మూడేళ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ డ్యుయన్నే ఓలివర్.. టీమిండియాతో తొలి టెస్ట్‌కు జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతడికి తుది జట్టులో చోటు దక్క లేదు. అతడికి జట్టులో చోటు దక్కపోవడానికి గల గల కారణాన్ని ఆ జట్టు సెలెక్టర్ల కన్వీనర్ మిప్టిసెన్ వెల్లడించాడు. ఈ సిరీస్‌కు కొన్ని వారాల ముందు ఓలివర్ కరోనా బారిన పడ్డాడని, అయితే అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని అతడు తెలిపాడు. కాగా అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడని మిప్టిసెన్ చెప్పారు.
"ఓలివర్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓలివర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అతడిని సెలక్షన్ ప్యానల్ ఎంపిక చేసిన తరువాత నేరుగా జట్టు బయోబుల్‌లో వచ్చి చేరాడు. అదే విధంగా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో భాగంగా ఓలివర్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు గాయం అంతా తీవ్రమైనది కాదు. కానీ కొవిడ్ ప్రొటోకాల్, అతడి గాయన్ని దృష్టిలో పెట్టుకుని మేము అంత రిస్క్ తీసుకోలేదు. అందుకే అతడికి తొలి టెస్ట్‌కు జట్టులో చోటు దక్కలేదు. మిగిలిన రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాము" అని అతడు పేర్కొన్నాడు. గాయపడ్డ స్టార్ పేసర్ అన్‌రిచ్ నోర్ట్జే స్ధానంలో ఓలివర్ జట్టులోకి వచ్చాడు.
చదవండి: తండ్రైన టీమిండియా క్రికెటర్.. మా కుమారుడు అంటూ ఎమోషనల్..! కంగ్రాట్స్ భయ్యా!
.
Comments
Please login to add a commentAdd a comment