అమ్మాయిలు ఫేస్ 'బుక్కై' పోయారు
అసొంలో తమ తోటి అమ్మాయిల ఫోటోలు, చిరునామాలు ఫేస్ బుక్ లో పెట్టి, వారికి చెత్త ఫోన్ కాల్స్ వచ్చేలా చేసిన ఇద్దరమ్మాయిలు తమ బండారం బయటపడటంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
డూలియాజాన్ అన్న పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు చేసిన నిర్వాకానికి ఆ ఊళ్లోని చాలా మంది అమ్మాయిలకు అసభ్యకరమైన ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో ఆ అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఈ పనిని చేసింది ఈ ఇద్దరు అమ్మాయిలేనని తేలింది. వారిద్దరూ ఒక నకిలీ ఫేస్ బుక్ సాయంతో ఈ పనిని చేశారు. అందరూ వారిని బాగా మందలించారు. అయితే మరీ చిన్న పిల్లలు కాబట్టి కేసులు మాత్రం పెట్టలేదు.
అయితే ఆ అమ్మాయిలిద్దరూ అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకమ్మాయి బ్లేడుతో గాట్లు పెట్టుకుంది. మరో అమ్మాయి ఫినాయిల్ తాగింది. ఇప్పుడు ఆ ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు.
అందరినీ ఫేస్ బుక్ లో అల్లరిపాలు చేయాలనుకున్న ఆ ఇద్దరూ అలా ఫేస్ 'బుక్కై' పోయారు