editor of Tehelka
-
ట్విటర్లో ఎడిట్ ఆప్షన్.. ఓ ట్విస్ట్!
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ఏ విషయాన్ని అయినా వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటు అయిపోయింది. వీటిలో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ముందు వరుసలో ఉన్నాయి. అయితే మనం పెట్టే పోస్టులో ఏదైనా తప్పు ఉంటే ఫేస్బుక్లో వెంటనే సరిచేసుకోవచ్చు. కానీ ట్విటర్లో ఆ వెసులుబాటు ఇప్పటి వరకు లేదు. ఒకవేళ తప్పుగా ట్వీట్ చేస్తే దాన్ని ట్వీట్ మొత్తాన్ని డిలీట్ చేసి మళ్లీ కొత్త ట్వీట్ చేయాల్సిందే. ట్విటర్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన ట్విటర్ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ.. ఇకపై ట్విటర్లో ఎడిట్ ఆప్షన్ బటన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ పెట్టింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించినప్పుడు ఎడిట్ బటన్‌ను తెస్తామని చెప్పింది. అంటే కరోనా విజృంభణ నేపథ్యంలో ట్విటర్ ఈ విధంగా కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో 2 మిలియన్లకు పైగా లైకులు రాగా, 626 రీట్వీట్లు వచ్చాయి. అసలు అందరూ మాస్కులు ధరించడం సాధ్యమవుతుందా అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది గ్లోబ్‌కు మాస్కు పెట్టి ఫన్నీగా ట్వీట్ చేస్తున్నారు. (దక్షిణాదిన మహేశ్ ఒకే ఒక్కడు) -
తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 1వ తేదీ వరకూ తేజ్ పాల్ కు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తేజ్‌పాల్ తల్లి శకుంతల తేజ్‌పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నెల 27 వరకు తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. అతనికి ఇచ్చిన బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో తేజ్ పాల్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ధర్మాసనం బెయిల్ ను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్‌లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం
లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ నెల 27 వరకు తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తేజ్‌పాల్ తల్లి శకుంతల తేజ్‌పాల్ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ గత నెలలో మరణించారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసింది. గతేడాది నవంబర్‌లో గోవా రాజధాని పనాజీలో ఓ హోటల్లో సహచర మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేజ్‌పాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తేజ్పాల్ను గోవా పోలీసులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.