క్వార్టర్స్‌లో పేస్ జంట
లండన్ : ఎగాన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ పేస్-గ్రానోలెర్స్ ద్వయం 3-6, 6-2, 11-9తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)-స్కాట్ లిప్స్కీ (అమెరికా) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో పేస్ తన కెరీర్లో 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగాడు. తొలి సెట్‌ను కోల్పోయిన పేస్ జంట రెండో సెట్లో తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.