Eco Sport
-
మార్కెట్లోకి ఫోర్డ్ ‘ఎకోస్పోర్ట్ 2019’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎకోస్పోర్ట్’లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చిన ఈ 2019 ఎడిషన్ ధరల శ్రేణి రూ.7.69 లక్షల నుంచి రూ.11.33 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్ వేరియంట్ 1.5లీటర్ల ఇంజిన్, 1–లీటర్ ఎకోబోస్ట్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుండగా.. డీజిల్ వేరియంట్ 1.5లీటర్ల ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ‘థండర్ ఎడిషన్’ డీజిల్ ఇంజిన్ ధరల శ్రేణి రూ.10.18 లక్షల నుంచి రూ.10.68 లక్షలు. ఇక గతేడాది ఎకోస్పోర్ట్ వెర్షన్‌తో పోల్చితే ఈ నూతన ఎడిషన్ ధర రూ.57,400 వరకు తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. ట్రిమ్ స్థాయి ఆధారంగా రూ.8,300 నుంచి గరిష్టంగా 57,400 వరకు తగ్గినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహరోత్రా మాట్లాడుతూ.. ‘ఉత్పత్తి అభివృద్ధి పరంగా బలమైన బృందం తమ పనితీరును ప్రదర్శించడం, కొనసాగుతున్న స్థానికీకరణ కృషి ఫలితంగా ఈ నూతన వెర్షన్ విడుదలైంది’ అని అన్నారు. -
ఫోర్డ్ ‘ఎకోస్పోర్ట్’లో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎకోస్పోర్ట్’లో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధర రూ.10.40 లక్షలు– రూ.11.89 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తున్న సిగ్నేచర్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.10.40 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. కంపెనీ అలాగే ఎకోస్పోర్ట్ ఎస్ వెర్షన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ ధర రూ.11.37 లక్షలుగా, డీజిల్ వేరియంట్ రూ.11.89 లక్షలు. -
ఫోర్డ్ నుంచి కొత్త ఎకోస్పోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్డ్ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ఎకోస్పోర్ట్ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు(గురువారం) లాంచ్ చేసింది. రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల రేంజ్లో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్ వేరియంట్ 1.5 లీటరు ఇంజిన్‌ను కలిగి ఉండగా.. దీని ధర రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల వరకు ఉంది. డీజిల్ ఆప్షన్లో అంతకముందటి మోడల్ మాదిరే ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.8.01 లక్షల నుంచి రూ.10.67 లక్షల రేంజ్లో ఉంది. ఇది లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఈ కొత్త ఎకోస్పోర్ట్ భారతీయ మార్కెట్‌కున్న తమ నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుందని ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. 2013లో ఈ మోడల్‌ను తొలుత లాంచ్ చేసినప్పటి నుంచి 60-65 శాతం ఉన్న స్థానికత స్థాయిలను 85 శాతం వరకు పెంచినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న మోడల్ ధరలను అదేవిధంగా ఉంచనున్నట్టు చెప్పారు. ఈ కొత్త ఎకోస్పోర్ట్‌లో 1600 మార్పులను ఫోర్డ్ చేపట్టింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీ, స్టాండర్డ్ ఈక్విప్మెంట్లతో దీన్ని రూపొందించింది. ఈ క్రమంలోనే ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను ఫోర్డ్ ఇండియా ఆపివేసింది. భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో ప్యాసెంజర్ వాహనాలను ఎగుమతి చేస్తున్న కంపెనీగా ఫోర్డ్ ఉందని మెహ్రోత్రా తెలిపారు. -
ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. ‘ప్లాటినమ్ ఎడిషన్’
ప్రారంభ ధర రూ.10.39 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్’ తాజాగా తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎకోస్పోర్ట్’లో అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ప్లాటినమ్ ఎడిషన్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.10.39 లక్షలు–రూ.10.69 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ కొత్త కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ లీటర్‌కు 22.27 కిలోమీటర్ల మైలేజ్‌ను.. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ లీటర్‌కు 18.88 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.10.39 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.10.69 లక్షలుగా ఉందని తెలిపింది. ఇందులో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ డిజైన్, బ్లాక్ రూఫ్, 17 అంగుళాల పెద్ద వీల్స్, శాటిలైట్ నావిగేషన్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా వంటి పలు ప్రత్యేకతలున్నట్లు వివరించింది. -
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధర రూ.1.12 లక్షల వరకూ తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా తాజాగా ‘ఎకోస్పోర్ట్’ ధరను రూ.1.12 లక్షల వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుం దని కంపెనీ ప్రకటించింది. ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 53,000- రూ.87,000 శ్రేణిలోనూ, డీజిల్ వేరియంట్ ధర రూ.1.12 లక్షలమేర తగ్గింది. దీంతో ఇప్పటి నుంచి పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.68 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.7.28 లక్షలుగా ఉండనున్నది. ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి.