duggirala Vice MPP
-
5న దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
దుగ్గిరాల(తెనాలిటౌన్): దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈనెల 5న జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి ఆదివారం తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని ఆమె వివరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ ప్రసన్న వ్యవహరిస్తారని, గతంలో కోరం లేక పోవడంతో మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక జరగలేదని వివరించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో 5న ఉదయం 10గంటలకు కో–ఆప్షన్ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు, మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం కో–ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరుగుతుందని, మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఎంపీడీఓ వెల్లడించారు. -
దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం
► అధికార పార్టీ కుట్రలు విఫలం ► వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: దుగ్గిరాల మండల ఉపాధ్యక్ష పదవిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. దొడ్డిదారిన వైస్ ఎంపీపీ పదవిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), నియోజకవర్గ నేతలు కలసి వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షుడి పదవిని గతంలోనే వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ పదవిపై ఒప్పందం కుదిరింది. ఆ మేరకు రెండో వ్యక్తి కోసం శుక్రవారం ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలో వైస్ ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా శ్రమించింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి తమవైపునకు తిప్పుకొనేందుకు కోరం లేదనే సాకుతో శుక్రవారం ఎన్నిక జరగకుండా శనివారానికి వాయిదా వేయించింది. టీడీపీ ఆగడాలను గుర్తించిన ఎమ్మెల్యే ఆర్కే వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఈమని తీసుకెళ్లారు. వారిని శనివారం ఉదయమే మండల పరిషత్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే పోలీసులు భారీగా ఉండడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. టీడీపీ కార్యకర్తలు వచ్చి అల్లర్లు సృష్టించి ఎన్నికను నిలువరించాలని కుట్ర పన్నినా, అవి సాగలేదు. అధికారులు ఎన్నిక నిర్వహించి ఈమని ఎంపీటీసీ సభ్యుడు మత్తె ఆనంద్(వైఎస్సార్సీపీ)ను ఉపాధ్యక్షుడిగా ప్రకటించి, ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎన్నిక టీడీపీ పతనానికి నాంది అని విమర్శించారు.