east godavari tour
-
డిసెంబర్లో సీఎం రాక
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిసెంబర్లో కాకినాడ రానున్నారని హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో 50 రోజులపాటు ఇంటింటా తెలుగుదేశం నిర్వహించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ‘కైజాలాయాప్’పై పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చారు. ఈయాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకుని సమస్యలు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, పెందుర్తి వెంకటేష్, పులవర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, కాకినాడ, రాజమహేంద్రవరం నగర మేయర్లు సుంకర పావని, పంతం రజనీశేషసాయి తదితరులు పాల్గొన్నారు. -
మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం
-
మూడు నెలల్లోనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తాం
తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్దామని, ఒక్క రెండేళ్లు ఓపిక పట్టాలని వారికి తెలిపారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయడం లేదంటూ కాంట్రాక్టు లెక్చరర్లు వైఎస్ జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయనను వాళ్లు బూరుగుపూడి గ్రామం వద్ద కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ జగన్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత గుమ్మలూరు గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. -
తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కోనసీమ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం లో ఇటీవల గోవధకు పాల్పడ్డారన్న అపోహతో కొందరు వ్యక్తులు చేసిన దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. జగన్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పరామర్శిస్తారు. తిరిగి సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.