అయ్యో.. ఈ టాప్ హీరోయిన్‌కి ఏమైంది
కాలిఫోర్నియా :
ఫోటోలో ఉన్న హాలీవుడ్ టాప్ హీరోయిన్ను గుర్తుపట్టారా. అయితే మీకో క్లూ చార్లెస్ ఏంజిల్స్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు హీరోయిన్లలో ఫోటోలోని హీరోయిన్ ఒకరు. ఆవిడే హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డ్రూ బెర్రీమోర్.
తన అందంతో అభిమానుల మతులు పోగొట్టిన డ్రూ బెర్రీ ఎందికిలా అయ్యిందనుకుంటున్నారా?. ఏమీలేదండి ఇప్పటికే 41 ఏళ్లున్న ఆమె ఓ పదేళ్లు తక్కువ కనపడడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా కొన్ని బ్యూటీ ప్రొడక్టులను వాడుతోంది. అయితే సరదాగా తాను క్రీము రాసుకుని ఉన్న ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అంతేనా ఆ బ్యూటీ ప్రాడక్టులు వాడితే పదేళ్ల కింద ఏలా ఉన్నారో అలా అయిపోతారంటూ సలహాలు కూడా ఇచ్చింది.