దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం | Duggirala zone picked up the role of vice president YSRCP | Sakshi
Sakshi News home page

దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం

Published Sun, Oct 30 2016 4:41 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం - Sakshi

దుగ్గిరాల వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం

అధికార పార్టీ కుట్రలు విఫలం
వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: దుగ్గిరాల మండల ఉపాధ్యక్ష పదవిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. దొడ్డిదారిన వైస్ ఎంపీపీ పదవిని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్‌కే), నియోజకవర్గ నేతలు కలసి వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. దుగ్గిరాల మండల పరిషత్ ఉపాధ్యక్షుడి పదవిని గతంలోనే వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ పదవిపై ఒప్పందం కుదిరింది. ఆ మేరకు రెండో వ్యక్తి కోసం శుక్రవారం ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలో వైస్ ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ తీవ్రంగా శ్రమించింది.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేసి తమవైపునకు తిప్పుకొనేందుకు కోరం లేదనే సాకుతో శుక్రవారం ఎన్నిక జరగకుండా శనివారానికి వాయిదా వేయించింది. టీడీపీ ఆగడాలను గుర్తించిన ఎమ్మెల్యే ఆర్‌కే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ఈమని తీసుకెళ్లారు. వారిని శనివారం ఉదయమే మండల పరిషత్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే పోలీసులు భారీగా ఉండడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. టీడీపీ కార్యకర్తలు వచ్చి అల్లర్లు సృష్టించి ఎన్నికను నిలువరించాలని కుట్ర పన్నినా, అవి సాగలేదు. అధికారులు  ఎన్నిక నిర్వహించి ఈమని ఎంపీటీసీ సభ్యుడు మత్తె ఆనంద్(వైఎస్సార్‌సీపీ)ను ఉపాధ్యక్షుడిగా ప్రకటించి, ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎన్నిక టీడీపీ పతనానికి నాంది అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement