ఎలుకలు తిరుగుతున్నాయ్ జాగ్రత్త!
డీఆర్ఓ ధర్మారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కలెక్టరేట్ ఆవరణలో ఇష్టానుసారంగా ఆహార వ్యర్థాలను వేయడంతో ఎలుకలు సంచరిస్తున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి అన్నారు. పరిశుభ్రత పాటిస్తే వాటి బెడద ఉండదని గుర్తుచేశారు. స్వచ్ఛ్భారత్లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి 15 రోజులకోసారి కార్యాలయ అధికారి తనిఖీ చేయాలన్నారు. త్వరలో కలెక్టరేట్లోని ప్రతి కార్యాలయానికి రెండు చెత్తబుట్టలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.