదాపుగా సమాన కేటాయింపులు చేయడం వల్ల మూడో ప్రణాళికను ఏమని పిలుస్తారు?
1) వ్యవసాయ, పారిశ్రామిక ప్రణాళిక
2) అభివృద్ధి ప్రణాళిక
3) సహజ ప్రణాళిక
4) సంతులన ప్రణాళిక
5. పదో ప్రణాళిక (2002-07) లక్ష్యం ఏమిటి?
1) స్థిరత్వంతో కూడిన ఆర్థిక వృద్ధి
2) సామాజిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి
3) సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన జననాణ్యత పెంచడం
4) సంపూర్ణ ఉద్యోగితతో కూడిన ఆర్థిక వృద్ధి
6. భారతదేశంలోని ప్రణాళికా పద్ధతికి
అత్యున్నత సంస్థ (అ్కఉగీ ఆౌఛీడ) ఏది?
1) ప్రణాళిక సంస్థ
2) జాతీయ అభివృద్ధిమండలి
3) కేంద్ర ప్రభుత్వం
4) పార్లమెంటు
7. ఎన్నో ప్రణాళికలో భారీ మూలధన వస్తు పరిశ్రమలకు బదులుగా చిన్నతరహా పరిశ్ర మల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చారు?
1) 3 2) 4 3) 5 4) 6
8. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు లేకుండానే ఆర్థికాభివృద్ధిని ముందుకు నడిపించడం అనే లక్ష్యానికి సంబంధించిన పథకం ఏది?
1) భారత్ నిర్మాణ్ యోజన 2) పురా
3) ఎ్గ 4) ఒఖ్గ
9. కిందివాటిలో భారత ప్రణాళిక లక్ష్యం కానిదేది?
1) జాతీయ, తలసరి ఆదాయం వృద్ధి
2) అవస్థాపన సౌకర్యాల వృద్ధి
3) ఆర్థిక కేంద్రీకరణ వృద్ధి
4) ఏదీకాదు
10. దేశంలో అతి తక్కువ వృద్ధిరేటు (2.8%) మూడో ప్రణాళికలో నమోదైంది. ఆ తర్వాత స్థానంలోని ప్రణాళిక ఏది?
1) 1వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక
3) 5వ ప్రణాళిక 4) 9వ ప్రణాళిక
సమాధానాలు:
1) 2; 2) 1; 3) 3; 4) 4; 5) 3;
6) 2; 7) 2; 8) 2; 9) 3; 10) 2.