DTH services company
-
టాటా ప్లే(స్కై) కస్టమర్లకు శుభవార్త..!
దేశంలోని అతిపెద్ద డైరెక్ట్ టూ హోమ్(డీటీహెచ్) టీవీ కంపెనీ టాటా ప్లే తన చందాదారులకు మంచి శుభవార్త తెలిపింది. తన చందాదారుల ఛానల్ ప్యాక్‌ల రేట్లను సగానికి మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఓటీటీ కంటెంట్ రాజ్యం ఎలుతున్న ఈ కాలంలో.. ఛానల్ ప్యాక్‌ల రేట్లను తగ్గించిన కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇతర సర్వీసు ప్రొవైడర్లు రేట్లను పెంచుతూ తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్'ను పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఈ సమయంలో టాటా ప్లే మంచి నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఛానల్ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ఆ కంపెనీ యూసేజ్ హిస్టరీని బట్టి నిర్ణయిస్తుంది. వినియోగదారులకు కావాల్సిన ఛానల్స్‌ను మాత్రమే చూసుకునేలా ధరల తగ్గింపు చేపడుతోంది. టాటా ప్లే తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లకు నెలవారీ రూ.30 నుంచి రూ.100 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా ప్లేకు 19 మిలియన్ల మంది యాక్టివ్ చందాదారులు ఉన్నారు. కాగా, టాటా స్కై సంస్థ పేరును ఇటీవలే టాటా ప్లేగా మార్చింది. జనవరి 27, 2022 నుంచి టాటా స్కై కొత్త పేరు టాటా ప్లే పేరు అందుబాటులోకి వచ్చింది. టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ సర్వీసులను విస్తృతంగా అందిస్తోంది. (చదవండి: ఇక జీఎస్టీ మూడు శ్లాబులేనా.. వాటి ధరలు పెరగనున్నాయా?) -
టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్
ముంబై: త్వరలో క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డెరైక్ట్-టు-హోమ్(డీటీహెచ్) సేవల సంస్థ టాటాస్కై భారత్‌లో తొలి 4కే సెట్-టాప్ బాక్స్‌ను (ఎస్టీబీ) ఆవిష్కరించింది. ఈ తరహా ఎస్టీబీలు ప్రసారాలను మరింత నాణ్యతతో అందించగలవు. 4కే సెట్ టాప్ బాక్సుల ధర ప్రస్తుత కస్టమర్లకు రూ. 5,900కి, కొత్త కస్టమర్లకు రూ. 6,400కు లభించగలదని సంస్థ తెలిపింది.