breaking news
Duleep Trophy 2025
-
సెంచరీ వీరుడు అవుట్.. ఫైనల్లో కష్టమే!
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) ఫైనల్‌కు చేరిన సౌత్ జోన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సెంచరీ వీరుడు నారాయణ్ జగదీశన్ (N Jagadeesan) జట్టుకు దూరమయ్యాడు.అదే విధంగా.. దేవ్‌దత్ పడిక్కల్ కూడా అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్- ‘ఎ’ తరఫున ఆడబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానుంది.సౌత్ జోన్ వర్సెస్ సెంట్రల్ జోన్మరోవైపు.. దులిప్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సెప్టెంబరు 11- 15 వరకు షెడ్యూల్ ఖరారైంది. సౌత్ జోన్- సెంట్రల్ జోన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నారాయణ్ జగదీశన్, దేవ్‌దత్ పడిక్కల్ స్థానాల్లో ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), స్మరణ్ రవిచంద్రన్ (కర్ణాటక) సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యారు. అజయ్ రోహెరా, అనికేత్ రెడ్డి స్టాండ్ బై ప్లేయర్లుగా చోటు దక్కించుకున్నారు.ఫైనల్‌కు సౌత్ జోన్ జట్టు (అప్డేటెడ్)అజారుద్దీన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రికీ భుయ్ (వైస్-కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, కాలే ఎమ్, షేక్ రషీద్, తన్మయ్ అగర్వాల్, సల్మాన్ నిజార్, ఆండ్రీ సిద్దార్థ్, తనయ్ త్యాగరాజన్, గుర్జాబ్నీత్ సింగ్, నిధీష్, కౌశిక్ వి, అనికేత్, టి. విజయ్, బాసిల్ ఎన్పీ.స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), స్నేహల్ కౌతంకర్ (గోవా), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), అజయ్ రోహెరా (పాండిచ్చేరి), జి. అనికేత్ రెడ్డి (హైదరాబాద్).వెస్ట్‌జోన్‌కు నిరాశేఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్‌లాంటి భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన వెస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో దేశవాళీ ఆటగాళ్లతో కూడిన సెంట్రల్ జోన్ ముందంజ వేసింది. మరో సెమీఫైనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, రికీ భుయ్‌లు బాధ్యతగా ఆడటంతో సౌత్‌జోన్ కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.నార్త్‌జోన్‌తో సౌత్ సెమీస్ పోరు కూడా ‘డ్రా’గానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అంతిమ పోరుకు అర్హత సంపాదించిన సౌత్‌జోన్... ఈ నెల 11 నుంచి ఇదే వేదికపై జరిగే టైటిల్ పోరులో సెంట్రల్ జోన్‌తో తలపడుతుంది. విజేతను తేల్చనున్న ఫైనల్ మ్యాచ్ సంప్రదాయ టెస్టులాగా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. సెంట్రల్ 600 ఆలౌట్ వెస్ట్‌జోన్‌తో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఆఖరి రోజు సారాంశ్ జైన్ (108 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ కొట్టాడు. దీంతో క్రీజులోకి దిగిన 11 మందిలో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు అర్ధశతకం పైచిలుకు పరుగులు చేయడం విశేషం. దీంతో నాలుగో రోజు 556/8 ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సెంట్రల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164.3 ఓవర్లలో 600 పరుగుల వద్ద ఆలౌటైంది.టెయిలెండర్లు సారాంశ్, యశ్ ఠాకూర్లపై కూడా వెస్ట్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరు అవలీలగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో సారాంశ్ జైన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో వికెట్‌కు 42 పరుగులు జతయ్యాక యశ్ ఠాకూర్ (21; 5 ఫోర్లు)ను అర్జన్ అవుట్ చేయగా, కాసేపటికే ఖలీల్ అహ్మద్ (0) కూడా అతనికే వికెట్ అప్పగించడంతో సెంట్రల్ ఇన్నింగ్స్ సరిగ్గా 600 వద్ద ముగిసింది. అర్జన్ నాగ్వస్వాలాకు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్‌కు 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లింది.రాణించిన జైస్వాల్.. శ్రేయస్ ఫెయిల్అప్పటికే ఫలితం ఖాయమైన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్ట్‌జోన్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే సమయానికి 53.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన భారత డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్ (16) ఈసారి విఫలమవగా, శ్రేయస్ అయ్యర్ (12) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. మిగతా వారిలో తనుశ్ కొటియాన్ (72 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు), ఆర్య దేశాయ్ (35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. బ్యాటింగ్‌లో రాణించిన సెంట్రల్ బౌలర్ సారాంశ్ జైన్ 5, హర్ష్ దూబే 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సారాంశ్‌కు 8 వికెట్లు దక్కాయి. అజేయ అర్ధసెంచరీ కూడా సాధించడంతో అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.నార్త్‌జోన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 278/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌జోన్ 100.1 ఓవర్లలో 361 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం ఆటలో 83 పరుగులు జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్ శుభమ్ ఖజురియా (252 బంతుల్లో 128; 20 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరు వద్దే అవుటయ్యాడు. లోయర్ ఆర్డర్లో మయాంక్ డాగర్ (40 బంతుల్లో 31; 5 ఫోర్లు), సాహిల్ లోత్రా (19; 2 ఫోర్లు) కాసేపు సౌత్‌జోన్ బౌలర్లను ఎదుర్కోవడంతో జట్టు 300 పైచిలుకు స్కోరు దాటింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ని«దీశ్ వీరిద్ధరిని క్లీన్»ౌల్ట్ చేయడంతో ఆలౌటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. గుర్జప్నీత్ 4 వికెట్లు తీయగా, నిదీశ్‌కు 3 వికెట్లు దక్కాయి. జగదీశన్ అజేయ అర్ధశతకం అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్‌జోన్ మ్యాచ్ ముగిసే సమయానికి 24.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ నార్త్ బౌలర్లపై మళ్లీ ఆడుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల స్వల్ప తేడాతో డబుల్ సెంచరీని కోల్పోయిన జగదీశన్ (69 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించాడు. మొదట హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (13)తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 34 పరుగులు జతచేశాడు.తన్మయ్‌ని అకీబ్ నబీ బౌల్డ్ చేయడంతో జగదీశన్‌కు వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (54 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా సౌత్ రెండో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ‘డ్రా’ ఫలితం ఖాయమవడంతో జగదీశన్ అర్ధసెంచరీ పూర్తవగానే ఇరుజట్ల కెప్టెన్‌ను మ్యాచ్‌ను ముందుగానే ముగించేందుకు చేతులు కలిపారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన నారాయణ్ జగదీశన్ (తొలి ఇన్నింగ్స్‌లో 197)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
జగదీశన్ భారీ శతకం..దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2025లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ డ్రా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ ఆధారంగా సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు ఆర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నార్త్ జోన్ కెప్టెన్ అంకిత్ కుమార్ తొలుత సౌత్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. ఈ క్రమంలో మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌజ్ జోన్ బ్యాటర్లలో నారయణ్ జగదీశన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జగదీశన్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తంగా 352 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 197 పరుగులు చేశాడు.అతడితో పాటు జగదీశన్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 5, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు. అనంతరం నార్త్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. 258/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన నార్త్‌జోన్.. అదనంగా 103 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.నార్త్‌జోన్ బ్యాటర్లలో శుభమ్ కజురియా(28) సెంచరీతో కదం తొక్కాడు. అతడితో నిశాంత్ సింధు 82 పరుగులతో రాణించాడు. సౌత్‌జోన్ పేసర్ గుర్జప్నీత్ సింగ్ (4/96) టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు నిదేశ్ మూడు, టి త్యాగరాజన్, కౌశిక్ తలా వికెట్ సాధించారు.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్‌కు 175 పరుగుల ఆధిక్యం లభించింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన సౌత్ జోన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసిపోయింది. జగదీశన్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: Duleep Trophy 2025: ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్ -
ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్
ఆసియా కప్ 2025 ప్రధాన జట్టులో (స్టాండ్‌బైగా ఎంపిక) చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న జైస్వాల్.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా (4).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ద సెంచరీతో (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు.రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రాణించినా అతని జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోయేలా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించారు. ఒక వేళ మ్యాచ్ డ్రా అయిన పక్షంలో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. అదే జరిగితే సెంట్రల్ జోన్ ఫైనల్స్‌కు చేరుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన సెంట్రల్ జోన్ 162 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్.. రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ సెంచరీతో కదంతొక్కడంతో 438 పరుగులు చేసింది. తనుశ్ కోటియన్ (76), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోయినా 600 పరుగుల భారీ స్కోర్ చేసింది. దనిశ్ మాలేవార్ (76), షుభమ్ శర్మ (96), కెప్టెన్ రజత్ పాటిదార్ (77), ఉపేంద్ర యాదవ్ (87), హర్ష్ దూబే (75), సరాన్ష్ జైన్ (63 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.162 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రుతురాజ్ (16) విఫలం కాగా.. తనుశ్ కోటియన్ (1), షమ్స్ ములానీ (1) క్రీజ్‌లో ఉన్నారు. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు వెస్ట్ జోన్ ఇంకా 30 పరుగులు వెనుకపడి ఉంది. -
జగదీశన్‌కు హార్ట్ బ్రేక్.. డబుల్ సెంచరీకి 3 పరుగుల దూరంలో
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ ఓపెనర్, తమిళనాడు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నారయణ్ జగదీశన్‌ను దురదృష్టం వెంటాడింది. డబుల్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో జగదీశన్ ఔటయ్యాడు.అది కూడా రనౌట్ రూపంలో తన వికెట్‌ను జగదీశన్ కోల్పోయాడు. 148 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌ను మొదలు పెట్టిన జగదీశన్.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ తమిళనాడు ఆటగాడు సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించాడు.కానీ 197 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జగదీశన్.. నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు అద్భుత త్రోకు బలయ్యాడు. జగదీశన్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.128 ఓవర్లు ముగిసే సరికి సౌత్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 432 పరుగులు చేసింది. క్రీజులో తనయ్ త్యాగరాజన్(5), సల్మాన్ నిజార్(23) ఉన్నారు. సౌత్ జోన్ బ్యాటర్లలో జగదీశన్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 3, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు.ఇక ఈ మ్యాచ్‌లో తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న జగదీశన్ త్వరలో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా జగదీశన్ ఎంపికయ్యాడు.లండన్ టెస్టు ముందు భారత జట్టులో చేరిన జగదీశన్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు నారయణ్ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. ఎందుకంటే రిషబ్ పంత్‌తో పాటు వికెట్ కీపర్లు ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ గాయాలతో సతమతమవుతున్నారు. అయితే గత కొంత కాలంగా పంత్‌కు బ్యాకప్‌గా జురెల్ కొనసాగుతున్నాడు. ఇప్పుడు జురెల్ కూడా గాయం బారిన పడడంతో జగదేశన్కు టీమిండియా తరపున డెబ్యూ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: సారా టెండుల్కర్ నిశ్చితార్థం కూడా అయిపోయిందా?.. ఎవరీ అబ్బాయి? -
భారీ శతకాలతో చెలరేగిన రుతురాజ్, జగదీశన్.. పడిక్కల్ ఫిఫ్టీ
బెంగళూరు: రుతురాజ్ గైక్వాడ్ (206 బంతుల్లో 184; 25 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత శతకం సాధించడంతో వెస్ట్‌జోన్ భారీస్కోరు సాధించింది. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్‌తో గురువారం మొదలైన సెమీఫైనల్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్లకు 363 పరుగులు చేసింది. తనుశ్ కొటియాన్ (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) రాణించాడు. సెంట్రల్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, సారాంశ్ జైన్ చెరో 2 వికెట్లు తీశారు. గత నెలలో జరిగిన బుచి్చబాబు టోర్నీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన పోరులో మహారాష్ట్ర తరఫున చెలరేగి సెంచరీ బాదిన రుతురాజ్ ఇక్కడి బీసీసీఐ ఎక్సలెన్సీ గ్రౌండ్లోనూ అదే జోరు కొనసాగించాడు. 4/1... 10/2! బ్యాటింగ్‌కు దిగగానే వెస్ట్‌జోన్ కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మొదలైన ఓవర్లోనే 4 పరుగుల స్కోరు వద్దే కీలకమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) వికెట్‌ను కోల్పోయింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (1) కూడా వికెట్‌ను అప్పగించడంతో 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్ట్ కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ ఆడిన ఆట, చేసిన పరుగులు, పాతుకుపోయిన భాగస్వామ్యాలతో వెస్ట్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ముందుగా వన్‌డౌన్ బ్యాటర్ ఆర్య దేశాయ్ (39; 6 ఫోర్లు)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. చూడచక్కని బౌండరీలతో గైక్వాడ్ పరుగులు రాబట్టాడు. జట్టు స్కోరు 100కు ముందు 92 పరుగుల వద్ద ఆర్య అవుటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 25; 4 ఫోర్లు) బాధ్యత కనబరచలేకపోయాడు. క్రీజులోకి రాగానే అవుటయ్యే ప్రమాదం నుంచి బయట పడినప్పటికీ మరెంతో సేపు క్రీజులో నిలువలేదు. కుదురుగా ఆడుతున్న రుతురాజ్‌కు సహకారం అందించాల్సిన చోట నిర్లక్ష్యంగా 137 స్కోరు వద్ద అతనూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. తనుశ్ అండతో... రెండో సెషన్లో షమ్స్ ములానీ (18; 3 ఫోర్లు) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఈ దశలో క్రీజులోకి వచి్చన తనుశ్ కొటియాన్ అండతో గైక్వాడ్ బ్యాటింగ్ జోరుగా సాగింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడమే కాదు... పరుగుల్ని కూడా చకచకా రాబట్టారు. ఈ క్రమంలోనే రుతురాజ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం తర్వాత అతను వన్డేను తలపించే ఆటతీరుతో అలరించడంతో పరుగుల వేగం అనూహ్యంగా పుంజుకుంది. జట్టు స్కోరు 300 పైచిలుకు దాటింది. ఇక డబుల్ సెంచరీ ఖాయమనుకున్న దశలో రుతురాజ్‌ను సారాంశ్ అవుట్ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ (50 బంతుల్లో 24 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులోకి రాగా నింపాదిగా ఆడుతున్న తనుశ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు నాటౌట్‌గా నిలిచారు. రాణించిన పడిక్కల్, తన్మయ్టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడటంతో సౌత్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీస్ పోరును సాధికారికంగా ప్రారంభించింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (260 బంతుల్లో 148 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దులీప్ ట్రోఫీలో నార్త్‌జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ తొలిరోజు ఆట నిలిచే సమయానికి తొలిఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 2, అన్షుశ్ కంబోజ్ ఒక వికెట్ తీశారు. ఓపెనర్ల శుభారంభం టాస్ నెగ్గిన నార్త్‌జోన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సౌత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, జగదీశన్ చక్కని ఆరంభమిచ్చారు. ఇద్దరు చక్కని సమన్వయంతో పరుగులు సాధించారు. టీమిండియాతో కలిసి ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన నారాయణ్ జగదీశన్‌కు తుదిజట్టుకు ఆడే అవకాశం లభించలేదు. అయితే దేశవాళీ క్రికెట్లో తన బ్యాటింగ్ జోరును కనబరచడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేశాడు. తన్మయ్‌తో కలిసి నార్త్‌జోన్ బౌలర్లను అవలీలగా ఎదుర్కోన్నాడు.ఓపెనర్లిద్దరూ పాతుకుపోవడంతో నార్త్‌జోన్‌కు తొలిసెషన్లో కష్టాలు తప్పలేదు. చూస్తుండగానే జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. ఎట్టకేలకు జట్టు స్కోరు 103 పరుగుల వద్ద తన్మయ్ నిష్క్రమించడంతో తొలివికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. పడిక్కల్ ఫిఫ్టీ తొలి వికెట్ తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, జగదీశన్ పరుగులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అనవసర షాట్ల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్‌తో జట్టు స్కోరును నడిపించారు. క్రీజులో కుదురుకున్నాక పడిక్కల్ అడపాదడపా బౌండరీలతో అలరించాడు. దీంతో నార్త్ కష్టాలు కాస్త మళ్లీ మొదటికొచ్చాయి. ఇటు పరుగుల్ని ఆపలేక... అటు వికెట్లను పడగొట్టలేక నార్త్‌జోన్ బౌలర్లు రోజంతా ఆపసోపాలు పడ్డారు.ఇక దేవదత్ అర్ధసెంచరీ సాధించగా, నారాయణ్ జగదీశన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 200 పైచిలుకు దాటాకా పడిక్కల్‌ను అన్షుల్ కాంబోజ్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన మోహిత్ (15) తక్కువ స్కోరుకే పరిమితం కాగా... కెప్టెన్ అజారుద్దీన్ (11 బ్యాటింగ్), ఓపెనర్ జగదీశన్లు మళ్లీ మరో వికెట్ అవకాశాన్ని ఇవ్వకుండా రోజును ముగించారు. చేతిలో ఇంకా ఏడు వికెట్లున్న సౌత్‌జోన్ భారీస్కోరు దిశగా పయనిస్తోంది.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
సెంచరీతో చెలరేగిన స్టార్ ప్లేయర్.. టీమిండియా అరంగేట్రం ఖాయం!?
దేశవాళీ క్రికెట్లో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో నార్త్ జోన్, సౌత్ జోన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జగదేశన్ సెంచరీతో చెలరేగాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన జగదీశన్ తన అద్బుతమైన బ్యాటింగ్‌తో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత దేవదత్త్ పడిక్కల్‌తో కలిసి పార్టనర్‌షిప్‌ను జగదీశన్ నమోదు చేశాడు.ఓవరాల్‌గా 260 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 148 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ ఒక్క వికెట్ సాధించాడు.భారత జట్టులోకి జగదీశన్..!?కాగా ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా తరపున జగదీశన్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడ్డ భారత ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు విండీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు.అదేవిధంగా అతడికి ప్రత్నమ్నాయంగా ఉన్న మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సైతం తాజాగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. జురెల్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత లేదు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.మరోవైపు ఇషాన్ కిషన్ సైతం గాయంతో సతమతవతున్నాడు. దీంతో జగదీశన్‌కు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్టుకు ముందు జగదీశన్‌ను భారత జట్టులో చేరాడు. కానీ ఆడే అవకాశం మాత్రం లభించలేదు.చదవండి: ‘తుదిజట్టులో రింకూకు నో ఛాన్స్.. ఏడో స్థానంలో అతడే’ -
సెంచరీతో కదం తొక్కిన రుతురాజ్ గైక్వాడ్..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జాతీయ సెలక్టర్లకు సవాలు విసిరాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ 2లో వెస్ట్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుతురాజ్.. అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట రుతురాజ్ సత్తాచాటాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన తమ జట్టును రుతురాజ్ తన ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ 131 బంతుల్లో 13 ఫోర్లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు 157 బంతుల్లో 120 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 58 ఓవర్లు ముగిసే సరికి వెస్ట్ జోన్ 5 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. క్రీజులో రుతుతో పాటు తనీష్ కొటియన్(26) ఉన్నాడు.గైక్వాడ్ టెస్టుల్లో ఎంట్రీ ఇస్తాడా?టీమిండియా తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన రుతురాజ్ గైక్వాడ్ .. టెస్టు డెబ్యూ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికి గైక్వాడ్‌కు ఒక్కసారి కూడా భారత టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటిలో గైక్వాడ్ టెస్టుల్లో ఆడే సూచనలు కన్పించడం లేదు. ఎందుకంటే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ తమ స్ధానాలను సుస్థిరం చేసుకోగా.. మూడు, నాలుగు స్ధానాలు ప్రస్తుతానికి ఖాళీ లేవు. మూడో స్ధానంలో సాయిసుదర్శన్ వస్తుండగా.. నాలుగో ప్లేస్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాయిసుదర్శన్, కరుణ్ నాయర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఒకవేళ ఆ స్ధానాన్ని మరో ఆటగాడికి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తే రుతురాజ్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి సెలక్టర్లు ఎటువంటి అనుహ్య నిర్ణయాలు తీసుకోపోవచ్చు. కాగా వెస్టిండీస్-భారత్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. -
సెమీ ఫైనల్లో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఫెయిల్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించిన నాటి నుంచి రెండు పేర్లు చర్చనీయాంశమయ్యాయి. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో జైసూ కేవలం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైతే.. శ్రేయస్ అందుకు కూడా నోచుకోలేదు.సెమీ ఫైనల్లో ఇద్దరూ విఫలంఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముంబైకర్లకు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. శ్రేయస్, జైసూలకు ఆసియా కప్ జట్టులో చోటు ఇవ్వాల్సిందంటూ బీసీసీఐ తీరును విమర్శించారు. ఇలా చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న ఈ ఇద్దరు.. తాజాగా దులిప్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ సందర్భంగా మైదానంలో తిరిగి అడుగుపెట్టారు.వెస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. దులిప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నిరాశపరిచారు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ఈ క్రమంలో హర్విక్ దేశాయ్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక హర్విక్ ఒక్క పరుగు చేసి దీపక్ చహర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.25 పరుగులు చేసిన అయ్యర్వన్డౌన్లో వచ్చిన ఆర్య దేశాయ్ 39 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. 28 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించాడు. షమ్స్ ములానీ 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనఅయితే, నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అద్భుత అర్ధ శతకం (94 నాటౌట్)తో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో 45 ఓవర్ల ముగిసే సరికి వెస్ట్ జోన్ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక సెంట్రల్ జోన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, దీపక్ చహర్, సారాంశ్ జైన్, హర్ష్ దూబే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్‌తో ఆడే జట్టుకు ఎంపిక అవ్వాలంటేకాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ-2025లో సత్తా చాటాలని.. శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో నిరాశజనక ప్రదర్శనతో అతడి అవకాశాలు సన్నగిల్లినట్లే. రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం గురించి అయ్యర్ ఆశలు పెట్టుకోవచ్చు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
ధృవ్ జురెల్‌ను తప్పించిన సెలెక్టర్లు
వెస్ట్ జోన్‌తో రేపటి నుంచి (సెప్టెంబర్ 4) ప్రారంభం కాబోయే దులీప్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్‌కు ముందు సెంట్రల్ జోన్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ డెంగ్యూ కారణంగా టోర్నీ నుంచి తప్పించబడ్డాడు. జురెల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతూ కోలుకోలేకపోతున్నాడు. దీంతో సెలెక్టర్లే స్వయంగా రంగంలోని దిగి అతన్ని తప్పించారు. జురెల్‌కు ప్రత్యామ్నాయంగా విదర్భ రంజీ కెప్టెన్ అక్షయ్ వాద్కర్‌ను ప్రకటించారు.వాస్తవానికి ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జురెల్నే సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే నార్త్ఈస్ట్ జోన్‌తో మ్యాచ్ సమయానికి అతనికి జ్వరం ప్రారంభం కావడంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. జురెల్ స్థానంలో రజత్ పాటిదార్ ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా జురెల్ టోర్నీ మొత్తం నుంచే వైదొలగడంతో పాటిదార్ సెంట్రల్ జోన్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ తరఫున దనిశ్ మాలేవార్ (203 రిటైర్డ్ ఔట్), రజత్ పాటిదార్ (125), యశ్ రాథోడ్ (87 నాటౌట్), ఆర్యన్ జుయెల్ (60 రిటైర్డ్ హర్ట్) చెలరేగి ఆడారు.జురెల్‌కు ప్రత్యామ్నాయంగా ప్రకటించిన అక్షయ్ వాద్కర్కు వాస్తవానికి సెంట్రల్ జోన్ తొలుత ప్రకటించిన జట్టుకే ఎంపిక చేయాల్సి ఉండింది. అయితే టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు అధికంగా అందుబాటులో ఉండటం చేత అప్పట్లో అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.భీకర ఫామ్‌లో ఉండిన వాద్కర్‌ను పట్టించుకోకపోవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చాలా మంది వాద్కర్‌ను ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నించారు. వాద్కర్ తాజాగా ముగిసిన రంజీ ట్రోఫీలో విదర్భను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఆ సీజన్లో అతను 10 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 722 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపర్‌గానూ (24 డిస్మిసల్స్) సత్తా చాటాడు.తప్పుకున్న కుల్దీప్ సెమీస్‌కు ముందు సెంట్రల్ జోన్‌కు మరో షాక్ కూడా తగిలింది. క్వార్టర్ ఫైనల్లో ఆడిన కుల్దీప్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన కారణంగా జట్టును నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో అప్పటికే స్టాండ్ ప్లేయర్‌గా జట్టులో ఉండిన ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. -
తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కీలక టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ (Duleep Trophy)-2025 నుంచి అతడు విరమించుకున్నాడు. కాగా సౌత్ జోన్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ హైదరాబాదీ.. జాతీయ జట్టు విధులతో బిజీ కానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు.కాగా దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో సౌత్ జోన్ నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. సెప్టెంబరు 4- 7 వరకు నార్త్ జోన్‌తో మ్యాచ్ ఆడనుంది. కాగా.. సౌత్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అయితే, ఆ తర్వాత ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీకి ప్రకటించిన భారత జట్టులోనూ తిలక్ స్థానం సంపాదించాడు.ఆసియా కప్ కోసం..ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీ సెప్టెంబరు 9- 28 వరకు జరుగనుంది. ఈ ఖండాంతర ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తిలక్ వర్మ.. సౌత్ జోన్ జట్టుకు దూరమయ్యాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చిన తిలక్ వర్మ.. భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.సౌతాఫ్రికా పర్యటనలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ వరుస సెంచరీలతో దుమ్ములేపాడు. ఇక చివరగా స్వదేశంలో ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన తిలక్.. ఆ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో భాగమయ్యాడు. అనంతరం దులిప్ ట్రోఫీ టోర్నీకి అతడు అందుబాటులోకి వచ్చాడు.కెప్టెన్‌గా అతడు.. జట్టులోకి గుంటూరు కుర్రాడుఅయితే, దులిప్ ట్రోఫీ తొలి సెమీస్.. ఆసియా కప్ టోర్నీ ఆరంభానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండటంతో ఈ దేశీ టోర్నీకి తిలక్ వర్మ దూరంకాక తప్పలేదు. అతడితో పాటు.. చెన్నైకి చెందిన సాయి కిశోర్ కూడా సౌత్ జోన్ జట్టుకు దూరమయ్యాడు.ఈ క్రమంలో వీరిద్దరి స్థానంలో పుదుచ్చేరికి చెందిన అంకిత్ శర్మ, ఆంధ్ర క్రికెటర్, గుంటూరుకు చెందిన షేక్ రషీద్ సౌత్ జోన్ తరఫున దులిప్ ట్రోఫీలో సెమీస్ ఆడే సౌత్ జోన్ జట్టులోకి వచ్చారు. ఇక కెప్టెన్‌గా కేరళకు చెందిన వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ అజారుద్దీన్ తిలక్ వర్మ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అతడి డిప్యూటీగా తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఎన్. జగదీశన్ వ్యవహరించనున్నాడు.దులిప్ ట్రోఫీ-2025: సౌత్ జోన్ జట్టు (అప్డేటెడ్) మొహమ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), తన్మయ్ అగర్వాల్, షేక్ రషీద్, దేవ్‌దత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజార్, ఎన్.జగదీశన్ (వికెట్ కీపర్), టి. విజయ్, అంకిత్ శర్మ, తనయ్ త్యాగరాజన్, వైశాక్ విజయ్‌కుమార్, ఎండీ నిదీశ్, రిక్కీ భుయ్, బాసిల్ ఎన్పీ, గుర్జప్పీత్ సింగ్, స్నేహల్ కౌతంకర్.చదవండి: ‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’ -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
దులీప్ ట్రోఫీ-2025కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యా డు. అతడు కోలుకోవడానికి దాదాపు మూడు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున సర్ఫరాజ్ ఆడాల్సి ఉంది.కానీ ఇప్పుడు గాయపడడంతో సర్ఫరాజ్ స్ధానాన్ని మరొక ప్లేయర్‌తో వెస్ట్ జోన్ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు బెంగళూరు వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో నార్త్‌జోన్‌తో వెస్ట్ జోన్ తలపడనుంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సర్ఫరాజ్ ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు.ఆ తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ ముంబై క్రికెటర్ చేరాడు. అయితే సీఓఈ వైద్య బృందం సూచన మేరకు దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నాడు. సర్ఫరాజ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుచ్చిబాబు టోర్నీలో రెండు సెంచరీలతో మెరిశాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న సర్ఫరాజ్.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు."ఇంగ్లండ్ టూర్‌కు సర్ఫరాజ్‌కు చోటు దక్కకపోయినప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కు మాత్రం ఈ ముంబై ఆటగాడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోనే అవకాశముంది. సర్ఫరాజ్‌కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు భారత జట్టు తరపున కూడా అతడు సత్తాచాటాడు. విండీస్-భారత్ మధ్య టెస్టు సిరీస్ ఆక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన జట్టును సెప్టెంబర్ నాలుగో వారంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆ సమయానికి సర్ఫరాజ్ తన గాయం నుంచి కోలుకోకపోతే జట్టులో చోటు దక్కడం కష్టమే.సర్ఫరాజ్ స్ధానంలో ఎవరు?ఇక సర్ఫరాజ్ స్దానంలో వెస్ట్ జోన్ జట్టులోకి బరోడా బ్యాటర్ శివాలిక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన వెస్ట్ జోన్ రిజర్వ్ జాబితాలో శివాలిక్ శర్మ పేరు ఉంది. శివాలిక్ 18 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 43.48 సగటుతో 1,087 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!? -
తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్
జార్ఘండ్‌కు చెందిన 21 ఏళ్ల మానిషి తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన అతడు.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో (దులీప్ ట్రోఫీ మొదటి క్వార్టర్ ఫైనల్) ఈస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. నార్త్ జోన్‌పై 6 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో) తీశాడు.మానిషి తీసిన ఈ 6 వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలో రావడం విశేషం. ఈ కారణంగానే అతని పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మానిషికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు. వీరిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు.దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా మానిషి చరిత్ర సృష్టించాడు. అలాగే మార్క్ ఇలాట్ (1995), చమింద వాస్ (2005), తబిష్ ఖాన్ (2012), ఓలీ రాబిన్సన్ (2021), క్రిస్ రైట్‌తో (2021) కలిసి ప్రపంచ రికార్డును పంచుకున్నాడు. ఇలాట్, వాస్, తబిష్ ఖాన్, రాబిన్సన్, క్రిస్ రైట్ కూడా మానిషిలాగే ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురిని ఎల్బీడబ్ల్యూ చేశారు.మానిషి ఈ మ్యాచ్‌లో శుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్, యశ్ ధుల్, కన్హయ్య వధవాన్, ఆకిబ్ నబీ, హర్షిత్ రాణాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. మానిషి తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో (22.2-2-111-6) చెలరేగినా రెండో ఇన్నింగ్స్‌లో (34-3-166-0) తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సెమీస్‌కు అర్హత సాధించింది.జంషెడ్‌పూర్‌లో జన్మించిన మానిషికి ఇది తొలి దులీప్ ట్రోఫీ మ్యాచే అయినప్పటికీ.. ఇదివరకే 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2023-24 రంజీ సీజన్లో అతను అత్యుత్తమంగా (22 వికెట్లు) రాణించాడు. మానిషి 2019లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శన సహా 7 వికెట్లు తీశాడు. తాజా ప్రదర్శన తర్వాత మానిషిపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు దృష్టి సారించవచ్చు. -
అజేయ డబుల్ సెంచరీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న మరో యువ కెరటం
భారత టెస్ట్ జట్టువైపు మరో యువ కెరటం దూసుకొస్తుంది. కోహ్లి, పుజారా రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉన్న మిడిలార్డర్ స్థానాలకు ఆక్రమించేందుకు మరో ఆటగాడు రేసులో వచ్చాడు. ఈ రెండు స్థానాల కోసం ఇప్పటికే పదుల సంఖ్యలో పోటీ ఉంది. సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్ లాంటి వారు ప్రధాన పోటీదారులుగా ఉండగా.. కొత్తగా ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ ఆయుశ్ బదోని రేసులోకి వచ్చాడు.25 ఏళ్ల బదోనికి రెడ్ బాల్ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఢిల్లీ కుర్రాడు ఆడిన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 55కు పైగా సగటుతో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1200 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇవాళే (ఆగస్ట్ 31) చేశాడు.దులీప్ ట్రోఫీ 2025లో భాగంగా ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బదోని (నార్త్ జోన్) రెండో ఇన్నింగ్స్‌లో అజేయమైన డబుల్ సెంచరీతో (223 బంతుల్లో 204 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ బదోని మెరుపు హాఫ్ సెంచరీతో (63) మెరిశాడు.రెడ్ బాల్ క్రికెట్లో ఇటీవలికాలంలో భీకరమైన ఫామ్‌లో ఉన్న బదోని టెస్ట్ బెర్త్ కోసం భారత సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. గడిచిన 7 ఇన్నింగ్స్‌ల్లో అతను వరుసగా 204*, 63, 99, 60, 44, 205* & 49 స్కోర్లు చేశాడు. ఇలాంటి ప్రదర్శనల తర్వాత ఎవరైనా భారత జట్టులో చోటు ఆశిస్తారు. వాస్తవానికి టీమిండియాలో ఉండేందుకు బదోని పూర్తి అర్హుడు. కుడి చేతి వాటం బ్యాటరైన అతడు.. బౌలింగ్ (కుడి చేతి ఆఫ్ స్పిన్) కూడా చేయగలడు.బదోని ఇదివరకే పొట్టి ఫార్మాట్లో తనను తాను నిరూపించుకున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న బదోని.. ఆ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఐపీఎల్లో 56 మ్యాచ్‌లు ఆడిన బదోని 138.6 స్ట్రయిక్‌రేట్‌తో 6 అర్ద సెంచరీల సాయంతో 963 పరుగులు చేశాడు. అలాగే 4 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఫలితం తేలకపోయినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్‌పై నార్త్ జోన్ విజయం సాధించి, సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 405 పరుగులు చేసింది. బదోని (63), కన్హయ్య (76) అర్ద సెంచరీలతో రాణించారు.అనంతరం ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే ఆలౌటైంది. ఆకిబ్ నబీ హ్యాట్రిక్ సహా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. భారీగా లభించిన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్.. ఈసారి మరింత భారీ స్కోర్ సాధించింది. బదోని డబుల్ సెంచరీ సహా యశ్ ధుల్ (133), కెప్టెన్ అంకిత్ కుమార్ సెంచరీలతో కదంతొక్కారు. అంకిత్ కుమార్ (198) రెండు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. -
అంకిత్, యశ్ ధుల్ సెంచరీలు.. భారీ ఆధిక్యంలో నార్త్ జోన్
బ్యాటర్లు విజృంభించడంతో నార్త్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరువైంది. బెంగళూరు వేదికగా ఈస్ట్‌జోన్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. కెప్టెన్అంకిత్ కుమార్ (264 బంతుల్లో 168 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్), యశ్ ధుల్ (157 బంతుల్లో 133; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు.తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న నార్త్ జోన్... రెండో ఇన్నింగ్స్‌లోనూ దుమ్ము రేపింది. ఓపెనర్ శుభమ్ ఖజురియా (21) త్వరగానే అవుటైనా... అంకిత్, ధుల్ రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ 290 బంతుల్లోనే 240 పరుగులు జోడించడంతో... నార్త్ జోన్ కొండంత స్కోరు చేయగలిగింది. ఆయుశ్ బదోని (78 బంతుల్లో 56; 3 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయగా... తక్కినవాళ్లంతా భారీగా పరుగులు సమరి్పంచుకున్నారు. షమీ 11 ఓవర్లలో 36 పరుగులిచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు.సూరజ్ జైస్వాల్, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేయగా... ఈస్ట్ జోన్ 230 పరుగులు చేసింది. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 8 వికెట్లు ఉన్న నార్త్ జోన్ జట్టు ఓవరాల్‌గా 563 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంకిత్ కుమార్‌తో పాటు ఆయుశ్ బదోని క్రీజులో ఉన్నాడు.చదవండి: మొన్న డబుల్ సెంచరీ.. ఇప్పుడు ఫెయిల్!.. అయితేనేం సెమీస్ దిశగా జట్టు -
మొన్న డబుల్ సెంచరీ.. ఇప్పుడు ఫెయిల్!.. అయితేనేం..
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 678 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.డానిష్ మలేవర్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ 102 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి.. 532 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డానిష్ మలేవర్ (Danish Malewar) డబుల్ సెంచరీ (203- రిటైర్డ్ అవుట్)తో దుమ్ములేపగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసకర సెంచరీ (96 బంతుల్లో 125) సాధించాడు. మిగతా వారిలో యశ్ రాథోడ్ 108 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం.. తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నార్త్ ఈస్ట్ జోన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. 69.3 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కరణ్‌జిత్ యుమ్నామ్ (48) టాప్ రన్‌స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో అంకుర్ మాలిక్ 42 పరుగులతో రాణించాడు.సెంట్రల్ జోన్ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే మూడు, హర్ష్ దూబే, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ చహర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై 347 పరుగుల ఆధిక్యం సంపాదించిన సెంట్రల్ జోన్.. శనివారం రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించింది.నిరాశపరిచిన డానిష్.. రజత్ మరోసారి హిట్ఈసారి ఆయుశ్ పాండే (12)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన డబుల్ సెంచరీ వీరుడు డానిష్ మలేవర్ (15) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ శుభమ్ శర్మ సెంచరీ (122)తో చెలరేగి ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రజత్ పాటిదార్ మరోసారి అదరగొట్టాడు. 72 బంతులు ఎదుర్కొన్న ఈ కెప్టెన్ సాబ్ 66 పరుగులు చేశాడు.నార్త్ ఈస్ట్ జోన్ ముందు భారీ లక్ష్యంమిగతావారిలో యశ్ రాథోడ్ 78 పరుగులు సాధించగా.. దీపక్ చహర్ 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 80.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన సెంట్రల్ జోన్.. 331 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ ముందు 679 (347+331) పరుగుల మేర భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. నార్త్ ఈస్ట్ జోన్‌ను లక్ష్యం చేరకుండా ఆపి.. ఆలౌట్ చేసేందుకు సెంట్రల్ జోన్‌కు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీలైనంత త్వరగా పనిపూర్తి చేస్తే సెమీస్‌లోకి సెంట్రల్ జోన్ దూసుకుపోవచ్చు.చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
సరికొత్త చరిత్ర.. అరంగేట్రం మ్యాచ్‌లోనే 4 బంతుల్లో 4 వికెట్లు
దులీప్ ట్రోఫీ 2025లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఈ టోర్నీలో నార్త్ జోన్‌కు ఆడుతున్న జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఓ బౌలర్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఘనత సాధించే క్రమంలో ఆకిబ్ నబీ హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. తద్వారా కపిల్ దేవ్, సాయిరాజ్ బహుతులే తర్వాత దులీప్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.దులీప్ ట్రోఫీలో కపిల్ దేవ్ 1978/79 సీజన్లో నార్త్ జోన్‌కు ఆడుతూ వెస్ట్ జోన్‌పై హ్యాట్రిక్ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇదే తొలి హ్యాట్రిక్. ఆతర్వాత 2000/01 సీజన్లో సాయిరాజ్ బహుతులే వెస్ట్ జోన్‌కు ఆడుతూ ఈస్ట్ జోన్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా ఆకిబ్ నబీ కపిల్, బహుతులే సరసన చేరాడు. నబీకి దులీప్ ట్రోఫీలో ఇదే అరంగేట్రం మ్యాచ్ కావడం మరో విశేషం.28 ఏళ్ల ఆకిబ్ నబీ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ రెండో రోజు (ఆగస్ట్ 29) ఈ ఫీట్ నమోదైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నబీ 53వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా విరాట్ సింగ్ (బౌల్డ్), మనిశి (ఎల్బీడబ్ల్యూ), ముక్తర్ హుసేన్ (బౌల్డ్) వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆతర్వాత 55వ ఓవర్ తొలి బంతికి సూరజ్ జైస్వాల్ (వికెట్‌కీపర్ క్యాచ్) వికెట్ తీసి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆకిబ్ నబీ మెరుపులు ఇంతటితో ఆగిపోలేదు. ఆ మరుసటి ఓవర్ (57) తొలి బంతికి మొహమ్మద్ షమీ వికెట్ కూడా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.నబీ ధాటికి ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 7 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లను నబీనే తీశాడు. నబీతో పాటు హర్షిత్ రాణా (2/56), అర్షదీప్ సింగ్ (1/51), మయాంక్ డాగర్ (1/41), నిషాంత్ సింధు (1/19) కూడా తలో చేయి వేయడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే కుప్పకూలింది. వీరి ఇన్నింగ్స్‌లో విరాట్ సింగ్ (69) ఉత్కర్ష్ సింగ్ (38), కెప్టెన్ రియాన్ పరాగ్ (39), కుమార్ కుషాగ్రా (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆయుశ్ బదోని (63), కన్హయ్య (76) అర్ద సెంచరీలతో రాణించగా.. నిషాంత్ సింధు (47), ఆకిబ్ నబీ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మనిశి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టీమిండియా బౌలర్ షమీ (23-4-100-1)నిరాశపరిచాడు. మరో టీమిండియా బౌలర్ ముకేశ్ కుమార్ (14.5-1-50-0) గాయంతో తొలి రోజే వైదొలిగాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు
దులీప్ ట్రోఫీ-2025 తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ ఆటగాడు డానిష్ మలేవర్ (Danish Malewar) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.వన్డే తరహాలో తన బ్యాటింగ్‌ను కొనసాగించిన మలేవర్ కేవలం 222 బంతుల్లోనే తన ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని సాధించాడు. 21 ఏళ్ల మలేవర్ 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 203 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ జట్టు భారీ స్కోర్‌గా దూసుకుపోతుంది. 72 ఓవర్లు ముగిసే సరికి సెంట్రల్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. అంతకుముందు కెప్టెన్ రజిత్ పాటిదార్ సైతం సూపర్ సెంచరీతో మెరిశాడు. పాటిదార్ కేవలం 96 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు.తొలి విదర్భ ప్లేయర్‌గా..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకం సాధించిన మలేవర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ బ్యాటర్‌గా డానిష్ మాలేవర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ మలేవర్ అని తెగ వెతికేస్తున్నారు.ఎవరీ మాలేవర్..?21 ఏళ్ల మాలేవర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో ముంబై జరిగిన సెమీఫైనల్‌తో మాలేవర్ వెలుగు లోకి వచ్చాడు. ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేసిన మాలేవర్.. రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు నమోదు చేశాడు. విదర్భ జట్టు ఫైనల్‌కు చేరడంలో డానిష్ కీలక పాత్ర పోషించాడు.అనంతరం కేరళతో జరిగిన ఫైనల్లో మలేవర్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 153, రెండవ ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేసిన డానిష్.. విదర్భకు మరో రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. తన తొలి ఫస్ట్‌క్లాస్ సీజన్లోనే మలేవర్ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 783 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు ఆర్ధ శతకాలు ఉన్నాయి. మాలేవర్ తన అద్భుత ప్రదర్శనలతో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మలేవర్కు రైట్ ఆర్మ్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది.చదవండి: హనుమా విహరి ఎంట్రీ..! ఆ జట్టుకు వీడ్కోలు పలికిన కెప్టెన్? -
దూసుకువస్తున్న బ్యాటింగ్ ‘బుల్లెట్’.. దేశీ క్రికెట్లో నయా సెన్సేషన్!
భారత దేశీ క్రికెట్ నూతన సీజన్‌కు గురువారం తెరలేచింది. డొమెస్టిక్ సీజన్ 2025-26లో భాగంగా దులిప్ ట్రోఫీ (Duleep Trophy) టోర్నమెంట్ బెంగళూరు వేదికగా మొదలైంది. ఈ రెడ్‌బాల్ టోర్నీ తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడుతుండగా.. రెండో క్వార్టర్స్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్‌తో పోటీపడుతోంది.సెంట్రల్ జోన్ భారీ స్కోరుఅయితే, వర్షం కారణంగా కాస్త ముందుగానే తొలిరోజు ఆట ముగిసింది. తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ 75.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇక రెండో క్వార్టర్ ఫైనల్లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సెంట్రల్ జోన్ భారీ స్కోరు సాధించింది.డానిష్ మలేవర్ అద్భుత ఇన్నింగ్స్ఓపెనర్లలో ఆయుశ్ పాండే (Ayush Panday- 3) విఫలమైనా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ అర్ధ శతకంతో మెరిశాడు. వంద బంతులు ఎదుర్కొన్న అతడు 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జట్టును నిలబెట్టే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ డానిష్ మలేవర్ (Danish Malewar) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.35 ఫోర్లు, ఒక సిక్సర్.. 198 పరుగులుతొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 219 బంతులు ఎదుర్కొన్న ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఏకంగా 35 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 198 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా విధ్వంసకర శతకం (96 బంతుల్లో 125)తో దుమ్ములేపాడు.ఇక యశ్ రాథోడ్ 32 పరుగులతో.. మాలేవర్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గురువారం నాటి ఆట ముగిసే సరికి 77 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి సెంట్రల్ జోన్ 432 పరుగులు చేసింది. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజమ్ జాటిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దూసుకువచ్చిన నయా బుల్లెట్.. డానిష్ మలేవర్దేశీ క్రికెట్లో ఛతేశ్వర్ పుజారా పరుగుల వరద పారించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ రికార్డు స్థాయిలో 66 శతకాల సాయంతో 21,301 పరుగులు సాధించాడు. ఇటీవలే పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు.అయితే, ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ.. అందరికీ టీమిండియా తలుపులు తట్టే అవకాశం రాకపోవచ్చు. కానీ విదర్భకు చెందిన డానిష్ మలేవర్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు.భారీ సెంచరీతన తొలి ఫస్ట్‌క్లాస్ సీజన్లోనే మలేవర్ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 783 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు ఫిఫ్టీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్‌రేటు 51. తాజాగా మరో భారీ సెంచరీని మలేవర్ సాధించాడు. దానిని డబుల్ సెంచరీగా మార్చడం ఖాయంగానే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ‘నయా వాల్’ పుజారాకు వారసుడయ్యే లక్షణాలు మలేవర్లో దండిగా ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడే ఇలా అనడం తొందరపాటు చర్యే అయినా.. నిలకడగా అతడు ముందుకు సాగితే అదే నిజమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. నాగ్‌పూర్‌లో జన్మించిన 21 ఏళ్ల డానిష్ మలేవర్.. కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా!చదవండి: పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్ -
యువతరానికి పరీక్ష.. దులీప్ ట్రోఫీకి సర్వం సిద్దం
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా గురువారం నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశి్వన్, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ప్లేయర్లు టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇది చక్కటి వేదిక కానుంది.ఈ ఏడాది దులీప్ ట్రోఫీని పాత పద్ధతిలోనే జోన్ల వారిగా నిర్వహించనున్నారు. సౌత్ జోన్, వెస్ట్ జోన్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించగా... రేపటి నుంచి ప్రారంభం కానున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్‌తో ఈస్ట్ జోన్... సెంట్రల్ జోన్‌తో నార్త్ ఈస్ట్ జోన్ తలపడనున్నాయి. వచ్చే నెల 15 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌ను బెంగళూరు వేదికగా నిర్వహించనున్నారు. ఇటీవల భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకోగా... తదుపరి సొంతగడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రజత్ పాటీదార్, తనుశ్ కొటియాన్, మొహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, నిశాంత్ తదితరులు ఉన్నారు. వచ్చే నెలలో జరగనున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటి సుదీర్ఘ ఫార్మాట్లో అయినా టీమిండియా బెర్త్ సాధించాలని చూస్తున్నాడు. సౌత్ జోన్ సారథిగా తిలక్... మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్లో సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు సెమీఫైనల్స్ జరగనున్నాయి. ఇక 11న ఫైనల్ ప్రారంభం కానుంది. ఆయా జోన్ల సెలెక్టర్లు ఇప్పటికే జట్లను ప్రకటించారు. హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... సౌత్ జోన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.ఇప్పటికే భారత టి20 జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న తిలక్... ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టి పెడుతున్నాడు. మెరుగైన టెక్నిక్ ఉన్న ఆటగాడిగా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న ఈ హైదరాబాదీ... దులీప్ ట్రోఫీలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇక అపార నైపుణ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు సాధించిన శ్రేయస్ అయ్యర్... జాతీయ జట్టులో చోటు కోసం మాత్రం తీవ్రంగా కష్టపడుతున్నాడు. స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తాతో పాటు... అవసరమైతే వేగంగా ఆడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ప్రతిభగల అయ్యర్ దులీప్ ట్రోఫీలో రాణించాలని భావిస్తున్నాడు.అతడు చివరిసారిగా 2024లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పలువురు ప్లేయర్లను ఆరో స్థానంలో పరిశీలించినా... వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణిస్తే... శ్రేయస్‌కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. షమీ సత్తా చాటేనా! టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ... తిరిగి టెస్టు జట్టులో పునరాగమనం చేసేందుకు ప్రయతి్నస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదనే కారణంగా అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు.దీంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడగా... మొహమ్మద్ సిరాజ్‌కు మరో ఎండ్ నుంచి నిలకడైన తోడు లభించలేదు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో షమీ సత్తాచాటితే అతడు తిరిగి టెస్టు జట్టులోకి రావచ్చు. దీంతో అతడికి ఈ టోర్నీ కీలకం కానుంది. ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ మునుపటి వాడి ప్రదర్శిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పకపొచ్చు. ఇక ఈస్ట్ జోన్ తరఫున ముకేశ్ కుమార్, సెంట్రల్ జోన్ తరఫున ఖలీల్ అహ్మద్ కూడా తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు. వీరితో పాటు మరికొంతమంది యువ ఆటగాళ్లు సైతం దులీప్ ట్రోఫీలో తమదైన ముద్రవేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ టోర్నీ నుంచి శుబ్‌మన్ గిల్ ఔట్.. కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ-2025కు గిల్ దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించిన అనంతరం గిల్‌ను నార్త్ జోన్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నహాకాల్లో భాగంగా ఈ పంజాబ్ బ్యాటర్ దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. ఆసియాకప్-2025కు గిల్ ఎంపికైనప్పటికి దులీప్ ట్రోఫీలో ఒక మ్యాచ్ ఆడనున్నాడని వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ ఒక్క మ్యాచ్‌కు కూడా గిల్ దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ ప్రస్తుతం కాస్త అనారోగ్యంతో బాధపడతున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఫిజియోలు, వైద్య బృందం శుబ్‌మన్ బ్లడ్ టెస్టు రిపోర్ట్స్‌ను బోర్డుకు సమర్పించి, అతడిని దులీప్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించాలని సూచించినట్లు దైనిక్ జాగరన్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. నార్త్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన అంకిత్ కుమార్ గిల్ స్ధానంలో జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే గిల్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకొన్నప్పటికి.. ఆసియాకప్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.కాగా దులీప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో నార్త్‌జోన్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా ఈస్ట్‌జోన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 28 నుంచి 31 వరకు జరగనుంది. ఇక గిల్ ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనపరంగా అందరిని ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్(261) ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా గిల్(430) నిలిచాడు.దులిప్ ట్రోఫీ-2025కి నార్త్‌జోన్ జట్టు ఇదేశుభమ్ ఖజురియా, అంకిత్ కుమార్ ( కెప్టెన్), ఆయుష్ బదోని, యశ్ ధుల్, అంకిత్ కల్సి, నిశాంత్ సింధు, సాహిల్ లోత్రా, మయాంక్ దాగర్, యుధ్వీర్ సింగ్ చరక్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, కన్హయ్య వాధావాన్.చదవండి: ఆసియాకప్-2025కు హాంకాంగ్ జట్టు ప్రకటన.. -
సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్
దులీప్ ట్రోఫీ 2025 తొలి రౌండ్ మ్యాచ్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మెరకు ఆయా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనెజర్ అబే కురువిల్లా లేఖ రాశారు.ముఖ్యంగా సౌత్ జోన్ జట్టులో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్,మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో బీసీసీఐ స్పందించాల్సి వచ్చింది. వీరందరూ ప్రస్తుతం భారత టెస్టు జట్టులో భాగంగా ఉన్నారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత వీరిందరికి నెలకు పైగా విశ్రాంతి లభించింది.అంతేకాకుండా ఆసియాకప్ జట్టులో వీరివ్వరూ భాగం కాకపోవడంతో దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. కానీ సౌత్ జోన్ జట్టులో వారిలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. దీంతో అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ వరకు వారికి విశ్రాంతి లభించనుంది. కాగా దులీప్ ట్రోఫీకి జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కాకుండా, జోన్ సెలెక్టర్లు ఎంపిక చేస్తారు."దులీప్ ట్రోఫీ ప్రతిష్టను కాపాడుకునేందుకు, సరైన పోటీ అందించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లను వారి సంబంధిత జోనల్ జట్లకు కచ్చితంగా ఎంపిక చేయాలి. కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు లేదా టీమిండియాలో ఎంపిక కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్లందరూ బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలి.ఒకవేళ ఎవరైనా ఆటగాడు అందుబాటులో ఉన్నప్పటికి సరైన కారణం లేకుండా దేశీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే సదరు ప్లేయర్‌ను జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోరు" అని లేఖలో కురువిల్లా పేర్కొన్నారు.కాగా గతేడాదే సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్లో ఆడాలి అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు గత రంజీ సీజన్లో ఆడారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: భారత్, పాక్ పోరుకు రాజముద్ర -
కెప్టెన్ ఇషాన్ కిషన్ అవుట్.. కారణం ఇదే!
దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఈస్ట్ జోన్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఈ రెడ్‌బాల్ టోర్నీకి దూరమయ్యాడు. ఒడిశాకు చెందిన ఆశిర్వాద్ స్వైన్ ఇషాన్ స్థానంలో ఈస్ట్ జోన్‌కు ఎంపికయ్యాడు. కాగా జాతీయ జట్టుకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. ఇటీవల ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు.టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చినా..నాటింగ్‌హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడి.. ఆఖరి మ్యాచ్‌కు దూరం కాగా.. ఈ వికెట్ కీపర్‌తో పంత్ స్థానాన్ని భర్తీ చేయాలని సెలక్టర్లు భావించారు.అయితే, ఇషాన్ కిషన్ స్కూటీ మీద నుంచి కిందపడిన కారణంగా.. అతడి ఎడమ పాదానికి గాయమైనట్లు తెలిసింది. దీంతో బోర్డు నుంచి పిలుపు వచ్చినా అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో దులిప్ ట్రోఫీ (Duleep Trophy 2025)లో ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌కు మరోసారి తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది.కారణం ఇదేనా?కానీ.. ఫిట్నెస్ కారణాల వల్ల ఇషాన్ కిషన్ ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తాజా సమాచారం. అతడి స్థానంలో బెంగాల్ మేటి ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. ఒడిశా యువ ఆటగాడు ఆశిర్వాద్.. వికెట్ కీపర్‌గా ఇషాన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.ఒడిశా నుంచి మూడో ప్లేయర్ఇక ఒడిశా నుంచి ఇప్పటికే ఈస్ట్ జోన్ జట్టులో సందీప్ పట్నాయక్ ఉండగా.. స్వస్తిక్ సమాల్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ టోర్నీకి దూరం కావడానికి స్పష్టమైన కారణాలు మాత్రం తెలియలేదు. అయితే, ఒడిషా క్రికెట్ అసోసియేషన్ ప్రకటన ద్వారానే.. ఇషాన్ స్థానంలో ఆశిర్వాద్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడైంది.కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు రెండు టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ టెస్టుల్లో 78, వన్డేల్లో 933, టీ20 మ్యాచ్‌లలో 796 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి బెంగళూరు వేదికగా దులిప్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. కాగా ఇషాన్ కంటే ముందు ఆకాశ్ దీప్ కూడా ఈస్ట్ జోన్ జట్టుకు దూరమయ్యాడు.దులిప్ ట్రోఫీ-2025 టోర్నీకి ఈస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)అభిమన్యు ఈశ్వరన్, ఆశీర్వాద్ స్వైన్ (వికెట్ కీపర్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీదామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ.స్టాండ్ బై ప్లేయర్లుముఖ్తార్ హుస్సేన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్.చదవండి: ‘ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్‌లకు నో ఛాన్స్’ -
ఇషాన్ కిషన్ సేనకు భారీ షాక్.. టీమిండియా స్టార్ ఆటగాడు దూరం
దులీప్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు ఇషాన్ కిషన్ నేతృత్వం వహిస్తున్న ఈస్ట్ జోన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కీలక పేసర్ ఆకాశ్‌దీప్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. కారణం ఏమో తెలీదు కాని, ఆకాశ్‌దీప్ స్థానంలో అస్సాం మీడియం పేసర్ ముక్తర్ హుసేన్ జట్టులోకి వచ్చాడు. ఎన్సీఏ ఆకాశ్‌దీప్‌ను విశ్రాంతి తీసుకోవాలని సిఫార్చు చేసినట్లు పీటీఐ చెబుతుంది.ఆకాశ్‌దీప్ కొద్ది రోజుల కిందట ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టులో ఉన్నాడు. అతను టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్‌లతో కలిసి బంతిని పంచుకోవాల్సి ఉండింది. అయితే అతను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించబడ్డాడు.ఆకాశ్‌దీప్ తాజాగా ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. టీమిండియా గెలిచిన బర్మింగ్హమ్ టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శన సహా ఓవల్ టెస్ట్‌లో నైట్ వాచ్‌మన్‌గా కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. జట్టులో విధ్వంసకర ఆటగాడు రియాన్ పరాగ్ చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ముక్తార్ హుసేన్, మొహమ్మద్ షమీస్టాండ్బై ప్లేయర్లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్ -
కెప్టెన్‌గా ఆయుశ్ మాత్రే.. జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్
భారత యువ క్రికెటర్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) మరో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ముంబై జట్టుకు అతడు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీకి సంబంధించి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై మంగళవారం ప్రకటించింది.జట్టులో సర్ఫరాజ్ ఖాన్ఈ జట్టులో టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ (Musheer Khan)వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఆయుశ్ మాత్రే డిప్యూటీగా సువేద్ పార్కర్ ఎంపికయ్యాడు.ఐపీఎల్లో అదరగొట్టి.. భారత జట్టు కెప్టెన్‌గా సత్తా చాటికాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ నిర్వహిస్తున్నారు. దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సీజన్ ఈ టోర్నీతోనే ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ముంబైకి చెందిన 18 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రే 15 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 240 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. ఆయుశ్ మాత్రే అత్యుత్తమ స్కోరు 94 కావడం విశేషం. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో కలిసి ఆయుశ్ మాత్రే కూడా ఐపీఎల్-2025లో హైలైట్‌గా నిలిచాడు.రెండు సెంచరీలు బాదిన ఆయుశ్ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని భారత యువ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 3-2తో గెలిచింది. ఇక ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు బాది.. బ్యాటర్‌గానూ సత్తా చాటాడు ఆయుశ్ మాత్రే. ఈ క్రమంలో తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ఆయుశ్ మాత్రే మరోసారి సారథిగా ఎంపికయ్యాడు.తాజాగా ముంబై జట్టుకు కూడా ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధం కావడం విశేషం. కాగా ఆగష్టు 18 నుంచి బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కు ముంబై జట్టు ఇదేఆయుశ్ మాత్రే (కెప్టెన్), ముషీర్ ఖాన్, దివ్యాంష్ సక్సేనా, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్ (వైస్ కెప్టెన్), ప్రజ్ఞేష్ కాన్పిల్లెవార్, హర్ష్ అఘవ్, సాయిరాజ్ పాటిల్, ఆకాష్ పార్కర్, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గురవ్, యష్ డిచొల్కర్, హిమాన్షు సింగ్, రాయ్స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్.వెస్ట్ జోన్ జట్టులోనూ సర్ఫరాజ్ ఖాన్ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడనున్న సర్ఫరాజ్ ఖాన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ భాగం కానున్నాడు. శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ వంటి టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్ జోన్‌కు సర్ఫరాజ్ ఖాన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.దులిప్ ట్రోఫీ-2025లో వెస్ట్ జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జయమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనూశ్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నగ్వాస్వాలా.చదవండి: AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో.. -
సాయి సుదర్శన్‌కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి?
టీమిండియా స్టార్ సాయి సుదర్శన్‌కు మరో దేశవాళీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దులిప్ ట్రోఫీ (Duleep Trophy)-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడే జట్టులోనూ స్థానం దక్కలేదు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తాజాగా ఈ దేశీ టోర్నమెంట్‌కు టీఎన్‌సీఏ ఎలెవన్, టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పేరిట రెండు జట్లు ప్రకటించింది. అయితే, ఇందులో ఏ జట్టులోనూ సాయి సుదర్శన్ (Sai Sudharsan) పేరు లేదు.అంతకు ముందు సౌత్‌జోన్ జట్టులోనూ సాయి సుదర్శన్‌కు చోటు దక్కలేదు. దులిప్ ట్రోఫీ ఆడే ఈ జట్టులో సాయితో పాటు.. టీమిండియా స్టార్లు వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ పేర్లు కూడా కనిపించలేదు.ఐపీఎల్లో అదరగొట్టాడుకాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 54కు పైగా సగటుతో 759 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్-2025లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీతో పాటు ఆరు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్లను ఆకట్టుకున్న సాయి సుదర్శన్.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన సాయి ఆరంభంలోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఈ వన్‌డౌన్ బ్యాటర్‌పై వేటు వేసిన యాజమాన్యం తిరిగి నాలుగు, ఐదో టెస్టుల్లో ఆడించింది. ఈ సిరీస్‌లో సాయి సాధించిన పరుగులు వరుసగా.. 0, 30, 61, 0, 38, 11.ప్లాన్ అదేనా?ఇంగ్లండ్ పర్యటనలో ఈ మేర ఒక్క హాఫ్ సెంచరీ మినహా 23 ఏళ్ల సాయి సుదర్శన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీలకు అతడు దూరం కావడం గమనార్హం. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో సాయి సుదర్శన్‌కు సెలక్టర్లు ఆడే అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అతడికి కొన్నాళ్లు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా అర్ష్‌దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ తదితరులు దులిప్ ట్రోఫీ-2025 ఆడేందుకు సిద్ధమయ్యారు.బుచ్చిబాబు టోర్నమెంట్‌కు టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు:ఆర్.సాయి కిషోర్ (కెప్టెన్.), సి. ఆండ్రీ సిద్దార్థ్ సి (వైస్ కెప్టెన్.), బి. ఇంద్రజిత్, విజయ్ శంకర్, ఎం. షారుక్ ఖాన్, ఆర్. విమల్ కుమార్, ఎస్. రాధాకృష్ణన్, ఎస్. లోకేశ్వర్, జి. అజితేష్, జె. హేంచుదేశన్, ఎం. సిద్ధార్థ్, ఆర్.ఎస్. అంబరీష్, సి.వి. అచ్యుత్, హెచ్. త్రిలోక్ నాగ్, పి. శరవణ కుమార్, కె. అభినవ్.బుచ్చిబాబు టోర్నమెంట్ టీఎన్‌సీఏ ఎలెవన్ప్రదోష్ రంజన్ పాల్ (కెప్టెన్), బూపతి వైష్ణ కుమార్ (వైస్ కెప్టెన్), బి. సచిన్, తుషార్ రహేజా, కిరణ్ కార్తికేయన్, ఎస్. మహమ్మద్ అలీ, ఎస్. రితిక్ ఈశ్వరన్, ఎస్.ఆర్. అతీష్, ఎస్. లక్షయ్ జైన్, డీటీ చంద్రశేఖర్, పి. విద్యుత్, ఆర్. సోను యాదవ్, డి. దీపేష్, జె. ప్రేమ్ కుమార్, ఎ. ఎసక్కిముత్తు, టీడీ లోకేష్ రాజ్.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్ ఆఫ్రిది -
టీమిండియా స్టార్ ప్లేయర్‌కు గాయం.. కీలక టోర్నీకి దూరం?
దులీప్ ట్రోఫీ-2025కు ముందు సెంట్రల్ జోన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వెటరన్, విధర్బ స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ గాయం కారణంగా ఈ ఏడాది దులీప్ ట్రోఫీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో నాయర్ చేతి వేలికి స్వల్ప గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉండాలని కరుణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ సిరీస్‌లో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ నాయర్ దులీప్ ట్రోఫీలో ఆడి మెరుగ్గా రాణించింటే భారత టెస్టు జట్టులో తన స్ధానం పదిలంగా ఉండేది. కానీ ఇప్పుడు గాయం బారిన పడడంతో జట్టులో అతడి స్ధానానికి గ్యారంటీ లేదు. స్వదేశంలో వెస్టిండీస్,దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లకు నాయర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టే అవకాశముంది."ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఓ బంతి కరుణ్ నాయర్ చేతివేలికి తాకింది. వెంటనే చిన్నగా వాపు కూడా వచ్చింది. దీంతో రాబోయే దులీప్ ట్రోఫీలో నాయర్ సెంట్రల్ జోన్ తరపున అతడు ఆడడు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత టెస్టు జట్టులో కరుణ్ నాయర్ స్దానాన్ని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో భర్తీ చేసే అవకాశముంది. కాగా దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్‌లు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 15 వరకు జరగనున్నాయి.దులీప్ ట్రోఫీ-2025 షెడ్యూల్👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్‌జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.సౌత్ జోన్ జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్‌బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్ -
దులీప్ ట్రోఫీకి విజయ్ ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: టెక్కలికి చెందిన క్రికెటర్ త్రిపురాన విజయ్ మరో మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో మెరవనున్నాడు. ఈ పోటీలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. జిల్లా నుంచి దులీప్ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి జిల్లా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌత్‌జోన్ జట్టుకు ఆంధ్రా నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపిక కాగా.. అందులో విశాఖకు చెందిన రిక్కీబుయ్ ఒకరు కాగా.. మరొకరు త్రిపురాన విజయ్ కావడం గమనార్హం.2023–24 సీజన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో 26 వికెట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రంజీ మ్యాచ్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దులీప్ ట్రోఫీకి ఎంపికై నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్ తాజాగా ఏపీఎల్ నాల్గో సీజన్లో రికార్డు స్థాయిలో రూ. 7.55 లక్షలు దక్కించుకున్నాడు. రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, మిడిలార్డర్ బ్యాటింగ్‌తోపాటు బెస్ట్ ఫీల్డర్‌గా రాణిస్తున్నాడు. విజయ్ తల్లిదండ్రులు వెంకటకృష్ణరాజు, లావణ్య టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటారు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. విజయ్ ప్రస్తుతం టెక్కలిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.చాలా సంతోషంగా ఉందిదులీప్ ట్రోఫీకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నిలకడగా రాణించి జట్టు విజయాల్లో భాగస్వామ్యం అవుతాను. త్వరలో జరగనున్న ఏపీఎల్‌లో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, కోచ్‌లు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు.– త్రిపురాన విజయ్, క్రికెటర్ -
కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) సీజన్లో పాల్గొనే వెస్ట్‌జోన్ (West Zone) జట్టు ఖరారైంది. టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఈ దేశవాళీ టోర్నీలో వెస్ట్‌జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడి సారథ్యంలోని ఈ టీమ్‌లో టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా భాగం కానున్నారు.దూబే, రహానే, పుజారాలకు మొండిచేయివీరితో పాటు దేశీ స్టార్లు తుషార్ దేశ్‌పాండే, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్ కూడా వెస్ట్‌జోన్‌కు ఆడనున్నారు. మరోవైపు.. శివం దూబే అందుబాటులో ఉన్నా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. అదే విధంగా.. టీమిండియా వెటరన్ బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలకు కూడా దులిప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు.రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో శార్దూల్ ఠాకూర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్ లోయర్ ఆర్డర్లో భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియాలో శార్దూల్ సభ్యుడిగా ఉన్నాడు.ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శార్దూల్ పెద్దగా రాణించడం లేదు. మరోవైపు.. వెస్ట్‌జోన్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వస్తాడనుకుంటే.. ఆసియా టీ20 కప్-2025తో అతడు బిజీ కానున్న నేపథ్యంలో పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ జోన్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. కాగా ఆగష్టు 28- సెప్టెంబరు 15 వరకు దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు.దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్‌జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.సౌత్ జోన్ జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్‌బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్దులిప్ ట్రోఫీ-2025 షెడ్యూల్👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.చదవండి: IND vs ENG: నా కుమారుడు చేసిన తప్పేంటి?: సెలక్టర్లపై క్రికెటర్ తండ్రి ఫైర్