భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం | Rs 6 lakh compensation for kin of those killed in quake | Sakshi
Sakshi News home page

భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం

Published Sun, Apr 26 2015 7:45 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం - Sakshi

భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం

భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.6 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఆదివారం  సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు జాతీయ విపత్తు నివారణ సంస్థ నిబంధనలు కొన్నింటిని సవరించినట్లు పీఎంవో అధికారులు వెల్లడించారు.

 

ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయినవారి కుటుంబాలకు ఇప్పటివరకు చెల్లిస్తున్న నష్టపరిహారం మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచుతూ నిబంధనలు సవరించారు. ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధి నుంచి మరో రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 6 లక్షల పరిహారాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నట్లు పీఎంవో తెలిపింది. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ లో భారత్ కు చెందిన పలు సంస్థలు చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని సమీక్షించారన, ఆహారం, నీరు, పాల పొడి వంటి అత్యవసరాలను బాధితుల వద్దకు వేగంగా చేరవేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, క్యాబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement