earthquake deaths
-
చైనాలో భూకంపం
బీజింగ్/జిషిషాన్: వాయవ్య చైనాను భూకంపం కుదిపేసింది. సోమవారం అర్ధరాత్రి గన్సు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ భూకంపం ధాటికి చాలా ఇళ్లు నేలమట్టమై 127 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రం క్విన్‌ఘాయీలోనూ ఈ ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 700 మందికి పైగా గాయాలపాలయ్యారు. శిథిలాల వద్ద యుద్దప్రాతిపదికన గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం గ్రామీణ ప్రాంతాల్లో సంభవించడంతో మట్టి ఇళ్లు ఎక్కువగా కూలాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో జనం ఇళ్లు వదిలి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వార్త తెలిసి అధ్యక్షుడు జిన్‌పింగ్ యుద్ధప్రాతిపదికన వేలాదిగా సహాయక బృందాలు తరలివెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ‘‘భూకంపం ధాటికి విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చలికాలం, అందునా మైనస్ 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత సహాయక చర్యలకు అవరోధంగా మారింది’’ అని బ్లూ స్కై రెస్క్యూ టీమ్ చీఫ్ కమాండర్ వాంగ్ యీ చెప్పారు. గన్సు, క్విన్‌ఘాయీ ప్రావిన్సుల్లో సంభవించిన ఈ భూకంపం కేంద్రస్థానం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చైనాయంత్రాంగం ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం వచ్చిన క్విన్‌ఘాయీ ప్రావిన్స్.. తరచూ భూకంపాలొచ్చే టిబెట్ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. -
Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
అంకారా/న్యూఢిల్లీ: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఏకంగా 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయింది. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొందరు సజీవంగా బయటపడడం ఊరట కలిగిస్తోంది. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. కొన్నిచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తుర్కియేలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు. ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని తుర్కియే అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. 75,000 మంది నిరాశ్రయులు భూకంపం వల్ల తుర్కియేలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని తుర్కియే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో 75,000 మందికిపైగా జనం నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపింది. సిరియాలో భూకంపం కారణంగా 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 22,000 మందికి పైగా బలైనట్లు తెలుస్తోంది. తుర్కియేలో 12,000 దాకా భవనాలు నేలమట్టం కావడమో లేక దెబ్బతినడమో జరిగిందని మంత్రి మురాత్ కరూమ్ చెప్పారు. తుర్కియే ప్రజలకు అండగా ఉంటాం: మోదీ ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తుర్కియే ప్రజలకు భారత్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. -
Earthquakes: రెస్క్యూ ఆపరేషన్‌లో చిన్నారులు సేఫ్!
గజియాన్టెప్(తుర్కియే): భూకంప శిథిలాలను తొలగించేకొద్దీ వెలుగుచూస్తున్న విగతజీవులు.. ప్రాణాధార వ్యవస్థలు అందుబాటులోలేక రక్తమోడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్న క్షతగాత్రులు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు కాలంతో పోటీపడుతూ నిర్విరామంగా శ్రమిస్తున్న సహాయక సిబ్బంది, స్థానికులు.. ఎటుచూసినా ఆప్తుల ఆక్రందనలు, మిన్నంటిన రోదనా దృశ్యాలతో తుర్కియే, సిరియా భూకంప ప్రభావ ప్రాంతాలు భయానకంగా తయారయ్యాయి. దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతటి ఘోర మృత్యుకంపం ధాటికి ఇరుదేశాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య తాజాగా 11,200 దాటేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎర్డోగన్ పర్యటన సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హతే ప్రావిన్స్, కహ్రామన్మరాస్ పట్ణణం, భూకంప కేంద్రం గుర్తించిన పజార్సిక్ పట్టణాల్లో పర్యటించారు. క్షతగాత్రులతో నిండిన తాత్కాలిక ‘టెంటుల సిటీ’లో బాధితులతో మాట్లాడారు. ‘ఎవరినీ ఇలా వీధుల్లో వదిలేసి వెళ్లిపోము. అందరినీ ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. భూకంపం మిగిల్చిన విషాదం మొదలై రెండ్రోజులైన తర్వాత కహ్రామన్మరాస్ పట్టణంలో శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడు ఆరిఫ్ ఖాన్‌ను సురక్షితంగా బయటకు తీయగలిగారు. అదియామన్ సిటీలో పదేళ్ల బాలిక బీటల్ ఎడీస్‌ను కాపాడారు. A baby and his mother were rescued from the rubble after spending 55 hours in Turkey's Gaziantep. #TurkeyQuake#Turkiye #Turkiye#Turkey #TurkeySyriaEarthquake #TurkeyQuake #earthquakes #Syria #زلزال #زلزال_سوريا_تركيا #TurkeySyriaEarthquake pic.twitter.com/Kt5NFteETZ — Ali Cheema🔥🥀 (@ali_cheema10) February 8, 2023 కుప్పకూలిన వేలాది భవంతుల కింద చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న అన్వేషణకు గడ్డకట్టే చలి, మంచు పెద్ద అవరోధంగా మారాయి. తుర్కియేలోని మలాట్యా సిటీలో వీధి పొడవునా మృతదేహాలు ఉంచి మార్చురీ వాహనాల కోసం జనం ఎదురుచూస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. మైనస్ ఆరు డిగ్రీ సెల్సియస్ వాతావరణంలో శిథిలాల్లో కొందరు చలికే గడ్డకట్టుకుని చనిపోయి ఉంటారని సహాయక సిబ్బందిలో ఒకరైన పికల్ వ్యాఖ్యానించారు. టర్కీ అత్యవసర సిబ్బందికి దాదాపు డజను దేశాల నుంచి ఆగమేఘాల మీద వచ్చేసిన సహాయక బృందాలు జతకలిసి బాధితుల అన్వేషణలో బిజీగా మారాయి. This video broke my heart 💔 The little girl says to the rescuer when he reaches her: Get me out from under this wreckage,sir,me and my sister, and I will become your slave.#earthquakeinturkey #Syria #هزه_ارضيه #زلزال #İstanbul #earthquake #Turkey #PrayForTurkey pic.twitter.com/U9mMrZdROM — Zuher Almosa (@AlmosaZuher) February 7, 2023 సిరియాలో పరిస్థితి దారుణం తుర్కియేతో సత్సంబంధాల కారణంగా చాలా దేశాలు తమ బృందాలను ఆ దేశానినికి పంపి సాయపడుతున్నాయి. కానీ, అంతర్యుద్దం, ద్వైపాక్షిక సంబంధాలు బొత్తిగాలేని సిరియాకు ఇతర దేశాల నుంచి సాయం సరిగా అందట్లేదు. దీంతో అక్కడ సహాయక చర్యలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీంతో శిథిలాల్లో బాధితుల ఆక్రందనలు అరణ్యరోదనలయ్యాయి. సిరియాను ఆదుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. భూకంపంతో ఆ దేశాల్లో 2.3 కోట్ల ప్రజల బ్రతుకులు దుర్భరంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. A young Syrian boy smiled and started to play with rescue workers who pulled him from the rubble of a building that was destroyed following deadly earthquakes in Turkey and Syria pic.twitter.com/kM3Qt4UqvG — Reuters (@Reuters) February 8, 2023 భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన భారత్ మరో బృందాన్నీ తుర్కియేకి పంపనుంది. ‘తుర్కియేలో 11 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిలో ఒకరి జాడ తెలియాల్సిఉంది. మిగతావారు క్షేమం’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. మరోవైపు ఆరు టన్నుల సహాయక సామగ్రిని సిరియాకు భారత్ అందజేసింది. My heart goes out to the people of Turkey and Syria and all affected by the devastating Turkey-Syria earthquake. The death toll continues to grow in Turkey and northern Syria where two powerful earthquakes destroyed buildings and left some villages in total rubble. 🙏💔 pic.twitter.com/Gv8ZGnvBHw — Maha Mehanna (@MahaMehanna) February 7, 2023 -
అఫ్గాన్‌లో భారీ భూకంపం
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తీవ్ర భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడ్డ ఈ ఉత్పాతంలో ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు అప్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఖోస్ట్ నగరానికి 46 కి.మీ. దూరంలో, రాజధాని కాబూల్‌కు దక్షిణంగా 150 కి.మీ.దూరాన ఉన్న కొండ ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీసీ) వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, భారత్‌ల్లోనూ భూ ప్రకం పనలు సంభవించాయని యూరోపియన్ సిస్మలాజికల్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలాహుద్దీన్ అయూబీ చెప్పారు. మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్లి సహాయం అందించడానికి మరింత సమయం పడుతుందన్నారు. సవాలుగా సహాయ కార్యక్రమాలు అఫ్గానిస్తాన్‌లో 10 నెలల కింద ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వ పనితీరుకి ఈ భూకంపం సవాలుగా మారింది. అధికార యంత్రాంగం హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించింది. కొండ ప్రాంతాల్లో బాధితుల సహాయానికి హెలికాఫ్టర్లు పంపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. హెలికాప్టర్ల కొరత, కొండ ప్రాంతాలకు వెళ్లడం దుర్లభం కావడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. అంతర్జాతీయ సాయం కోరిన తాలిబన్లు అఫ్గాన్ ప్రజలు తీవ్రమైన విషాదంలో ఉన్నారని ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయపడాలని తాలిబన్ సుప్రీం నాయకుడు హైబతుల్లా అఖూన్‌జాదా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మహమ్మద్ హసన్ అఖుండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. 1998లో అఫ్గాన్‌ను కుదిపేసిన భారీ భూకంపంలో 4,500 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత అతి పెద్ద భూకంపం ఇదేనని భక్తర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నాసిరకం నిర్మాణాలతో భారీగా ప్రాణనష్టం మారుమూల కొండల్లో ఉన్న గ్రామాల్లో నాసి రకం నిర్మాణాలు కావడం, , కొండ చరియ లు విరిగిపడే ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో భూకంప ధాటికి అపారమైన నష్టం జరిగింది. రాళ్లు, మట్టితో నిర్మిం చిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న వారి బతుకులు శిథిలాల కింద పడి తెల్లారిపోయాయి. ఫక్తూన్ క్వా ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించినట్టు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ భక్తర్ వెల్లడించింది. అక్కడ మీడియాలో వస్తున్న భూకంప విధ్వంస దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. రాళ్ల మధ్య నలిగిపోయిన మృతదేహాలు, ప్రాణాలతో ఉన్న వారు శిథిలాల నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు హృదయవిదారకంగా మారాయి. JUST IN 🚨 Afghanistan state-run news agency reports more than 150 people killed in #earthquake in country's eastern province. pic.twitter.com/QIQFGtQanf — Insider Paper (@TheInsiderPaper) June 22, 2022 -
విషాదం మిగిల్చిన భూకంపం
-
విషాదం మిగిల్చిన భూకంపం
♦ ఇటలీ భూకంప మృతులు 247 ♦ ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు అక్యుమోలి: ఎటు చూసినా శిథిలాలు.. కుప్పకూలిన భవనాలు, వంతెనలు.. శవాల కుప్పలు.. ఆర్తనాదాలు.. తీవ్ర భూకంపంతో చిగురుటాకులా వణికిన ఇటలీలో తాజా పరిస్థితి ఇది. బుధవారం ఇటలీని 6.2 తీవ్రతతో భూకంపం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంప మృతుల సంఖ్య 247కి చేరింది. వందలాది మంది తీవ్రంగా గాయపడగా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది, వలంటీర్లు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో అనేక గ్రామాలు భూకంప తాకిడికి ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ గ్రామాల్లో బతికున్న వారిని రక్షించేందుకు అత్యవసర బృందాలు రాత్రి సమయాల్లోనూ గాలింపు జరుపుతున్నాయి. ఇటలీ ప్రధానమంత్రి మాటో రెంజి భూకంప ప్రభావానికి గురైన అమట్రికా గ్రామంలో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూకంప మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు వందలాది మంది తీవ్రమైన చలిలో టెంట్లలోనే రాత్రంతా గడిపారు. భూప్రకంపనల భయంతో చాలా మంది ఇళ్లకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఏమైపోయారో తెలియక చాలా మంది కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని సురక్షితంగా బయట పడేయాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. 2009లో భూకంపం తాకిడికి గురైన లాక్విలా నగరానికి సమీపంలోనే తాజాగా భూప్రకంపనలు సంభవించాయి. -
భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం
భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.6 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు జాతీయ విపత్తు నివారణ సంస్థ నిబంధనలు కొన్నింటిని సవరించినట్లు పీఎంవో అధికారులు వెల్లడించారు. ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయినవారి కుటుంబాలకు ఇప్పటివరకు చెల్లిస్తున్న నష్టపరిహారం మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచుతూ నిబంధనలు సవరించారు. ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధి నుంచి మరో రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 6 లక్షల పరిహారాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నట్లు పీఎంవో తెలిపింది. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ లో భారత్ కు చెందిన పలు సంస్థలు చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని సమీక్షించారన, ఆహారం, నీరు, పాల పొడి వంటి అత్యవసరాలను బాధితుల వద్దకు వేగంగా చేరవేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, క్యాబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.