East Harlem
-
అమెరికాలో పేలుడు, ఇద్దరి మృతి
రెండు భవనాలు కుప్పకూలి ఇద్దరి మృతి న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం సమీపంలోని ఈస్ట్ హార్లెమ్లో బుధవారం ఉదయం శక్తిమంతమైన పేలుడు సంభవించి రెండు భవనాలు కుప్పకూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించడంతోపాటు 20 మంది గాయపడ్డారు. మరికొంత మంది ఆచూకీ తెలియడం లేదు. ఉదయం 9 గంటల సమయంలో తొలుత గ్యాస్ లీక్ అయినట్లు వాసన వచ్చిందని, తర్వాత భారీ శబ్దంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు, పొగ అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు, అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే బాంబ్ స్క్వాడ్లతో సహా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదని, ఇది ఉగ్రవాద దాడి కాకపోవచ్చని అధికారవర్గాలు పేర్కొన్నాయి. -
న్యూయార్క్ పేలుళ్లలో ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో బుధవారం ఉదయం మన్ హట్టన్ లోని ఈస్ట్ హార్లెమ్ లో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మందికి గాయలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద ఉన్న బాధితులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని హార్లెమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. విద్యుత్ నిలిపివేసేందుకు, గ్యాస్ లైన్లను మూసి వేసేందుకు సంబంధిత సిబ్బంది పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. చాలా మంది తీవ్ర ఆందోళనకు గురికాగా, మరికొందరు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఈ ఘటనకు కారణమేమి తెలియరాలేదు. అయితే గ్యాస్ లీక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
న్యూయార్క్ లో పేలుళ్లు
-
న్యూయార్క్ లో భారీ పేలుళ్లు, ధ్వంసమైన భవనం
అమెరికాలోని న్యూయార్క్ లోని ఈస్ట్ హార్లెమ్ లో బుధవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ వెనువెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ పేలుళ్ల వెనువెంటనే ఈస్ట్ హార్టెమ్ లో రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన భారతీయ సమయం ప్రకారం సాయంత్రం 7.22 కి జరిగింది. సంఘటనా స్థలాన్ని 114, పార్క్ ఎవెన్యూగా పేర్కొంటారు. సంఘటన స్థలంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పదకొండు మందికి గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. కనీసం గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలించడం చూశామని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుళ్లకు కారణం ఏమిటన్నది ఇంతవరకూ తెలియరాలేదు. కనీసం 150 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటన తరువాత మొత్తం ప్రాంతంలో హై అలెర్ట్ ను ప్రకటించారు. అన్ని రైళ్లు, వాహనాలను నిలిపివేశారు. సెప్టెంబర్ 11 తరువాత న్యూయార్క్, మాన్ హటన్ ప్రాంతంలో గతంలో కనీసం ఒక ఉగ్రవాద దాడికి విఫలయత్నం జరిగింది.