Driving Training Center
-
తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయత్నం.. ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
-
కొత్తగా 2 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రహదారి భద్రత దిశగా మౌలిక వసతుల కల్పన వేగవంతమవుతోంది. అందుకోసం పూర్తిస్థాయిలో డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు మరో 2 ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ – రిసెర్చ్ (ఐటీడీఆర్)’లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లా డోన్, విజయనగరం జిల్లా రాజాపులోవల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఐటీడీఆర్ మొదటి దశ పనులు పూర్తవడంతో కార్యకలాపాలు మొదలయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఐటీడీఆర్‌లను నెలకొల్పుతాయి. ఏదైనా కార్పొరేట్ సంస్థగానీ ఎన్జీవో భాగస్వామ్యంతో సొసైటీని ఏర్పాటు చేసి వాటిని లాభాపేక్షలేకుండా నిర్వహిస్తారు. దర్శిలో ఐటీడీఆర్‌ను మారుతి సంస్థతో కలసి ఏర్పాటు చేసిన సొసైటీ కింద నెలకొల్పారు. తాజాగా డోన్‌లో ఐటీడీఆర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయగా, విజయనగరం జిల్లా రాజాపులోవలో ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీతో కలసి సొసైటీ కింద ఏర్పాటు చేస్తున్న వీటికి.. ఒక్కోదానికి రూ.18 కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.36 కోట్లు మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఐటీడీఆర్‌కు 10 ఎకరాల భూమి కేటాయిస్తుంది. డోన్ ఐటీడీఆర్ కోసం ఇప్పటికే భూములను గుర్తించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు వచ్చేవారం వాటిని పరిశీలిస్తారు. అనంతరం రాజాపులోవలో అందుబాటులో ఉన్న భూములపై విజయనగరం జిల్లా అధికారులతో చర్చిస్తారు. ఈ రెండు ఐటీడీఆర్‌లలో ఒక్కోదాన్లో ఏడాదికి దాదాపు 10 వేలమంది చొప్పున డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. వారిలో కొత్త డ్రైవర్లతోపాటు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డ్రైవర్లుగా ఉన్నవారికి ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. పూర్తిస్థాయి వసతులు శాస్త్రీయ విధానాల్లో డ్రైవింగ్ శిక్షణకు అవసరమైన మౌలిక వసతులను ఐటీడీఆర్‌లలో ఏర్పాటు చేస్తారు. వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలను అందుబాటులో ఉంచుతారు. కార్లు, హెవీ వెహికిల్స్ స్టిమ్యులేటర్లు ఏర్పాటు చేస్తారు. కంప్యూటరైజ్డ్ క్లాస్రూంలు నెలకొల్పుతారు. వర్క్‌షాప్, ఇంజిన్ రూమ్, ఎలక్ట్రిక్ డిస్ప్లే రూమ్, లైబ్రరీ, క్యాంటిన్ మొదలైనవి సమకూరుస్తారు. డ్రైవింగ్‌లో శిక్షణ కోసం రెండు, నాలుగు, ఆరు లేన్ల రోడ్లు, పార్కింగ్ యార్డ్, త్రీపాయింట్, ఫైవ్ పాయింట్ టర్న్ రోడ్లు మొదలైనవి నిర్మిస్తారు. -
కొత్తగా 2 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. 20 వేలమందికి శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా మౌలిక వసతుల కల్పన వేగవంతమవుతోంది. అందుకోసం పూర్తిస్థాయిలో డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు మరో 2 ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ – రిసెర్చ్ (ఐటీడీఆర్)’లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లా డోన్, విజయనగరం జిల్లా రాజాపులోవల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఐటీడీఆర్ మొదటి దశ పనులు పూర్తవడంతో కార్యకలాపాలు మొదలయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఐటీడీఆర్‌లను నెలకొల్పుతాయి. ఏదైనా కార్పొరేట్ సంస్థగానీ ఎన్జీవో భాగస్వామ్యంతో సొసైటీని ఏర్పాటు చేసి వాటిని లాభాపేక్షలేకుండా నిర్వహిస్తారు. దర్శిలో ఐటీడీఆర్‌ను మారుతి సంస్థతో కలసి ఏర్పాటు చేసిన సొసైటీ కింద నెలకొల్పారు. తాజాగా డోన్‌లో ఐటీడీఆర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయగా, విజయనగరం జిల్లా రాజాపులోవలో ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీతో కలసి సొసైటీ కింద ఏర్పాటు చేస్తున్న వీటికి.. ఒక్కోదానికి రూ.18 కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.36 కోట్లు మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఐటీడీఆర్‌కు 10 ఎకరాల భూమి కేటాయిస్తుంది. డోన్ ఐటీడీఆర్ కోసం ఇప్పటికే భూములను గుర్తించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు వచ్చేవారం వాటిని పరిశీలిస్తారు. అనంతరం రాజాపులోవలో అందుబాటులో ఉన్న భూములపై విజయనగరం జిల్లా అధికారులతో చర్చిస్తారు. ఈ రెండు ఐటీడీఆర్‌లలో ఒక్కోదాన్లో ఏడాదికి దాదాపు 10 వేలమంది చొప్పున డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. వారిలో కొత్త డ్రైవర్లతోపాటు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డ్రైవర్లుగా ఉన్నవారికి ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. పూర్తిస్థాయి వసతులు శాస్త్రీయ విధానాల్లో డ్రైవింగ్ శిక్షణకు అవసరమైన మౌలిక వసతులను ఐటీడీఆర్‌లలో ఏర్పాటు చేస్తారు. వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలను అందుబాటులో ఉంచుతారు. కార్లు, హెవీ వెహికిల్స్ స్టిమ్యులేటర్లు ఏర్పాటు చేస్తారు. కంప్యూటరైజ్డ్ క్లాస్రూంలు నెలకొల్పుతారు. వర్క్‌షాప్, ఇంజిన్ రూమ్, ఎలక్ట్రిక్ డిస్ప్లే రూమ్, లైబ్రరీ, క్యాంటిన్ మొదలైనవి సమకూరుస్తారు. డ్రైవింగ్‌లో శిక్షణ కోసం రెండు, నాలుగు, ఆరు లేన్ల రోడ్లు, పార్కింగ్ యార్డ్, త్రీపాయింట్, ఫైవ్ పాయింట్ టర్న్ రోడ్లు మొదలైనవి నిర్మిస్తారు. -
డ్రైవింగ్ & పరిశోధన
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్ : డ్రైవింగ్‌లో శిక్షణ, పరిశోధన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటవుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. శిక్షణ కేంద్రం కోసం 20 ఎకరాలను జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద కేటాయించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంకాగా, దక్షిణ భారత దేశంలో రెండో డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం అవుతుంది. తొలి శిక్షణ కేంద్రం తమిళనాడులో ఉండగా.. రెండోది సిరిసిల్లలోనే ఏర్పాటవుతోంది. ఇక్కడ డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికిల్స్ లారీలు, ట్రక్కులు నడిపేవారికీ నైపుణ్యమైన శిక్షణ ఇస్తారు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లకు సిరిసిల్లలోనే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులకు సైతం డ్రైవింగ్ స్కూల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. ఎక్కడైనా బస్సులు, లారీలతో ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు పనిష్మెంట్లో భాగంగా సిరిసిల్లలో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఏటా ఇక్కడ వెయ్యి మందికి శిక్షణ ఇస్తారు. పరిశోధన సంస్థగా.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ ట్రాక్, టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్, శిక్షణ పొందేవారికి హాస్టల్ వసతి, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు రూ.16.48 కోట్లు కేటాయించారు. ఆధునిక రీతిలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోపాటు అశోకా లేలాండ్ సంస్థ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు ముందుకొచ్చింది. దీనితో తెలంగాణలోని 31 జిల్లాల యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ పొందే వీలుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తారు. సిరిసిల్ల జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవింగ్ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు ఇక్కడ డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు. చురుగ్గా పనులు.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంజూరు చేయించారు. ప్రస్తుతం డ్రైవింVŠ శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రహరీ నిర్మాణం, మెయిన్ బ్లాక్, భవనాలు నిర్మిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణాశాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు. ఈ శిక్షణ కేంద్రం, పరిశోధనలతో స్థానిక యువతకు మెరుగైన డ్రైవింగ్ విధానాలు దరిచేరనున్నాయి. డ్రైవింగ్ శిక్షణ కేంద్రం స్వరూపం ♦ స్థలం : రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లి ♦ నిర్మాణ వ్యయం : రూ.16.48 కోట్లు ♦ విస్తీర్ణం : 20 ఎకరాల్లో.. ♦ నిర్మాణ గడువు : ఏడాదిన్నర కాలం ♦ ప్రయోజనం : డ్రైవింగ్‌లో ఆధునిక శిక్షణ, నైపుణ్యం పెంపు ♦ ఎంత మందికి : ఏటా వెయ్యి మందికి ♦ నిర్వహణ : రవాణాశాఖ, అశోకా లేలాండ్ సంస్థ ♦ లక్ష్యం : ప్రమాద రహిత సమాజం -
రూ.350 కోట్లతో 1400 కొత్త బస్సులు
⇒ మరో 236 మినీ బస్సులు ⇒ ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ⇒ రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పరిగి: రాష్ట్రంలో రవాణా శాఖను పటిష్టం చేస్తామని ఆ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలో రూ. 350 కోట్లతో 1,400 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 236 మినీ బస్సులు.. వీటిలో 100 ఏసీ బస్సులు కొనుగోలు చేసి డిపోలకు అందజేస్తామన్నారు. రూ. 17 కోట్లతో సిరిసిల్లలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రూ.30 కోట్లతో రాష్ట్రంలో ఆర్టీఏ సొంతభవనాలు నిర్మిస్తామని రవాణ శాఖ రాష్ట్ర కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ట్రాక్‌లు ఉండేలా చూస్తామన్నారు. గతంలో ఎక్కువ శాతం ఆర్టీఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగగా ప్రస్తుతం ముమ్మరంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. -
‘రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి’
తాండూర్(రంగారెడ్డి): రాష్ట్రంలో ఏటా జరుగుతున్న వేలాది రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం తాండూర్ ఆర్టీసీ డిపోలో జరిగిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ.18కోట్లతో ఏర్పాటుచేసిన అంతర్జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించనున్నట్లు వివరించారు. సురక్షితంగా వాహనాలను నడిపేలా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రాలను నెలకొల్పుతామని అన్నారు. ప్రమాదాల నివారణ లో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సురక్షిత ప్రయాణానికి అవసరమైన మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా లఘుచిత్రాలు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. అంతకుమునుపు ఆయన డిపోలో మొక్కలు నాటారు. -
రూటు మారిందా.. గోవిందా..!
► జిల్లా చేజారిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ? ► వంద కోట్ల ప్రాజెక్ట్‌ను దారి మళ్లించిన మంత్రి శిద్దా... ► పట్టించుకోని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు సాక్షి, గుంటూరు : రాష్ట్రంలోనే మొట్టమొదట ఏర్పాటు కానున్న అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ‘డ్రైవింగ్ శిక్షణ కేంద్రం’ను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరగనున్న గుంటూరు జిల్లాలో ఏర్పాటుకు రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం గుంటూరులోని అడవితక్కెళ్లపాడు వద్ద ఐదెకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలసి అప్పటి డీటీసీ సుందర్ పరిశీలించారు. సుమారు రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేస్తే రూ. వంద కోట్ల వ్యయంతో గుంటూరులో ఏర్పాటు కానున్న భారీ ప్రాజెక్టు ‘డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు....ఇందులో ఆయన సఫలీకృతులవుతున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆయన సొంత జిల్లా ప్రకాశంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి మార్గం సుగమం అయినట్టేనని చెపుతున్నారు. ఆంధ్రాలోని 13 జిల్లాలకు సౌకర్యంగా ఉంటుందనేది ఉన్నతాధికారుల ఉద్దేశం. దీనికి సంబంధించి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. గుంటూరులో నెలకొల్పడం దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మంత్రాంగం నడిపి తన సొంత జిల్లా అయిన ప్రకాశంకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం స్థలాన్ని సైతం సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మంత్రి స్వయంగా ప్రతిపాదనలు పంపించిన తరువాత ఉన్నతాధికారులు సైతం ఆయన మాట కాదనలేక గుంటూరు ఊసు ఎత్తడం లేదని తెలుస్తోంది. గుంటూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లిన తరువాత మంత్రి దీనిని ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నట్లు తె లిసి కూడా గుంటూరు జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు మిన్న కుండటం విమర్శలకు తావిస్తోంది. గుంటూరు జిల్లాలో రాజధానికి భూములు సమీకరించి ప్రాజెక్ట్‌లను మాత్రం లేకుండా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ సొంత పనులు చూసుకోవడమే సరిపోతుందని, ఉపాధి కల్పించే ప్రాజెక్ట్‌లను జిల్లాకు తేవడంలో విఫలమౌతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శిక్షణ కేంద్రం ప్రకాశం జిల్లాకు తరలిపోకుండా చూడాలని కోరుతున్నారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగాలు .... రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్మించే డ్రైవింగ్ శిక్షణ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే ఉంటుంది. అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఐదు నుంచి పదెకరాల స్థలంలో సువిశాలంగా నిర్మించే ఈ కేంద్రంలో ఐదు హెవీ డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారు. రోజుకు సుమారు 20 మందికి పైగా శిక్షణ పొందే విధంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికీ వారం నుంచి పది రోజుల పాటు శిక్షణ ఇస్తారు. కేంద్రంలో ఇన్‌బుల్ట్ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవింగ్ నైపుణ్యాన్ని కంప్యూటర్లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ శిక్షణ పొందే వారికి వైద్య సేవలు అందించడంతోపాటు బీమా కూడా వర్తింపజేస్తారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అన్ని హంగులతో రూ. వంద కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న శిక్షణ కేంద్రం గుంటూరు నుంచి తరలివెళ్లనుందన్న వార్త జిల్లా ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది.