ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష దరఖాస్తు తేదీ పొడిగింపు
తాండూరు: డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష (ఫేజ్-2) దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్టు కో-ఆర్డినేటర్ నాగేశ్వరచారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉందన్నారు. ఆగస్టు నెల 14న అర్హత పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మిగితా వివరాలకు పట్టణంలోని పీపుల్స్ డీగ్రీ కళాశాలలో సంప్రదించాలని ఆయన కోరారు.