తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన | ys jagan mohan reddy to tour in east godavari | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన

Published Fri, Aug 12 2016 8:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన - Sakshi

తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కోనసీమ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం లో ఇటీవల గోవధకు పాల్పడ్డారన్న అపోహతో కొందరు వ్యక్తులు చేసిన దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్‌ మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు.

జగన్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో మధురపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పరామర్శిస్తారు. తిరిగి సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement