eclat Health Solutions
-
తెలంగాణలో అమెరికన్ కంపెనీ దూకుడు..! ఆ రంగంలో భారీగా ఉద్యోగుల నియామకం..!
అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్’ తెలంగాణలో తన సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్, హైదరాబాద్‌లో గ్లోబల్ డెలివరీ సెంటర్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ.. కొత్తగా వరంగల్, ఖమ్మంలో కేంద్రాలను తెరువనున్నట్టు వెల్లడించింది. ఈ నాలుగు కేంద్రాల్లో కలిపి కొత్తగా 1,400 మందిని నియమించుకోనున్నట్టు స్పష్టం చేసింది. ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సీఈవో కార్తీక్ పొల్సాని నేతృత్వంలో ఎక్లాట్ గ్రూప్ ప్రతినిధులు బృందం గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రాబోయే 18 నెలల్లో కంపెనీ విస్తరణ ప్రణాళికలను కేటీఆర్‌తో చర్చించారు. వరంగల్, ఖమ్మంలో గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, ఒక్కోచోట కనీసం 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్, హైదరాబాద్‌లోని కేంద్రాల్లో అదనపు నియామకాలు చేపడతామని, హైదరాబాద్‌లో 500 మందిని, కరీంనగర్లో 200 మందిని నియమిస్తామని వెల్లడించారు. మెడికల్ కోడింగ్‌లో దిట్ట..! ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్‌కు మెడికల్ కోడింగ్, టెక్నాలజీ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రభుత్వ సహకారంతోపాటు టాస్క్ ద్వారా మాకు నిపుణులైన మానవవనరులను అందిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు’ అని కార్తిక్ తెలిపారు. హెల్త్‌కేర్ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా వినూత్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్’ (టీ-ఎయిమ్)తో కలిసి పనిచేయాలని ఆసక్తితో ఉన్నామని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో వేగంగా..! ఐటీ ఆధారిత సేవలను తెలంగాణలోని టైర్-2 నగరాల్లో విస్తరణ ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఐటీ మినిష్టర్ కేటీఆర్ వెల్లడించారు. టైర్-2 నగరాలకు విస్తరించాలని ఎక్లాట్ తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ప్రభుత్వం తరఫున ఎక్లాట్కు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దూకుడు..! జర్మన్ కంపెనీ రెడ్డీస్ చేతిలోకి -
కరీంనగర్లో ‘ఇక్లాట్’ డెలివరీ సెంటర్
• 1,000 మందికి ఉద్యోగాలు • రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి • ఇక్లాట్ సీఈవో కార్తీక్ పొల్సాని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ‘ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్’ కరీంనగర్లో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.100 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ప్రస్తుతం 200 మంది పనిచేస్తున్న ఈ కేంద్రం ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు కంపెనీ తెలియజేసింది. నిజానికి తెలంగాణలో హైదరాబాద్ వెలుపల ఓ బహుళజాతి సంస్థ ఈ స్థాయిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. డెలివరీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి, కంపెనీకి అమెరికాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారంనాడు కొత్త సెంటర్‌ను ప్రారంభిస్తారని ఇక్లాట్ సీఈవో కార్తీక్ పొల్సాని మంగళవారమిక్కడ తెలిపారు. ఇక్లాట్ చైర్మన్ సుధాకర్‌రావు పొల్సాని, సీవోవో స్నేహ పొల్సానితో కలిసి మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో 5,000 మంది... ఇక్లాట్కు యూఎస్‌లో మూడు కార్యాలయాలు, భారత్‌లో హైదరాబాద్, చెన్నైలో డెలివరీ సెంటర్లున్నాయి. హైదరాబాద్‌లో 250 మంది, చెన్నైలో 100, యూఎస్‌లో 40 మంది పనిచేస్తున్నారు. అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 5,000లకు చేరుస్తామని కార్తీక్ వెల్లడించారు. లైఫ్ సెన్సైస్ చదివినవారికి తొలి ప్రాధాన్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ‘సమర్థులు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్, కరీంనగర్లో పనిచేస్తున్నవారిలో 70 శాతం మంది తెలుగు మీడియంలో చదివినవారే. అట్రిషన్ రేటు తక్కువ కాబట్టే కరీంనగర్‌ను ఎంచుకున్నాం. కంపెనీకి అయ్యే ఖర్చు కూడా తక్కువ’ అని చెప్పారు. 2017లో వరంగల్‌లో.. వరంగల్‌లో మరో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా దీన్ని అందుబాటులోకి తెస్తామని కార్తీక్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి వెల్లడించారు. ‘‘ముందుగా 100-150 మందితో ప్రారంభిస్తాం. దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుతాం. ఈ కేంద్రానికి కూడా రూ.100 కోట్ల దాకా పెట్టుబడి అవసరం అవుతుంది’’ అని వివరించారు. మెడికల్ రికార్డులను కోడ్స్ రూపంలోకి మార్చడమే కంపెనీ పని. ఈ కోడ్స్ ఆధారంగా బీమా కంపెనీలు క్లెయిమ్‌లను సెటిల్ చేస్తాయి. అమెరికాలో టాప్-20 ఆసుపత్రుల్లో అయిదు సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నట్లు స్నేహ చెప్పారు. -
కరీంనగర్లో ఇక్లాట్ డెలివరీ సెంటర్...
- 1,000 మందికి ఉద్యోగాలు -రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి.. ఇక్లాట్ సీఈవో కార్తీక్ పోల్సాని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కరీంనగర్లో డెలివరీ సెంటర్‌ను నెలకొల్పింది. ఇందుకు రూ.100 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. దీని ద్వారా రెండేళ్లలో ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే ఇక్కడ 200 మంది పనిచేస్తున్నారు. సంస్థకు యూఎస్‌లో మూడు కార్యాలయాలు, భారత్‌లో హైదరాబాద్, చెన్నైలో డెలివరీ సెంటర్లున్నాయి. డెలివరీ కేంద్రం ఏర్పాటుకై ఈ ఏడాది మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి, కంపెనీకి యూఎస్‌లో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కొత్త సెంటర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం(ఆగస్టు 17) ప్రారంభిస్తారని ఇక్లాట్ సీఈవో కార్తీక్ పోల్సాని మంగళవారం మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 5,000 మంది.. ఇక్లాట్ హైదరాబాద్ సెంటర్లో 250 మంది, చెన్నైలో 100, యూఎస్‌లో 40 మంది పనిచేస్తున్నారు. అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 5,000లకు చేరుస్తామని కార్తీక్ వెల్లడించారు. లైఫ్ సెన్సైస్ చదివినవారికి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ‘సమర్థులు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఉన్నారు. పనిచేస్తున్నవారిలో 70 శాతం మంది తెలుగు మీడియంలో చదివినవారే. వరంగల్లోనూ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని పోల్సాని గ్రూప్ చైర్మన్ సుధాకర్ రావు పోల్సాని వెల్లడించారు.