టీబీజేపీ అధ్యక్షుడికి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల ఉగ్రవాదుల కదలికలు పెరగటం, పాతబస్తీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సందర్భంగా వారి లిస్టులో పలు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉండటంతో ఈ భద్రతను పెంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ భద్రతను గతంలో కంటే మరింత కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని లక్ష్మణ్‌కు కేటాయించారు.