సర్వేను అడ్డుకున్న దుబ్బగూడెం గ్రామస్తులు
కాసిపేట : కేకే ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెంలో చేపడుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల గణనను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థలం చూపించిన తరువాత సర్వేలు చేయాలని డిమాండ్ చేశారు. గతం నుంచి సర్వేలను అడ్డుకోగా గ్రామస్తులను ఒప్పించి పునరావాసానికి అనువైన స్థలం చూపిస్తామని చెప్పి అధికారులు కాలం గడుపుతున్నారన్నారు. గ్రామస్తులకు ఇష్టమైన స్థలం చూసుకోమని కోరగా మందమర్రి మంచిర్యాల మధ్యలో అందుగులపల్లి సమీపంలో చూశామన్నారు. ఈ స్థలంపై ఏం చెప్పకుండా సర్వేల పేరుతో రెవెన్యూ అధికారులు గ్రామాలకు రావద్దని, స్థలం సమస్య పరిష్కరించి సర్వేలు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. తహసీల్దార్ కవిత నచ్చచెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వినలేదు. దీంతో అధికారులు సర్వే నిలిపివేసి వెనుతిరిగారు.
సర్వేను అడ్డుకున్న దుబ్బగూడెం గ్రామస్తులు, serve, dubbagudem, stop