dubbing association
-
చిన్మయి నిషేధంపై స్టే
మీటూ ట్వీట్లతో కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది మీటూ ఆరోపణల నేపథ్యంలో తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై చిన్మయి తీవ్ర ఆరోపణలు చేశారు. రాధరవి చాలా సందర్భాల్లో మహిళపై దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో కొద్ది రోజుల్లోనే చిన్మయిపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ నిషేధం విధించింది. ఈ ఘటనపై చిన్మయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిషేధంపై స్టే విధించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్మయి ‘కోర్టు నా మీద విధించిన నిషేధంపై స్టే ఇచ్చింది. కానీ ఇంకా చేయాల్సిన పోరాటం చాలా ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది’ అంటూ ట్వీట్ చేశారు. I have been awarded an interim stay order by the Honble Court regarding my ban from the Tamilnadu Dubbing Union. It is a long legal battle ahead. Hope justice will prevail. Thank you. — Chinmayi Sripaada (@Chinmayi) 15 March 2019 -
చిన్మయి మరోసారి సంచలన ఆరోపణలు
మీటూ అంటూ ఉద్యమించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇపుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించిన రెండు వారాల అనంతరం ఆమె తన అధికారిక యూట్యూబ్ చానల్లో 19నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ట్విటర్లో వరుస ట్విట్లతో అనేక ప్రశ్నల్ని, విమర్శల్ని లేవనెత్తారు. ముఖ్యంగా డబ్బింగ్ యూనియన్ అక్రమాలు, డబ్బింగ్ ఫీజులో 10శాతం వసూలు తదితర విషయాలపై ఆమె స్పందించారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ పలు సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఫీజు చెల్లించినా తప్పుడు ఆరోపణలతో తనను అక్రమంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ డబ్బింగ్ యూనియన్‌కు సంబంధించిన లైఫ్ మెంబర్షిప్ (జీవితకాల సభ్యత్వం) చెల్లించినట్టు వెల్లడించారు. 2016, ఫిబ్రవరి 11న బ్యాంక్ ద్వారా ఈ చెల్లింపు చేశానని తెలిపారు. అయితే ఆ సమయంలో యూనియన్‌వాళ్లు తనకు రసీదును ఇవ్వలేదని చెప్పారు. రిసీట్ చూపించని కారణంగా డబ్బింగ్ యూనియన్ గత ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని నిరాకరించారని తెలిపారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించకోలేదన్నారు. తాను లైఫ్‌మెంబర్‌షిప్ చెల్లించినా, తనను యూనియన్ సభ్యురాలిగా తొలగించడంపైనా, అసలు ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె మరోసారి ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో బ్యాంకు స్టేట్మెంట్ను పోస్ట్ చేశారు. కేవలం రాధా రవి వేధింపులకు గురైన కొంతమంది బాధిత మహిళలకు మద్దతుగా ఉన్నందుకు ప్రతీకారంగానే ఇదంతా జరిగిందని ఆరోపించారు. అలాగే తమిళ డబ్బింగ్ యూనియన్‌కు సంబంధించి తనతో కలిసి మొత్తం 97మంది సభ్యులు గత రెండేళ్లుగా ఎలాంటి సభ్యత్వ రుసుమును చెల్లించలేదని యూనియన్ చెబుతోందన్నారు. యూనియన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారి సభ్యత్వాన్ని తొలగించారని, అయితే వారు కోర్టుద్వారా కొంతమంది సభ్యత్వాన్ని తిరిగి తెచ్చుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు డబ్బింగ్ యూనియన్‌పై భూమా సుబ్బారావు అనే ఆర్టిస్టు చేస్తున్న పోరాటాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. దాదాపు 16 ఫిర్యాదులు నమోదైనట్టు తెలిపారు. దీంతోపాటు గత నెలలో నమోదైన ఎఫ్ఐఆర్, చార్జిషీటు వివరాలను కూడా చిన్మయి ట్వీట్ చేశారు. తమిళ సినీపరిశ్రమతో పాటు డబ్బింగ్ యూనియన్‌లో లైంగిక వేధింపులపై గాయని చిన్మయి శ్రీపాద ఆరోపణలు చేశారు. ముఖ్యంగా గీత రచయిత వైరముత్తుతో పాటు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిలపై పలు ఆరోపణలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా సభ్యత్వ రుసుము చెల్లించలేదంటూ యూనియన్ నుంచి తొలగించినట్టు అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Here is the video. The statement that I didn’t pay the dubbing union subscription fee is false. 👇🏼https://t.co/1TVsdgeasM — Chinmayi Sripaada (@Chinmayi) November 23, 2018 These are the list of writ petitions/ cases filed against the Dubbing Union. Plus there is an FIR and a chargesheet filed as well a few months ago. pic.twitter.com/HurRFhd4zo — Chinmayi Sripaada (@Chinmayi) November 24, 2018 -
తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు
‘మీటూ’ ఉద్యమం గురించి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిర్భయంగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన ట్వీటర్ ఖాతా ద్వారా చాలా మంది అజ్ఞాత స్త్రీల ఆరోపణలకు గొంతునిచ్చారు. ప్రముఖ పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవి మీద ఆరోపణలు చేశారు. వీటివల్ల మీకు అవకాశాలేమైనా తగ్గుతాయనుకుంటున్నారా? అని ఆ మధ్య ‘సాక్షి’ అడిగినప్పుడు ‘అలాంటిదేం లేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా’’ అని చిన్మయి అన్నారు. మరి.. తాజా పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. విషయం ఏంటంటే.. చిన్మయిని డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తొలగించారు. ‘‘నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అంటే.. ఇక తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పలేను. రెండు సంవత్సరాలుగా నేను యూనియన్ ఫీజŒ కట్టలేదన్నదాన్ని కారణంగా చూపించారు. కానీ, ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పడం వల్ల నాకొచ్చిన ఆదాయంలో 10శాతం తీసుకున్నారు. పాత బకాయిలున్నట్టు మెసేజ్ కానీ, లెటర్ కానీ పంపకుండా నా మెంబర్షిప్ తొలగించారు. మళ్లీ తమిళ సినిమాలకు డబ్ చేస్తానో లేదో తెలియదు’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. విశేషం ఏంటంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌కు రాధారవి ప్రెసిడెంట్. -
వివాదంలో సూపర్ స్టార్ అల్లుడు
చెన్నై: కోర్టు ధిక్కారణ నేరం కింద ప్రముఖ కోలీవుడ్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. టీవీ సీరియల్ , మూవీ డబ్బింగ్ కళాకారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం, టీవీ సీరియల్ కళాకారుల సంఘంలో సభ్యులుగా ఉన్న తమ వేతనాలలో 10 శాతం యూనియన్‌కు చెల్లించే విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ధనుష్ సహా మరికొంతమంది ప్రముఖులపై డబ్బింగ్ కళాకారులు కోర్టులో ఫిర్యాదు చేశారు. స్థానిక కోడంబాక్కంకు చెందిన మతియాజగన్, సాలిగ్రామంకు చెందిన ఆర్ మహాలక్ష్మి, పీఆర్ కణ్ణన్లు హైకోర్టులో ఈ పిటీషన దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే హీరో, హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులకు డబ్బింగ్ చెప్పే కళాకారులు తమ వేతనంలో పది శాతాన్ని యూనియన్ కు చెల్లించే సంప్రదాయం గతంలో ఉండేది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ చెల్లింపులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ధనుష్ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు. కళాకారులకు ఇవ్వాల్సిన చెల్లింపులో 10శాతం కోతను యథావిధిగా కొనసాగిస్తున్నారు. దీనిపై వారు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. అసోసియేషన్ సెక్రటరీ ప్రకాష్, అధ్యక్షుడు సెల్వరాజ్, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు, నిర్మాత థానులకు ఈ నోటీసులిచ్చింది.