బ్రిటన్ ఎంపీ పర్యటన
బిటన్ ఎంపీ డానియల్ బైల్స్
కుటుంబ సమేతంగా చారిత్రక ఆలయూల సందర్శన
నర్సంపేటలోని ద్వారకపేటకు చెందిన ప్రశాంతిరెడ్డిని వివాహం చేసుకున్న బ్రిటన్ ఎంపీ డానియల్ బైల్స్ తన పిల్లలు సాషా, లారాతో కలిసి బుధవారం వరంగల్‌లో పర్యటించారు. వేరుుస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్‌లోని కాకతీయుల కోట సొబగులను తిలకించారు.
హన్మకొండ కల్చరల్/ ఖిలావరంగల్/ నిట్ క్యాంపస్ : కాకతీయుల కళాసంపద అద్భుతమని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు డానియల్ బైల్స్ అన్నారు. నర్సంపేట ద్వారకపేటకు చెం దిన కటంగూరి ప్రశాంతిరెడ్డిని వివాహం చేసుకున్న ఆయన, తన పిల్లలు సాషా, లారాతో కలిసి బుధవారం వరంగల్ నగరాన్ని సందర్శించారు. హన్మకొండలోని వేరుుస్తంభాలు, వరంగల్‌లోని భద్రకాళి ఆలయంతో పాటు ఖిలావరంగల్‌లోని కాకతీయుల కోట సొబగులను తిలకించారు. కాకతీయుల శిల్పకళా సౌందర్యాన్ని చూసి వారు ముగ్ధులయ్యూరు.
వేరుుస్తంభాలు, భద్రకాళి ఆలయంలో...
చారిత్రక వేరుుస్తంభాల ఆలయంలో డానియల్ బైల్స్ కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేందర్రావు ఎంపీ దంపతులను పూలమాలతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు, శేష వ స్త్రాలను బహూకరించారు. అనంతరం డానియల్ బైల్స్ దంపతులు ఆలయంలోని వెంట్రుక బట్టే సన్నని రంధ్రాలతో చేసిన శిలలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్‌లోని ఖిలా వరంగల్ కోటను సందర్శించి కోటలోని కాకతీయుల నాటి కట్టడాలను పరిశీలించారు.కోటలో స్వచ్చ భారత్‌లో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, వేదపండితులు ఆలయమర్యాదలతో స్వాగతించారు. డానియల్ దంపతులకు ఈఓ అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. బైల్స్ స మీప బంధువులు వసుంధర, కటంగూరి శ్రీనివాసరెడ్డి, కటంగూరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
ఖిలావరంగల్ కోటలో...
కాకతీయుల కోటను సందర్శించిన క్రమంలో శిల్పాల ప్రాంగణంలో నగరపాలక సంస్థ మాజీ మెయర్ నగర తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డానియల్ బైలా మాట్లాడారు. భారత దేశం ఒక గొప్ప పర్యాటక కేంద్రమని, ఇందులో కాకతీయుల కళాసంపద అద్భుతమన్నారు. కాకతీయుల అద్భుతమైన చారిత్రక కట్టడాలు, శిధిలమైన వారసత్వసంపద అభివృద్ధికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి నిధులు కేటారుుంచేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ‘కోట’లో డాక్టర్ తిరుపతిరెడ్డి,డాక్టర్ వసుంధర ప్రోత్సాహంతో రుద్రమదేవి విగ్రహన్ని ఏర్పాటు చేస్తాన చెప్పారు. అనంతరం బ్రిటన్ ఎంపి డానియల్ సతీమణి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు తన పుట్టినిళ్లు అని, తనకు ఓరుగల్లు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. బ్రిటన్ లో వైద్యశాల ఏర్పాటు చేసి, పేదలకు ఉచితంగా సేవలందిస్తున్నాని తెలిపారు. తన భర్త డానియల్ బెల్స్ ఎంపీ కన్నా... గొప్ప సాహసవీరుడని వివరించారు. బ్రిటన్ ప్రభుత్వం నిర్వహించిన సాహస క్రీడల్లో నిర్ధిష్ట సమయంలో సముద్రాన్ని ఈది రెండు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్‌లో చోటు సంపాదించారని పేర్కొన్నారు. బ్రిటన్ ఆర్మీకి ఆతి చిన్న వయసులోనే అటార్ని జనరల్ పదవికి ఎంపికయ్యారని చెప్పారు. డానియల్ పదవికీ రాజీనామ చేసి, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారని వెల్లడించారు. బ్రిటన్ ఎంపీ వెంట ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, మాజీ డిప్యూటీ మేయర్ కక్కెసారయ్య, బీజేపీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, డాక్టర్ పోలన టరాజు, బిల్ల శ్రీకాంత్ తదితరులు ఎంపీకి పుష్పగుచ్ఛం అందించారు. రావులకిషన్, పాలపాక మార్టిన్లూతర్, రఘనాధ్‌రెడ్డి, శేషు, బిల్లశ్రీకాంత్, ఆచ్చవినోద్కుమార్, పుప్పాల రాజేందర్ తదితరులు ఉన్నారు