
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘ఎకోస్పోర్ట్’లో కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధర రూ.10.40 లక్షలు– రూ.11.89 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.
సన్‌రూఫ్ ఫీచర్‌తో వస్తున్న సిగ్నేచర్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.10.40 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. కంపెనీ అలాగే ఎకోస్పోర్ట్ ఎస్ వెర్షన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ ధర రూ.11.37 లక్షలుగా, డీజిల్ వేరియంట్ రూ.11.89 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment