eastern Indonesia
-
గల్లంతైన విమానం కోసం గాలింపు
జకర్తా : తూర్పు ఇండోనేషియాలో గల్లంతైన విమానం కోసం ఆ దేశ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జూలియస్ బారట శనివారం వెల్లడించారు. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన ఈ విమానం 10 మందితో దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మసాంబ నుంచి మకస్సార్కు శుక్రవారం బయల్దేరింది. మరో 11 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది. అంతలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి వైమానిక సిబ్బంది దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో శనివారం ఉదయం నుంచి మళ్లీ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఏడుగురు ప్రయాణికులతోపాటు ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారని బారట తెలిపారు. వారిలో ముగ్గురు చిన్నారులని చెప్పారు. -
ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత
జకర్తా : ఇండోనేసియా విమానం కుప్పకూలిన ప్రదేశంలో 38 మృతదేహాలను కనుగొన్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఓ చిన్నారి మృతదేహం కూడా ఉన్నట్లు వివరించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు సహకరించక పోవడం వల్ల మృతదేహాలను ఇప్పుడే తరలించలేక పోతున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి జేఏ బరాటా మీడియాకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయలుదేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 అనే విమానం పుపువా ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. -
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలోని తూర్పు తైముర్ రాజధాని డిలీకి 351 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే ఆదివారం వెల్లడించింది. దాని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.3గా నమెదు అయిందని తెలిపింది. అయితే భూకంపం తీవ్రత వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా తక్కువ సంభవించిందని పేర్కొంది. సునామీ వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. అయితే ఈ ఏడాది జులైలో సుమిత్రా ప్రావెన్స్లో సంభవించిన భూకంపంలో 35 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.