e-health
-
ప్రతి ముగ్గురిలో ఒకరికి కొలెస్ట్రాల్..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వంద మందిలో 33 మంది అనారోగ్యంతో ఉన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగా త్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఆరోగ్య సర్వేలు ఇంటింటా సాగుతూ ముగింపు దశ (96%)కు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మార్చి 5న మంత్రి కె.తారక రామారావు, ములు గులో మంత్రి టి.హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటా సర్వేలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 203 ఆరోగ్య కార్యకర్తల బృందాలు ఇంటింటా సర్వేలు చేస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటికి 4,05,988 మందికి టెస్టులు పూర్తయ్యా యి. బ్లడ్‌గ్రూప్, రక్తహీనత, కిడ్నీ, షుగర్, కాల్షియం, కొలెస్ట్రాల్, కాలేయం, ఇతర పరీక్షలను సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈ సమాచారంతో ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరుతో అనుసంధానం చేసి పేరు, పుట్టిన తేదీ, యూనిక్ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ వంటి వివరాలు కార్డులో పొందుపరుస్తు న్నారు. యూనిక్ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. చాలు సదరు వ్యక్తి సమగ్ర సమాచారం కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడమే ఈ–హెల్త్ ప్రొఫైల్ లక్ష్యం. ఆధునిక పరిజ్ఞానంతో పరీక్షలు టీ–డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనాలను విశ్లేషిస్తున్నారు. రోజుకు సగటున ఆరు వేల రక్త నమూనాలను పరీక్షిస్తూ.. ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఒకరోజు గరిష్టంగా 14,690 రక్తపరీక్షలు చేయగా.. ఇప్పుడు సగటున 400 నుంచి 600 శాంపిళ్లు పరీక్షిస్తు న్నారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ సమస్య బయట పడగా, ఆ తర్వాత స్థానంలో కాల్షియం సమస్య ఉంది. థైరాయిడ్ సమ స్యతో 17,001 మంది, కాలేయ సమస్యతో 15,839 మంది, మూత్రపిం డాల సమస్యతో 14,267 మంది, మధుమేహంతో 10,186 మంది ఉన్నట్టు గుర్తించారు. -
‘ఈ-వైద్యం’ పేరిట దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో సరికొత్త దోపిడీకి తెరలేచింది. పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ సొమ్మును అప్పనంగా అప్పగించేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కుటుంబ సంక్షేమ శాఖలోని ఓ అధికారి భర్తతో పాటు టీడీపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఈ-వైద్యం’ సేవలు అందించడానికి 45 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. తొలుత విజయవాడ, విశాఖపట్నంలోని ఆరోగ్య కేంద్రాలను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఆరు నెలల్లో మిగతా 43 కేంద్రాలను కూడా ప్రైవేట్‌కు అప్పజెప్పనున్నారు. టెండర్ లేకుండానే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఇకపై ఈ-వైద్య కేంద్రాలుగా మారుతాయి. ఎలాంటి టెండర్, ఆన్లైన్ ఎంపిక ప్రక్రియ లేకుండానే ఓ ప్రైవేట్ సంస్థ దరఖాస్తు చేసుకోగానే ఇచ్చేశారు. ఇప్పటివరకు పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.90 వేలు ఇచ్చేవారు. తాజాగా ఈ-వైద్య కేంద్రాల పేరుతో నిర్వహణ వ్యయాన్ని రూ.3 లక్షలకు పెంచారు. అంటే ఒక ఆస్పత్రి నిర్వహణకు గాను ప్రైవేట్ సంస్థకు నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తారు. రాష్ట్రంలో 192 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఒక్కో కేంద్రానికి నిత్యం 100 నుంచి 200 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. భవిష్యత్‌లో వీటిని కూడా ప్రైవేట్‌కు అప్పజెప్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులు అందజేస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఈ-వైద్య కేంద్రాలుగా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం వ్యతిరేకించినట్లు సమాచారం. పెలైట్ ప్రాతిపదికన ఇచ్చాం ‘‘ప్రస్తుతం పెలైట్ ప్రాతిపదికన విజయవాడ, విశాఖపట్నంలోని ఆరోగ్య కేంద్రాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. ఈ రెండు కేంద్రాల నిర్వహణ, సంస్థ పనితీరు పరిశీలన అనంతరం మిగతా 43 కేంద్రాల నిర్వహణ ఎవరికి, ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తాం’’ - అరుణకుమారి, సంయుక్త సంచాలకులు, కుటుంబ సంక్షేమ శాఖ ‘ఈ-వైద్యం’ అంటే? వైద్యులు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో ‘ఈ-వైద్యం’లో భాగంగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ విధానంలో పట్టణాల్లో ఉండే వైద్యులు గ్రామాల్లోని రోగులకు ఆన్లైన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తారు. నిబంధనల ప్రకారం.. ఈ-వైద్యం సేవలను వైద్యులు లేనిచోట్ల మాత్రమే అందించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటూ, రవాణా సదుపాయాలు, మందులు ఉండే పట్టణ ఆస్పత్రుల్లో ‘ఈ-వైద్యం’ విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించడం గమనార్హం. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ-వైద్యం విధానంలో ఎక్కడి డాక్టర్లు సలహాలు ఇస్తారనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.