amalapuram incident
-
అమలాపురం ఘటనలో కేసుల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: అమలాపురం ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విభేదాలను రూపుమాపి సామాజిక వర్గాల మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఈమేరకు అమలాపురం ఘటనలో నమోదైన కేసులను ఉపసంహరించాలని నిర్ణయించారు. సామాజికవర్గాల మధ్య సామరస్యాన్ని సాధించి ఐకమత్యాన్ని పెంపొందించేలా సీఎం జగన్ తీసుకున్న చొరవ పట్ల కోనసీమ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంత నేతలు, సామాజికవర్గాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. అన్నదమ్ముల్లా అంతా కలసిమెలసి జీవిస్తూ ఒక్కటవుదామని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. రేపటి తరాలు కూడా.. తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలసిమెలసి జీవిస్తున్నారు. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు. రేపటి తరాలు కూడా అక్కడే జీవించాలి. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు వాటిని మరిచిపోయి మీరంతా మునుపటిలా కలిసి మెలిసి జీవించాలి. లేదంటే భవిష్యత్తు దెబ్బతింటుంది. దీన్ని లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది మనమే. అందుకే అందరం కలిసి ఉండాలి. ఆప్యాయతతో ఉండాలి. చిన్న చిన్న గొడవలు, మనçÜ్పర్ధలు, అపోహలున్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం. తప్పులు భూతద్దంలో చూసుకోకుండా కలిసిపోదాం. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. మిమ్మల్ని ఏకం చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం. పారదర్శకంగా స్వచ్ఛమైన వ్యవస్థ పార్టీలను చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందచేస్తున్నాం. వలంటీర్లకు తోడుగా గృహ సారథులు ఉంటారు. వ్యవస్ధలో పారదర్శకత ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రూపాయి కూడా లంచం లేకుండా రూ.2 లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు నేరుగా (డీబీటీ) అందించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. టీడీపీ హయాంలో ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలకు తావులేని మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం. ఇలాంటి వ్యవస్థ ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది. భావోద్వేగాలతో ఊహించని ఘటన : పినిపే విశ్వరూప్, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అమలాపురంలో జరిగిన ఘటన దురదృష్టకరం. భావోద్వేగాలతో మేం ఊహించని ఘటన జరిగింది. దీన్ని మేం వ్యక్తిగతంగా తీసుకోలేదు. కోనసీమలో మళ్లీ గొడవలు రాకుండా మీరు (సీఎం జగన్) తీసుకున్న చొరవకు ధన్యవాదాలు. మేం మనçస్ఫూర్తిగా కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నాం. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు. అందరం సమన్వయంతో ముందుకెళతాం. పూర్తిగా సహకరిస్తాం: కాపు నాయకులు నాడు జరిగిన ఘటనలు దురదృష్టకరం. అవి ఏమాత్రం మంచిది కాదు. సామరస్య వాతావరణం కోసం పూర్తిగా సహకరిస్తాం. దీనికోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం హర్షణీయం. యువకుల భవిష్యత్తు, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐకమత్యంగా ఉంటాం: శెట్టిబలిజ నాయకులు శెట్టి బలిజ సామాజిక వర్గానికి గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పదవులు ఇచ్చి సీఎం జగన్ గౌరవించారు. పెద్ద మనసుతో కేసులు ఉపసంహరించి మరింత సాయం చేశారు. మీకు రుణపడి ఉంటాం. సమాజ శ్రేయస్సు కోసం మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గాలు ఐకమత్యంగా ఉంటాయి. -
అమలాపురం ఘటన.. కేసుల ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, తాడేపల్లి: అమలాపురం ఘటనలతో ఏర్పడిన సామాజిక విభేదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ► తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు ► అక్కడే పుట్టి.. అక్కడే పెరిగి… జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు ► రేపు అయినా.. అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి ► అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది ► దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది ► దీనివల్ల నష్టపోయేది మనమే… అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో మెలగాలి ► చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం, ►తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం ► అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, మిమల్ని ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం ► అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్ బేసిస్ మీద పథకాలు అన్నీ ఇస్తున్నాం ► వలంటీర్లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారు.. వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం ► అర్హత ఉన్న వారికి ఏ పథకమైనా అందని పరిస్థితి ఉండకూడదనేది మన విధానం ► కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్నీ ఇస్తున్నాం. ► పార్టీలు చూడకుండా జరగాల్సిన మంచి చేస్తున్నాం. ► రూ. 2 లక్షల కోట్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. రూపాయి లంచం లేకుండా ఈ స్ధాయిలో ఎప్పుడూ జరగలేదు ► టీడీపీ హాయంలో నా పాదయాత్రలో లోన్ ల గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు లోన్ ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్ధితి. అవికూడా అక్కడక్కడా అరకొర అందేవి ► ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలు లేని ఇంత మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం ► మంచి చేసే విషయంలో ఏం చూడకుండా చేస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది ► ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్ అయితే వారిని చేయి పట్టుకుని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటుచేశాం ► ఇది మంచి పరిణామం, దేవుడి దయ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం ► మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. -
త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, కాకినాడ జిల్లా: త్వరలోనే అమలాపురం అల్లర్ల కేసుకు ముగింపు పలుకుతామని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కొద్దిరోజుల కిందట మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. సీఎం జగన్‌ను కలిశారు. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని, దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎంకు వివరించారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరారు’’ అని మిథున్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’ -
జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది
సాక్షి, అమరావతి: అమలాపురంలో విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలపై రాజకీయాలకు అతీతంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 143 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జనసేన, టీడీపీలకు చెందినవారు అత్యధికంగా ఉండటం గమనార్హం. జనసేనకు చెందిన వారు 62 మంది, టీడీపీకి చెందిన వారు 21 మంది ఉండగా... బీజేపీ, వైఎస్సార్సీపీలకు చెందిన వారు చెరో ఐదుమంది ఉన్నారు. మిగిలిన 50 మంది ఏ పార్టీకి చెందని వారుగా పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రమేయం ఉందని భావించిన వైఎస్సార్సీపీకి చెందినవారిని కూడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా అమలాపురం అల్లర్ల కేసులో ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమలాపురం అల్లర్లలో మరో ఇద్దరి అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ముమ్మిడివరం గొల్లవీధికి చెందిన మట్ట లోవరాజు, అమలాపురం కల్వకొలను వీధికి చెందన గోకరకొండ సూరిబాబులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కలిపి అమలాపురం విధ్వంసకర ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 137 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ కేసుల్లో మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఫేస్బుక్లో అసత్య ప్రచారంపై కేసు నమోదు అమలాపురంలో జరిగిన అల్లర్లపై ఫేస్బుక్లో అసత్య ప్రచారం చేసిన పశ్చిమ గోదావరి జి ల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన చేగొండి నానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. నానిని బుధవారం అరెస్ట్ చేసి కో ర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఫేస్బు క్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఒక వర్గాన్నిగానీ, వ్యక్తులనుగానీ రెచ్చగొట్టేలా పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. ఎక్కడైనా జరిగిన ఘటనలకు అసత్యాలు జోడించి పోస్టింగ్ పెట్టినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. -
‘కోనసీమ’ కేసుల్లో మరో 20 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురం విధ్వంసం ఘటనల కేసుల్లో మరో 20 మందిని అరెస్టు చేసినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి శనివారం తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. వీరితో కలిపి ఇప్పటి వరకూ ఈ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 111కి చేరిందన్నారు. అమలాపురం అల్లర్లకు సంబంధించి 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, ఇప్పటి వరకూ ఆరు ఎఫ్ఐఆర్లలో నిందితులను అరెస్టు చేశామని, మరిన్ని అరెస్టులుంటాయని తెలిపారు. నిందితుల ఒప్పుకోలు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ ఫుటేజీలు, గూగుల్ ట్రాక్, టవర్ లొకేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ అరెస్టులు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మరో వారం పాటు 144 సెక్షన్ కోనసీమ జిల్లాలో విధించిన 144 సెక్షన్, పోలీస్ సెక్షన్–30 అమలును మరో వారం పాటు కొనసాగిస్తున్నామని ఎస్పీ సుబ్బారెడ్డి చెప్పారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం 15 మండలాల్లో విధించిన ఇంటర్నెట్ నిలిపివేతను మండలాల వారీగా ఉపసంహరించేలా ఉత్తర్వులిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 15 మండలాలకు గాను 11 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అమలాపురం రూరల్, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో మాత్రమే ఇంటర్నెట్ సేవల నిలిపివేతను కొనసాగిస్తున్నామని, ఈ నెల 7న ఈ నాలుగు మండలాల్లోనూ నిలిపివేతను ఉపసంహరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. -
అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 20 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 91కి చేరుకున్నాయి. నిందితుల ఒప్పుకోలు, సహ నిందితుల వాంగ్మూలం, వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. చదవండి: (నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని) -
‘అమలాపురం అల్లర్లు’.. మరో 9 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 9 మంది నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 71కి చేరుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. అందులో నాలుగు ఎఫ్ఐఆర్లకు సంబంధించి మొత్తం 71 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. తాజాగా అరెస్టు చేసిన 9 మందిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని పేర్కొన్నారు. నిందితులను పూర్తి ఆధారాలతో గుర్తించే అరెస్ట్ చేస్తున్నామన్నారు. అమలాపురంలో 144 సెక్షన్, సెక్షన్ 30 ఇంకా అమలులోనే ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియా గ్రూపులపై పూర్తి నిఘా.. సున్నితమైన విషయాలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, ఒక వర్గాన్ని, ఒక నేతను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు పెట్టేవారిపైనే కాకుండా ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా అలాంటి అభ్యంతరకర పోస్టులు పెడితే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. అలా కాకుండా పోస్టులు పెట్టిన వారి ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం, కొట్టడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, చదువులు పూర్తయినవారే ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఈ కేసుల్లో ఉన్న నిందితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు వస్తే పోలీసు వెరిఫికేషన్‌లో అనర్హులవుతారని చెప్పారు. అలాగే విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పార్ట్‌లు కూడా మంజూరు కావని స్పష్టం చేశారు. 3 మండలాలకు ఇంటర్నెట్ పునరుద్ధరణ సోషల్ మీడియాలో పుకార్ల నియంత్రణకు నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కోనసీమలో 16 మండలాలకు గాను 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన మండలాల్లో బుధవారం కూడా ఇంటర్నెట్ ఉండదన్నారు. -
కీలక దశకు దర్యాప్తు
సాక్షి, అమరావతి: అమలాపురం అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. విధ్వంసానికి సంబంధించిన కుట్ర రచన, అమలు చేసిన విధానంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సమాజంలో వర్గవైషమ్యాలను రెచ్చగొట్టేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడుల్లో పాల్గొన్న అందర్నీ గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయింది. సుమారు 300 మందిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిలో ఇప్పటికే 62 మందిని అరెస్టు చేశారు. మరో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. వారిలో పదిమందిని అరెస్టుచేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి ఆచూకీని కూడా పోలీసు బృందాలు గుర్తిస్తున్నాయి. దీంతో వచ్చే వారంలో మరింతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారిలో పలువురిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 52 మందిపై రౌడీషీట్లు ఎత్తేసిన విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిలో కొందరు ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసంలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. అప్పట్లో ఏకపక్షంగా అంతమందిపై ఒకేసారి రౌడీషీట్లు ఎత్తివేయడం శాంతిభద్రతల కోణంలో సరైన చర్యకాదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అమలాపురం అల్లర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి అరెస్టుల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత ఈ దాడుల వెనుక కుట్రదారులపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు సూత్రధారులను గుర్తించిన పోలీసులు వారు ఎవరి ప్రోత్సాహంతో, ఏ ప్రయోజనాల కోసం ఈ కుట్ర పన్నారన్న అంశాలను కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే వారి కాల్‌డేటాలు, వాట్సాప్ సందేశాలు మొదలైనవి విశ్లేషిస్తున్నారు. పటిష్ట బందోబస్తు కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అమలాపురంతోసహా జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సున్నితమైనవిగా గుర్తించిన గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గ్రామాల్లోకి అనుమానితుల కదలికలు, రాకపోకలపై పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లో అన్నివర్గాల పెద్దలతో మాట్లాడుతూ సామరస్య పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా కట్టడి చేస్తున్నారు. వినతిపత్రాల సమర్పణ కోసం కలెక్టరేట్‌లకుగానీ, తహశీల్దార్ కార్యాలయాలకుగానీ అనుమతించడం లేదు. ఎలాంటి వినతిపత్రాలనైనా సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సమర్పించమని అధికార యంత్రాంగం ఇప్పటికే సూచించింది. ఇంటరెŠన్ట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తున్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
పోలీసులు భోజనం చేస్తున్నారు.. టౌన్లోకి వచ్చేయండి
సాక్షి, అమరావతి: ‘పోలీసు వారు భోజనాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం అమలాపురం టౌన్లోకి రాడానికి..’ ఇది అమలాపురంలో అల్లరి మూకలు విధ్వంసకాడకు పాల్పడిన ఈ నెల 24న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయిన సందేశం. ‘కరెక్టుగా 3.10 నిమిషాలకే స్టార్ట్ యుద్ధం..’ ఆ వాట్సాప్ గ్రూపుల్లో మరో పోస్టు ఇది. అంతేకాదు.. ఏబీఎన్ చానల్లో ఆ ర్యాలీ, విధ్వంసానికి సంబంధించి లైవ్ వీడియో క్లిప్పింగులను కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ అల్లరి మూకలను నడిపించారు. అమలాపురం విధ్వంసం వెనుక ఎంతటి పకడ్బందీ కుట్ర ఉందన్నది ఈ వాట్సాప్ సందేశాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల కనుసన్నల్లో అల్లర్లకు ఎంత పక్కాగా పన్నాగం పన్నారన్నది తేటతెల్లమవుతోంది. దీంతో విధ్వంసం వెనుక ఆ రెండు పార్టీల కుట్ర మరింతగా బట్టబయలవుతోంది. ఆ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించిన కుట్ర కథలో పాత్రధారులైన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వివరాలు ఆధారాలతోసహా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విధ్వంసానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగులను పరిశీలించి దాదాపు 1,500 మందిని పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, వీడియో రికార్డింగులతోపాటు పోలీసు టెక్నాలజీ విభాగం నిందితులు, అనుమానితుల వాట్సాప్ సందేశాలు, కాల్‌డేటాలను పరిశీలిస్తుండగా విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్ర వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఎంత పకడ్బందీగా కుట్రపన్నాయన్నది తెలుస్తోంది. వాట్సాప్ సందేశాలతో కుట్ర అమలాపురంలో దాడులకు ప్రేరేపించిన దాదాపు 15 వాట్సాప్ గ్రూపులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 24న చలో కలెక్టరేట్ ర్యాలీ సందర్భంగా విధ్వంసం సృష్టించేందుకు ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలక నేతలు ఎప్పటికప్పుడు కుట్ర రచించారన్నది స్పష్టమైంది. రిమోట్ కంట్రోల్ నేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందేశాల ప్రకారం ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తూ అల్ల్లర్లకు పన్నాగం పన్నారు. 3.10 గంటలకు విధ్వంసానికి పాల్పడాలని ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా అల్లరి మూకలను ముందుగానే సిద్ధం చేశారు. అంతేకాదు.. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 450 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ బయట నుంచి రప్పించిన అల్లరి మూకలు అమలాపురంలో రహస్య ప్రదేశాల్లో మాటువేశాయి. ర్యాలీలో ఉన్న కుట్ర సూత్రధారులు మొత్తం పరిణామాలను పరిశీలిస్తూ ఆ అల్లరి మూకలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు. పోలీసులు మధ్యాహ్నం భోజనాలు చేస్తుండటాన్ని గుర్తించిన సూత్రధారులు వెంటనే అల్లరి మూకలకు సమాచారం అందించారు. ఆ సమయంలో అమలాపురంలోకి ప్రవేశించాలని చెప్పారు. అమలాపురంలో పరిస్థితిని బయట మాటేసి ఉన్న అల్లరి మూకలకు వివరించేందుకు ఏబీఎన్ టీవీ చానల్లో లైవ్ న్యూస్‌ను ఆధారంగా చేసుకున్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో వివిధచోట్ల పరిస్థితి, ఇతర అంశాలను ఆ చానల్ లైవ్ న్యూస్‌లో ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది. కుట్ర సూత్రధారులు ఆ చానల్ ప్రసారం చేస్తున్న లైవ్ న్యూస్ వీడియో క్లిప్పింగులను కూడా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తూ వాటిపై.. పోలీసులు భోజనాలు చేస్తున్నారు వెంటనే టౌన్లోకి వచ్చేయండి అని సందేశాలు పెట్టడం గమనార్హం. ఆ పథకం ప్రకారమే అల్లరి మూకలు ఒక్కసారిగా చేతిలో పెట్రోల్ బాంబు సీసాలు, రాళ్లతో అమలాపురంలోకి చొరబడి విధ్వంసానికి తెగించాయి. బస్సులను దహనం చేసిన అనంతరం ముందస్తు కుట్రలో భాగంగానే మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయం, కొత్తగా నిర్మిస్తున్న నివాసంతోపాటు ఎమ్మెల్యే సతీష్ నివాసంపై దాడికి పాల్పడ్డాయి. ఈ కుట్రకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు గుర్తించడం ఈ కేసులో కీలక పరిణామం. ఇదిగో టీడీపీ, జనసేన నేతలు టీడీపీ, జనసేన పార్టీలకు చెందినవారు దగ్గరుండి అమలాపురంలో విధ్వంసాన్ని కొనసాగించారడానికి మరికొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆ రెండు పార్టీల నేతలు విధ్వంసంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఫొటోలను పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన పితాని దుర్గాప్రసాద్, సంగడి ఆనందబాబు, జనసేన పార్టీకి చెందిన రాచకొండ శివకుమార్, గండ్రోతి చంద్రమౌళి, బండారు భాస్కరరాజేష్, భీమ్లా దుర్గాసాయి, అశెట్టి సాయిచంద్ర, పళ్ల ప్రభుదేవ్, యర్రంశెట్టి బాలాజీ, సుందరనీది సాధుబాలాజీ ఆ విధ్వంసకాండలో పాల్గొన్న ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు చిక్కాయి. రాళ్లు పట్టుకుని, రాళ్లు రువ్వుతూ.. క్రియాశీలకంగా వ్యవహరించినట్టు ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో అమలాపురంలో అల్లర్లకు టీడీపీ, జనసేన పార్టీలు ఎంత పకడ్బందీగా కుట్ర పన్నాయన్నది స్పష్టమైంది. అమలాపురం విధ్వంసంలో మరో 18 మంది అరెస్టు అమలాపురం టౌన్: కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 24న అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 18 మంది నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పాల్రాజు ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. వీరితో కలిపి ఈ కేసుల్లో ఇప్పటివరకు 62 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అమలాపురంలో జరిగిన వరుస అల్లర్లకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఏడు, అరెస్టు చేసేందుకు ఏడు.. మొత్తం 14 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం అరెస్టు చేసిన నిందితుల్ని ముమ్మిడివరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని, వారిని సోమవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తామని తెలిపారు. అల్లర్లలో పాల్గొన్న వారిని సైంటిఫిక్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా ఆధారంగా గుర్తిస్తున్నట్లు వివరించారు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత సోమవారమూ కొనసాగవచ్చన్నారు. -
అమలాపురం ఘటన కేసులో టీడీపీ,జనసేన నేతల అరెస్ట్
-
కోనసీమ దుర్ఘటనలో జనసేన,టీడీపీ కుట్రలు బట్టబయలు
-
తూర్పుగోదావరిలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కోనసీమ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం సూదాపాలెం లో ఇటీవల గోవధకు పాల్పడ్డారన్న అపోహతో కొందరు వ్యక్తులు చేసిన దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. జగన్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పరామర్శిస్తారు. తిరిగి సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.