కలెక్టరేట్లో రగడ
- డేటా ఆపరేటర్లకు డబ్బులు ఇవ్వని అధికారులు
- గొడవ చేసిన ఆపరేటర్లు
- వీడియో కాన్ఫరెన్స్‌ను అడ్డుకున్న వైనం అధికారుల అగ్రహం
మహబూబ్‌నగర్ టౌన్: సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసిన డేటా ఏంట్రీ ఆపరేటర్లకు డబ్బులు ఇస్తామని చెప్పిన అధికారులు తీరా వారు వచ్చాక ఇప్పుడు కాదు..తర్వాత ఇస్తామని చెప్పడంతో కలెక్టరేట్ రణరంగంగా మారింది.. వివరాల్లోకి వెళితే డేటా ఆపరేటర్లకు డబ్బులు పంపిణీ చేస్తామని, బుధవారం కలెక్టరేట్‌కు రావాలని అధికారులు వారి సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపడంతో వారు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అరుుతే ఇప్పుడు ఇచ్చేది లేదని.. తరువాత సమాచారం ఇచ్చాక రండని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆపరేటర్లు మాట్లాడుతూ డబ్బులు ఇస్తామని సెల్‌ఫోన్‌కు మెస్‌జ్ ఇచ్చినందునే ఉదయమే ఇక్కడికి వచ్చామన్నారు. సాయంత్రం వరకు పడిగాపులు కాయించి, తీరా డబ్బులు ఇవ్వమని చెబుతున్నారంటూ అగ్రహం వ్యక్తం చేశారు. తిండి తిప్పల్లేక వేచిచూస్తే మీరిచ్చే మర్యాద ఇదేనా అంటూ నిలదీశారు. డీఆర్వో రాంకిషన్ ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా ఆపరేటర్లు అక్కడికి వెళ్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. ఆపరేటర్ల తీరుపై డీఆర్వో అగ్రహం వ్యక్తం చేస్తూ, డబ్బులు ఇచ్చేటప్పుడు రావాలని, అప్పటి వరకు రావద్దని చెప్పడంతో తాము డబ్బుతీసుకోనిదే వెళ్లమని ఆపరేటర్లు భీష్మించడం కలెక్టరేట్లో గందరగోళం నెలకొంది. కలెక్టర్ కోసం అవరణలోనే రాత్రి వరకు పడిగాపులు కాసి చివరకు నిరాశతో వెనుదిరిగారు.
పొరపాటు జరిగిందిలా..
డేటా ఏంట్రీ ఆపరేటర్లు ఎంతో కష్టపడి కుటుంబాల సమాచారాన్ని నమోదు చేశారు. అరుుతే 55వేలకు పైగా డబుల్ ఏంట్రీలు ఉండడంతో వాటిని అధికారులు ఆన్లైన్లో తొలగించారు. ఇందు కు సంబంధించి అధికారులు లెక్కలు తేల్చకపోవడంతో *.5లక్షల 50వేలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని ప్రణాళిక అధికారులు చెల్లింపును నిలిపేశారు. వీటిని వెంటనే సరిచెయ్యాల్సిన అధికారులు నిర్లక్ష్యం చెయ్యడంతో ఇప్పుడు గందరగోళం నెలకొంది.
రెండు మూడు రోజుల్లో ఇస్తాం
ఎన్ఐసి అధికారుల పొరపాటు కారణంగా 5.50లక్షలు ఎక్కువయ్యావని, వీటిని సవరించి రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని డీఆర్వో రాంకిషన్ తెలిపారు. టెక్నికల్ సమస్య పూర్తయిన వెంటనే వివరాలను కలెక్టర్‌కు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.