ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ
క్రిషన్, దీపికా దాస్, యగ్నస్ ముఖ్య తారలుగా క్రిషన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈ మనసే’. బన్ని మీడియా సమర్పణలో శ్రీ రాజేశ్వరి క్రియేషన్స్ పతాకంపై జి. రాజేశ్వరి, నిమ్మల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుభాష్ ఆనంద్ స్వరపరచిన పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో ఈ సినిమా చేశాం. అందరి హృదయాలను తాకే విధంగా ఉంటుంది. ఈ నెలాఖరున సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ లవ్ ఎంటర్టైనర్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి రచనాసహకారం: చైతన్య, సహనిర్మాతలు: వి. బాలాజీ, జి. దీప.