
తప్పతాగి పోలీసులపై యువతి వీరంగం
ముంబయి: పీకలదాక తాగిన ఓ 21 ఏళ్ల యువతి పోలీసులపై చిందులు తొక్కింది. నడిరోడ్డుపై నానా రచ్చ చేసింది. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు పోలీసులపై చేయిచేసుకుంది. అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన గురువారం అర్థరాత్రి 1.15గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గౌరీ బిడే అనే మహిళ ఫుల్లుగా మద్యం తాగి కారు వేగంగా నడిపింది. మద్యం మత్తులో అది కాస్త వెళ్లి పోద్దార్ ఆస్పత్రి సమీపంలో డివైడర్కు ఢీకొట్టింది.
ఇదే కారులో మరో ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఇష్టమొచ్చినట్లు తిట్టింది. ఓ ఆరుగురు పోలీసులపై చేయి చేసుకుంది. అసభ్యకరంగా తిడుతూ నానా హంగామా చేసింది. అయితే, ఆ యువతి ఎక్కవ మద్యం తాగిందనే విషయం ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. ఆమెతోపాటు ఉన్న ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.