Drink driving
-
చుక్కేసి బండి నడిపితే కటకటాల్లోకే..!
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ప్రస్తుతం సిద్దిపేటలో మద్యం తాగి వాహనం నడిపితే చాలు.. పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిస్తే ఏకంగా నెల రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లాలో వారం రోజులకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తూ మద్యం తాగి వాహనం నడిపేవారిని కట్టడి చేస్తున్నారు. సిద్దిపేట నుంచి బట్ట ప్రభాకర్: మందు బాబులకు పెద్ద చిక్కొచ్చి పడింది..! మద్యం తాగి వాహనం నడిపితే చాలు జైలుకు వెళ్లాల్సిన పరి స్థితి వచ్చింది. పోలీసు శాఖ చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్‌లో వందలాది మంది మందుబాబులు చిక్కుతున్నారు. ఆల్కహాల్ తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ చూపిస్తే ఊచలు లెక్కించాల్సిందే. మోతాదుగా తీసుకున్నట్టు తేలితే జరిమానా సరిపోతుంది. ఒక్క లైట్ బీరు లేదా 15 ఎంఎల్ మద్యం సేవిస్తే.. బ్రీత్ ఎనలైజర్‌లో 30 శాతం చూపిస్తుంది. రెండు పెగ్గులు, హార్డ్ బీరు తాగితే 60– 120 శాతం వరకు చూపిస్తుంది. 30 శాతం వరకు ఫైన్ తో వదిలేస్తున్నారు. 35శాతం దాటితే.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఇటీవల జైలు శిక్ష ఘటనలు కొన్ని.. ♦ సిద్దిపేట జిల్లా ఏర్పడిన 14 నెలల్లో 954 కేసులు నమోదయ్యాయి. ఇందులో 150 మందికి జైలు శిక్ష పడగా రూ.7,18,200 ఫైన్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ♦ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రాంపూర్ వాసి శ్రీనివాస్ లారీ డ్రైవర్. నవం బర్ 24న రాత్రి లారీపై హైద రాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్నాడు. కుకునూరుపల్లి పోలీసులు అతన్ని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 290 ఎంజీ వచ్చింది. మరుసటి రోజు కోర్టులో హాజరుపరు చగా 30 రోజుల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ♦ గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన మెత్కు స్వామి మద్యం తాగి టూవీలర్ నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 100శాతం వచ్చింది. దీంతో అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. 20రోజుల జైలు శిక్షతోపాటు రూ. 1,000 ఫైన్ విధించింది. ♦ నవంబర్ 16న కొమురంభీం జిల్లా త్రీయానికి చెందిన లారీ డ్రైవర్ దేవసాని శంకర్. లారీ తోలుకుంటూ హైదరాబాద్ వెళ్తున్నాడు. ప్రజ్ఞాపూర్ వద్ద గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పరీక్షించగా 220ఎంజీ రిపోర్టు చూపించింది. ఈ కేసులో అతడికి 15రోజుల జైలు, రూ.1,000జరిమానా విధించారు. ♦ అలాగే ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఐలాపూర్ స్వామి, శ్రీకాంత్‌లు వేర్వేరుగా టూవీల్లరు వాహనంపై వెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. వారు ఇద్దరు మద్యం సేవించినట్లు నిర్ధారణ రావడంతో కోర్టులో ఇరువురికి ఏడు రోజుల జైలు, రూ. 1,000చొప్పున జరిమానా పడింది. ♦ దుబ్బాకకు చెందిన యాదయ్య మద్యం సేవించి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో దుబ్బాక పోలీసులు పట్టుకుని అతన్ని పరీక్షించగా 179ఎంజీ వచ్చింది. అతడికి ఏడు రోజుల జైలుతోపాటు రూ. 1,000 జరిమానా విధించింది. -
మద్యం మళ్లీ బోల్తా కొట్టించింది
30 అడుగుల గుంతలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 47 మందికి గాయాలు.. అందులో 40 మంది విద్యార్థులు డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రకాశం జిల్లాలో ప్రమాదం కనిగిరి: డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. సుమారు 30 అడుగుల గుంతలో పడి 78 మంది విద్యార్థులను దాదాపు మృత్యుముఖంలోకి తీసుకెళ్లింది. పెనుగం చిప్రోలు సంఘటన మరచిపోక ముందే జరిగిన ఈ ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తున్న 40 మంది విద్యార్థులతో పాటు మొత్తం 47 మంది గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెద అలవలపాడు వద్ద గురువారం వేకువన 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉలవపాడు మండలం కరేడులోని పోతల వెంకట సుబ్బయ్య శ్రేష్టి (పీవీఎస్ఎస్) జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గత నెల 28 రాత్రి ఒంగోలుకు చెందిన ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్ బస్సులో విహారయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి మహానంది నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 78 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు, డ్రైవర్ తదితరులతో కలిపి బస్సులో మొత్తం 88 మంది ఉన్నారు. దీంతో కొందరు విద్యార్థులు బస్సు ప్లాట్‌ఫామ్‌పై పట్టా వేసుకుని కూర్చున్నారు. అంతా గాఢనిద్రలో ఉన్నారు. వారు కరేడు చేరుకుంటారనగా డ్రైవర్ కాలేషా బస్సుపై అదుపు కోల్పోయాడు. దీంతో అలవలపాడు వద్ద బ్రిడ్జి ఎక్కేముందు పక్కనే ఉన్న పిల్లర్లను ఢీకొట్టిన బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయిం ది. మద్యం మత్తువల్లే ప్రమాదం డ్రైవర్ కాలేషా తాగిన మైకంలో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, వైద్యసిబ్బంది ధ్రువీకరించారని కనిగిరి సీఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్ ఓనర్ మన్నం బ్రహ్మయ్య, డ్రైవర్ ఎస్కే కాలేషా, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రెండు బస్సులు ఢీ దొరవారిసత్రం (సూళ్లూరుపేట): ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టడంతో 23 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెల్లబల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పతాగి పోలీసులపై యువతి వీరంగం
ముంబయి: పీకలదాక తాగిన ఓ 21 ఏళ్ల యువతి పోలీసులపై చిందులు తొక్కింది. నడిరోడ్డుపై నానా రచ్చ చేసింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు పోలీసులపై చేయిచేసుకుంది. అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గౌరీ బిడే అనే మహిళ ఫుల్లుగా మద్యం తాగి కారు వేగంగా నడిపింది. మద్యం మత్తులో అది కాస్త వెళ్లి పోద్దార్ ఆస్పత్రి సమీపంలో డివైడర్‌కు ఢీకొట్టింది. ఇదే కారులో మరో ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇష్టమొచ్చినట్లు తిట్టింది. ఓ ఆరుగురు పోలీసులపై చేయి చేసుకుంది. అసభ్యకరంగా తిడుతూ నానా హంగామా చేసింది. అయితే, ఆ యువతి ఎక్కవ మద్యం తాగిందనే విషయం ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఆమెతోపాటు ఉన్న ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.