Duanne Olivier
-
రహానే వికెట్‌తో రికార్డుల్లోకెక్కిన సఫారీ బౌలర్
వాండరర్స్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. రాహుల్(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా, పుజారా (3), రహానే (0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ ఒలివర్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్ 24వ ఓవర్ మూడో బంతికి పుజారాను ఔట్ చేసిన అతను.. నాలుగో బంతికి రహానేను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఒలీవర్ 1486 బంతుల్లో 50 వికెట్ల మార్కును చేరుకోగా.. దక్షిణాఫ్రికాకే చెందిన వెర్నాన్ ఫిలాండర్ 1240 బంతుల్లోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ (1844), న్యూజిలాండ్ బౌలర్ కైల్ జెమీసన్ (1865), ఫ్రాంక్ టైసన్ (1880), షేన్ బాండ్ (1943) ఉన్నారు. చదవండి: ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ను కాదని విహారి ఎందుకు..? -
మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి.. ఇంకా బయోబబుల్‌లోనే!
మూడేళ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ డ్యుయన్నే ఓలివర్.. టీమిండియాతో తొలి టెస్ట్‌కు జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతడికి తుది జట్టులో చోటు దక్క లేదు. అతడికి జట్టులో చోటు దక్కపోవడానికి గల గల కారణాన్ని ఆ జట్టు సెలెక్టర్ల కన్వీనర్ మిప్టిసెన్ వెల్లడించాడు. ఈ సిరీస్‌కు కొన్ని వారాల ముందు ఓలివర్ కరోనా బారిన పడ్డాడని, అయితే అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని అతడు తెలిపాడు. కాగా అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడని మిప్టిసెన్ చెప్పారు. "ఓలివర్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓలివర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అతడిని సెలక్షన్ ప్యానల్ ఎంపిక చేసిన తరువాత నేరుగా జట్టు బయోబుల్‌లో వచ్చి చేరాడు. అదే విధంగా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో భాగంగా ఓలివర్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు గాయం అంతా తీవ్రమైనది కాదు. కానీ కొవిడ్ ప్రొటోకాల్, అతడి గాయన్ని దృష్టిలో పెట్టుకుని మేము అంత రిస్క్ తీసుకోలేదు. అందుకే అతడికి తొలి టెస్ట్‌కు జట్టులో చోటు దక్కలేదు. మిగిలిన రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాము" అని అతడు పేర్కొన్నాడు. గాయపడ్డ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే స్ధానంలో ఓలివర్ జట్టులోకి వచ్చాడు. చదవండి: తండ్రైన టీమిండియా క్రికెటర్.. మా కుమారుడు అంటూ ఎమోషనల్..! కంగ్రాట్స్ భయ్యా! . -
మూడేళ్ల తర్వాత రీఎంట్రీ.. నోర్ట్జే స్థానంలో
Duanne Olievier Set Comeback For SA In Boxing Day Test Vs IND.. టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. కాగా గాయపడ్డ అతని స్థానంలో కొత్త ఆటగాడిని ఎంపిక చేసేందుకు సీఎస్ఏ ఆసక్తి చూపలేదు. దీంతో తొలి టెస్టుకు నోర్జ్టే స్థానంలో ఎవరొస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో డ్యుయన్నే ఓలివర్ పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే దాదాపు మూడేళ్ల తర్వాత సౌతాఫ్రికా తరపున ఓలివర్ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. ఇప్పటివరకు ప్రొటీస్ తరపున 10 టెస్టుల్లో 48 వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, లుంగీ ఎన్గిడితో కలిసి ఓలివర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం కాగా 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఓలివర్.. 2018లో చివరిసారి పాకిస్తాన్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టును ఆడాడు. కాగా ఓలివర్ ఆ ఆ టెస్టులో విశేషంగా రాణించాడు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఓలివర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో 24 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2019 జనవరిలో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే తరచూ గాయాల బారీన పడుతూ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఓలివర్ బాక్సింగ్ డే టెస్టు ద్వారానే ఎంట్రీ ఇస్తుండడం విశేషం. టీమిండియాతో ఆడబోయే సౌతాఫ్రికా జట్టు(అంచనా): డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, కీగన్ పీటర్సన్, వాన్‌డర్ డుసెన్, కైల్ వెరిన్నే, క్వింటన్ డికాక్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, డ్యుయన్నే ఓలివర్, లుంగీ ఎన్గిడి -
Ind Vs Sa Test Seires: భారత్‌తో సిరీస్.. ప్రొటిస్ జట్టు ఇదే.. అతడు వచ్చేశాడు!
Ind Vs Sa: South Africa Announce 21 Man Squad For India Tests Duanne Olivier Returns: టీమిండియాతో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. స్వదేశంలో డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానున్న సిరీస్ కోసం 21 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా 2019లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన డువాన్ ఒలివర్‌కు పిలుపు రావడం గమనార్హం. కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జేలతో పాటు ఒలివర్ కూడా చేరడంతో బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారనుంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ సారథ్యంలో సాగనున్న ఈ సిరీస్‌కు తెంబా బవుమా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ప్రొటిస్ జట్టు: డీన్ ఎల్గర్(కెప్టెన్), తెంబా బవుమా(వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), కగిసొ రబడ, సరేల్ ఎర్వీ, బ్యూరన్ హెన్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, ఎడెన్ మార్కరమ్, వియాన్ మల్డర్, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసేన్, కైలీ వెరెన్, మార్కో జాన్సన్, గ్లెంటన్ స్టరమ్మాన్, ప్రెనెలన్ సుబ్రయేన్, సిసాండ మగల, రియాన్ రికెల్టన్, డువాన్ ఒలివర్. PC: ICC అప్పుడు పాకిస్తాన్‌ను చుక్కలు చూపించాడు 10 టెస్టు మ్యాచ్‌లలో 43 వికెట్లు తీసిన ఘనత డువాన్ ఒలివర్ది. ముఖ్యంగా పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఈ ఫాస్ట్ బౌలర్. 2018-19లో పాక్‌తో సిరీస్‌లో భాగంగా.. 3 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఒలివర్.. కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్ కోసం అతడిని ఎంపిక చేయడం విశేషం. ఈ నేపథ్యంలో డువాన్ గనుక తుది జట్టులో చోటు దక్కించుకున్నట్లయితే.. టీమిండియా బౌలర్లకు తిప్పలు తప్పవు మరి! చదవండి: India Tour of South Africa- Revised Schedule: టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. కొత్త షెడ్యూల్ ఇదే #Proteas SQUAD ANNOUNCEMENT 🚨 2️⃣ 1️⃣ players Maiden Test call ups for Sisanda Magala and Ryan Rickelton 👍 Duanne Olivier returns 🇿🇦 Read more here ➡️ https://t.co/ZxBpXXvQy1#SAvIND #BetwayTestSeries #BePartOfIt pic.twitter.com/6rIDzt1PuO — Cricket South Africa (@OfficialCSA) December 7, 2021