DSC-1998
-
ఏపీ: 98 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు
సాక్షి, తాడేపల్లి: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్దులకు తీపికబురు అందించింది ఏపీ ప్రభుత్వం. అభ్యర్థులందరికీ న్యాయం చేసే ఫైల్ మీద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతకం చేశారు. ఈ మేరకు వారికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో విధివిధానాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వారికి(98 డీఎస్సీ అభ్యర్థులు) ప్రభుత్వం న్యాయం చేయనుందని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తెలిపారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న 98 DSC ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. ఇరవై ఏళ్ల నుంచి ఈ సమస్య పెండింగ్‌లో ఉంది. ఏ ప్రభుత్వమూ వారికి న్యాయం చేయలేదు. సీఎం జగన్ న్యాయం చేస్తారని నమ్మి వాళ్ళు విన్నవించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. .. గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 98, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగలేదు. 2008 డీఎస్సీ అభ్యర్థుకుల కూడా సీఎం జగన్ న్యాయం చేశారు. తాజా నిర్ణయంతో 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుంది. త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి...విధివిధానాలు రూపొందిస్తున్నారు అని ఎమ్మెల్సీ వెల్లడించారు. -
1998 డిఎస్సీ అభ్యర్థులను ముంచుతారా?
ఉమ్మడి రాష్ట్రంలో 1998లో డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు వారికి జరిగిన అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ 2015 జనవరి 11న వరంగల్ జిల్లా పర్యటనలో మాట్లాడుతూ 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డికి ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్ ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ముఖాముఖీ చర్చిం చారు. అన్యా యం జరిగిందని సీఎం స్వయంగా ప్రకటించారు. హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు మంత్రి, విద్యాశాఖ అధికారులు తిరకాసులు పెడుతూ సీఎంనే తప్పు తోవ పట్టిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 1998 డిఎస్సీ లో నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత, నిబంధనలకు విరుద్ధంగా, అర్హత మార్కులను 5 వరకు తగ్గించి, మరల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిపించి, వారికి ఉద్యోగం ఇచ్చారు. తెలం గాణ ప్రభుత్వంలోని 40 మంది ఎన్నికయిన శాసనసభ సభ్యులు, 6 గురు ఎమ్మెల్సీలు, 6గురు పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, 10 ఉపాధ్యాయ సంఘాలు 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. బుధవారం సీఎం కేసీఆర్, ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘ సభ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముంచుతారా, తేలుస్తారా, ఇచ్చిన హామీలను (సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి) అమలు చేస్తారా అని 1,500 మంది క్వాలిఫైడ్ టీచర్ల కుటుంబాలు ఆశలు పెట్టుకుంటున్నారు. రాజేష్ రావుల, లెక్చరర్, కరీంనగర్ మొబైల్ : 98488 11424 -
డీఎస్సీ–1998 అక్రమాలపై వివరణ ఇవ్వండి
పాఠశాల విద్యాశాఖ, వరంగల్ అర్బన్ కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–1998లో అక్రమాలు జరిగాయని సీనియర్ ఐఏఎస్ అధికారి సారథ్యం లోని ఉన్నత స్థాయి కమిటీనిర్ధారించినా నేటికీ నివారణ చర్యలు చేపట్టలేదన్న వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన కె.వేణు, ఎన్.రమేశ్ మరికొందరు యు వకులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి గురువారం విచారించారు. డీఎస్సీ–1998లో అక్రమాలు జరిగాయని ఉన్నతస్థాయి కమిటీ 2004లో నిర్ధారించినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.ఎస్.అర్జున్ కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు ఆదేశాల ఉన్నాయని చెప్పి సున్నా మార్కులు సాధించిన వి.మేరీకి ఇంటర్వ్యూలో నాలుగే మార్కులు వచ్చినా సెకండ్ గ్రేడ్ టీచర్‌గా (ఎస్జీటీ) ఎంపి క చేశారన్నారు. వాస్తవానికి కోర్టు ఆదేశాలు లేవని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా అధికారులు చెబుతున్న ఆ కోర్టు తీర్పు ప్రతిని మాత్రం ఇవ్వడం లేదన్నారు. వరంగల్ డీఎస్సీ చైర్మన్ (కలెక్టర్), డీఈవోల అనుమతి లేకుండానే 65 మంది ఎస్జీటీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో డీఎస్సీ–1998 అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... తెలంగాణ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్, వరంగల్ అర్బన్ జిల్లా డీఎస్సీ చైర్మన్, డీఈవోలకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.