Eden
-
'ఈడెన్ ది షాపే' ఫ్యాషన్ ఫోర్కాస్ట్: సరికొత్త డిజైనరీ కలెక్షన్లు..!
నేటి తరం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఈడెన్ ది షాపే సరికొత్త డిజైనరీ కలెక్షన్లతో ఫోర్కాస్ట్-2025తో ముందుకు వచ్చింది. వినూత్న డిజైనరీ కలెక్షన్లతో ఆకట్టుకునేలా ఫ్యాషన్ కలెక్షన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్‌లో భాగంగా ఫ్యాషన్ రంగంపై పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని, ఐకానిక్ 90, 2000ల ప్రారంభంలో ఫ్యాషన్ పునః ప్రవేశం, ఫ్యాషన్ డిజైన్‌లో ఏఐ పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించింది. అదేవిధంగా మహిళలు, యవతకు నచ్చే ఫ్యాషన్ కలెక్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ఏడాది ఫ్యాషన్ ట్రెండ్లు:సుస్థిరమైన సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ : జీరో-వేస్ట్ డిజైన్లు, సుస్థిరమైన మెటీరియల్‌లు అభివృద్ధి చేస్తూ, పర్యావరణహితమైన, మన్నికమైన హ్యాండ్ మేడ్ డిజైనరీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం.నోస్టాల్జియా ఫ్యాషన్: 1990 నుంచి 2000 వరకు ఐకానిక్‌గా ఉండే షార్ట్ జీన్స్, కార్గో ప్యాంట్లు, భారీ పరిమాణంలో ఉండే బ్లేజర్లు వింటేజ్ గ్రాఫిక్ టీ షర్టులన్నీ కూడా ఆధునాతన సొబగులతో మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మినిమలిజం - నాణ్యత: మినిమలిస్ట్ ఫ్యాషన్ ఇప్పటికీ బలంగానే ఉంది. మెటీరియల్ ఎంపిక నుంచి మొదలుకుంటే క్రాఫ్ట్మ్యాన్షిప్ సుస్థిరమైన సౌకర్యంతో కూడిన కాలనుగుణమైన మన్నికైన బహుముఖ వస్తువుల తయారీ. AI-జనరేటెడ్ కస్టమ్ ఫ్యాషన్: ఏఐ-ఆధారిత ఫ్యాషన్ ఆవిష్కరణలతో వినియోగదారుల ఫ్యూచరిస్టిక్ ఫ్యాషన్ అనుభూతితో, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా దుస్తుల రూపకల్పన, బట్టలను ఎంపిక చేసుకోవడం మరింత సులభతరం కానుంది. ఫ్యాషన్ ముఖ్యాంశాలు:టాప్‌లు: సౌకర్యవంతంతోపాటు, స్టైలిష్‌గా కనిపించే దుస్తులతోపాటు, భారీగా ఉండే బటన్-డౌన్ షర్టులు, కుర్తా టాప్‌లు, టర్టిల్నెక్ టాప్‌లు మపఫ్డ్ స్లీవ్లతో కూడిన ఆర్టిస్టిక్ డిజైనరీ వస్త్రాలు.బాటమ్స్: అందుబాటులో హై-వెయిస్టెడ్ ప్యాంటు, కార్గో ప్యాంట్లు, డెనిమ్ స్కర్టులు, ప్లీటెడ్ స్కర్టులు, బూట్‌కట్ జీన్స్ వంటివి యువతకు నప్పే, మెప్పించే సౌకర్యవంతమైన వస్త్రాలు. లోదుస్తులు: విశేషమైన ఆదరణ ఉన్నా లగ్జరీ సిల్క్, శాటిన్‌తో చేసిన లోదుస్తులు, వైర్లెస్ బ్రా, బోల్డ్, స్పోర్టీ-చిక్ డిజైనరీ క్లాత్.ఆభరణాలు, ఉపకరణాలు: మినిమలిస్ట్, వింటేజ్-ప్రేరేపిత ఆర్టిస్టిక్ ఆభరణాలు, ముఖ్యమైన ఉపకరణాలలో క్రాస్బాడీ, మినియేచర్ బ్యాగులు, బోల్డ్ శిల్పకళా సంచులు, మెటల్ ఫ్రేమ్‌తో కూడిన సన్ గ్లాసెస్, రెట్రో-ప్రేరేపిత డిజైన్లు, ఫ్యూచరిస్టిక్ ఆకృతులతో ట్రెండీ వేర్. ఫుట్‌వేర్: చంకీ స్నీకర్లు, బోల్డ్ బూట్లు, ప్లాట్‌ఫామ్ హీల్స్ క్యాజువల్ వేర్‌కు అనువైన పాదరక్షలు.బ్యూటీ ట్రెండ్స్: 2025లో ఫ్యాషన్ రంగాన్ని నడిపించే గ్రాఫిక్ ఐలైనర్లు, గ్లో-బూస్టింగ్ హైలైటర్లు, వీగన్ లిప్‌స్టిక్‌లు ఈడెన్-ది షాపే గురించి:హైదరాబాద్‌లోని గాంధీనగర్ కేంద్రంగా ఈడెన్-ది షాపే అంచనాలకు మించి క్యూరేటెడ్ ఫ్యాషన్ కలెక్షన్లను అందిస్తోంది. గ్యాలరీ-ప్రేరేపిత లేఅవుట్‌తో ఇదొక ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. వినియోగదారులు కూడా సరసమైన లగ్జరీ తాజా ట్రెండ్లను సులభంగా పొందవచ్చు. 2016లో ప్రారంభమైన నాటి నుంచి ఈడెన్-ది షాపే ఫ్యాషన్ ఆవిష్కరణలతో బ్రాండెడ్, డిజైనరీ కలెక్షన్లకు వేదికగా నిలుస్తోంది. వివరాల కోసం: ఈడెన్-ది షాపే- ఈడెన్ అనెక్స్, గాంధీనగర్,హైదరాబాద్ - 500080 వద్ద సందర్శించవచ్చుమొబైల్ : +91 9652132812ఈమెయిల్: edentheshoppe@gmail.com(చదవండి: Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్ ప్రయాణం) -
మిస్ సౌత్ ఇండియా ఫేమ్ హీరోయిన్గా ‘తురితమ్’
తురితమ్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సండియార్ చిత్రం ఫేమ్ జగన్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఇది. మిస్ సౌత్ ఇండియా కిరీటధారిణి ఈడెన్ ఇందులో నాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు ఇరుక్కు ఆనా ఇల్లై, పణి విళుమ్ నిలవు చిత్రాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు హెచ్.వినోద్ శిష్యుడు శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ ఇంతకుముందు రోడ్డు ట్రావెలింగ్ ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయన్నారు. అయితే తమిళనాడులో రోడ్ ట్రావెలింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న తొలి చిత్రం తమదేనన్నారు. చిత్ర కథ ఎక్కడ జరుగుతుందో అక్కడే షూటింగ్ జరిపినట్లు చెప్పారు. ఎవరు చేసిన పనులు వారి దృష్టిలో సరైనవి అనిపిస్తాయని, అయితే ఇతరుల దృష్టిలో అవి తప్పు అనిపించే అవకాశం ఉంటుందని అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం తురితమ్ అని పేర్కొన్నారు. -
భార్యాభర్తల దారుణ హత్య
చందానగర్ : తలపై మోది, గొంతుకు తాడు బిగించి భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికిచెందిన సాదిక్ అలీ(55)కి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సలీమా బేగం చనిపోయింది. ఆమెకు ముగ్గురు కుమారులు. రెండవ భార్య షమీమ్ బేగానికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పది సంవత్సరాల క్రితం జీడిమెట్లకు చెందిన వివాహిత ఆశాబీ(50)ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆశాబీకీ ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆశాబీతో కలిసి శేరిలింగంపల్లిలోని గోపీనగర్లో ఆరు నెలలుగా నివాసం ఉంటూ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా 20 రోజుల క్రితం ఆశాబీతో కలిసి గ్రామానికి వెళ్లాడు. అక్కడి గొడవ జరగడంతో చిరిగిన దుస్తులతో భార్యాభర్తలు గోపీనగర్‌కు వచ్చారు. ఆదివారం రాత్రి 11 గంటలకు నిద్రకు ఉపక్రమించారని ఇంటి యజమాని శాంతా యాయి తెలిపారు. తెల్లవారినా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని తలుపులు తీసి చూడగా రక్తపు మడుగులో సాధిక్, ఆశాబీచనిపోయి ఉన్నారు. ఇద్దరి తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. తలపై కొట్టిన తరువాత గొంతుకు తాడుతో బిగించారు. చనిపోయారని నిర్థారించుకున్న తరువాత గుర్తు తెలియని దుండగులు ఉడాయించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాలే కారణం? ఇటీవల ఇల్లు అమ్మగా సాదిక్‌కు రెండు లక్షల రూపాయలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆస్తి తగాదాలు హత్యకు కార ణం కావచ్చని పోలీసులు భావిస్తునానరు. ఇత ర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన స ్థలాన్ని మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా, ఏసీపీ శ్రీధర్, సీఐ వాసు, క్లూస్ టీం సందర్శించారు. -
దాడి పాశవికం
నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. సబిత, మంత్రి ప్రసాద్కుమార్ల హామీ పాస్టర్ సంజీవులుకు పరామర్శ దాడికి సర్కార్‌దే బాధ్యతన్న బ్రదర్ అనిల్ చాదర్‌ఘాట్,కవాడిగూడ,న్యూస్‌లైన్: గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులును ఆదివారం చేనేత,జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్,మాజీహోంమంత్రి సబితారెడ్డి, మహా జన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ప్రసాద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ పాస్టర్‌పై దాడి అత్యంత పాశవికమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని సూచించారు. పాస్టర్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని, దాడికి పాల్పడిన దోషులను ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద సంజీవులు వైద్యఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీఇచ్చారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సబితారెడ్డి రంగారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. మందకృష్ణ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల విషయంలో బీజేపీ తమ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్‌పై దాడి అత్యంత దారుణమంటూ..ఈ విషయమై డీజీపీ,సీఎంను కలుస్తానని చెప్పారు. దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత: బ్రదర్ అనిల్‌కుమార్ క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రముఖ మతప్రబోధకులు బ్రదర్ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్‌పైనున్న గుర్రంజాషువా, అంబేద్కర్ విగ్రహాల వద్ద క్రిస్టియన్ సోషల్ఫోరం, ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి బ్రదర్ అనిల్‌కుమార్, సినీహీరో రాజా హాజరయ్యారు. బ్రదర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంజీవులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు పాల్దేవ్ప్రియం, బిషప్విల్స న్ సింగన్, స్టాలిన్‌బాబు, పి.వరప్రసాదరావు, మాజీ ఐఏఎస్ దానం, బిషప్ గొల్లపల్లిజాన్, టీఆర్ఎస్ క్రిస్టియన్ సెల్ ఇంచార్జ్ బి.శంకర్‌లూక్, టీడీపీ క్రిస్టియన్‌సెల్ ఇంచార్జ్ చిరంజీవి, ఎస్తేరురాణి, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.