ఐక్యతతో అన్ని రంగాల్లో విజయం
ధర్మవరం అర్బన్ : ఈడిగ కులస్తులందరూ ఐకమత్యంతో కదిలితే అన్ని రంగాల్లో విజయం మనదే.. రాజకీయంగా ఈడిగలు రాణించాలంటే కలసికట్టుగా ఉద్యమించినప్పుడే రాజకీయంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ధర్మవరంలోని ఎన్జీవో హోంలో ఈడిగ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం సుధాకర్‌గౌడ్ అధ్యక్షతన ప్రతిభగల ఈడిగ విద్యార్థినీవిద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథి, జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్, డైట్ ప్రిన్సిపల్ మునెయ్య, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిబాబుగౌడ్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు పాలచెర్ల ఆదినారాయణ, కార్యదర్శి నాగేశ్వరరావు, ఈడిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.జి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్లో ఈడిగ విద్యార్థినీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపారన్నారు. వారికి సర్టిఫికెట్, మెమెంటోతోపాటు నగదు బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థినీవిద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్‌ను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, ఈడిగ ఉద్యోగస్తుల సంఘం, ఈడిగ సంక్షేమ సంఘం నాయకులు, కులస్థులు పాల్గొన్నారు.