the election
-
ఎమ్మెల్యే గాంధీకి హైకోర్టులో ఊరట
ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు నిలుపుదల వాదనలు వినిపించేందుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి నోటీసులు అందుకున్నా కోర్టు ముందు తను గానీ.. తన తరఫు న్యాయవాది గానీ హాజ రుకాకపోవడంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీని ఎక్స్‌పార్టీగా ప్రకటిస్తూ అంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు శనివారం నిలుపుదల చేసింది. సెక్షన్‌కు సంబంధించి జరిగిన పొరపాటు వల్ల తాను దాఖలు చేసిన వకాలత్ రికార్డుల్లో చేరలేదని, కేసులో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ గాంధీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఎక్స్‌పార్టీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ, ఈ అనుబంధ పిటిషన్‌ను అనుమతించారు. ఇదిలా ఉండగా.. ఇదే విధంగా ఎక్స్‌పార్టీ అయిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద సైతం తనకూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి, దీనిపై అభ్యంతరాలు ఉంటే వాటిని కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచాలని టీఆర్ఎస్ అభ్యర్థి కె.హన్మంతరెడ్డిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. -
చేనేతలను పట్టించుకోని ‘బాబు'
నెల్లూరు (సెంట్రల్): చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు విస్మరిం చారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు పూటకో మా ట చెబుతూ కాలం గడుపుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో దయ్యబట్టారు. ఎన్నికల మెనిఫేస్టోలో చేనేత కార్మికులకు బ్యాంకు రుణాల మాఫీ, పవర్ లూమ్‌లపై రుణాలు రద్దు, చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు, చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహా యింపు, ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష వరకు సంస్థాగత రుణం కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ కల్పిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మూతపడిన చేనేత సంఘాల పునరుద్ధరణ, బకాయిల రద్దు, మూల ధనం సహాయం అందించడంతోపాటు 50 శా తం సబ్సిడీతో మగ్గాలను సరఫరా చేస్తామ న్నారు. చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీపై ముడి సరుకులు సరఫరా, మగ్గాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ఇప్పుడు మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. సహకార సంఘాలు లేనిచోట స్వయం సహాయక సంఘాలు ఏర్పా టు చేసి వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందే లా చూస్తామని చెప్పి వాటి గురించి ఎక్కడా మాట్లాడక పోవడం చేనేత కార్మికులను మోసం చేయడమే అని విమర్శించారు. చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం కల్పిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్త డం లేదన్నారు. చేనేత పరిశ్రమ ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం, వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేతలకు బడ్జెట్లో వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధిని ప్రవేశపెడతామని చెప్పారని, ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆ ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. -
‘కృష్ణ’ గారడి!
సహకార ఎన్నికలకు మళ్లీ బ్రేక్ మంత్రి స్టేతో ఆగిన తొమ్మిది పీఏసీఎస్‌ల ఎన్నికలు అప్పుడు మంత్రి కృష్ణారెడ్డి, ఇప్పుడు గోపాలకృష్ణారెడ్డి ఎఫెక్ట్ టీడీపీ మద్దతుదారులు ఓడిపోతారనే భయం పలమనేరు: జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సహకార శాఖ మంత్రి కృష్ణారెడ్డి ఈ ఎన్నికలకు స్టే ఇచ్చారు. ఈసారి టీడీపీకి చెందిన మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఈ ఆదేశాలను జారీచేశారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలవరనే సమాచారంతోనే ప్రభుత్వం ఈ ఎత్తుగడకు పూనుకున్నట్టు తెలుస్తోంది. తొమ్మిది పీఏసీఎస్‌లకు వాయిదా పడిన ఎన్నికలు జిల్లాలోని మదనపల్లె డివిజన్‌కు సంబంధించి పుంగనూరు, సోంపల్లె, సదుం, బెరైడ్డిపల్లె, బయప్పగారిపల్లె, చిత్తూరు డివిజన్‌కు సంబంధించి కోసలనగరం, నిండ్ర, తిరుపతి డివిజన్‌కు సంబంధించి సత్యవేడు, పులిచర్ల పీఏసీఎస్‌లకు వచ్చే నెల 10న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లా సహకార శాఖాధికారి వనజ నుంచి సంబంధిత సీఈవోలకు గత శుక్రవారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలందిన విషయం తెలిసిందే. ఇది రెండోసారి గత ఏడాది ఈ ఎన్నికలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉన్న పీఏసీఎస్‌లలో గెలుపు ఆ పార్టీదేనని భావించిన నాయకులు ఎన్నికలు జరగనీయకుండా ఎత్తుగడ వేశారు. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ ఎన్నికలను వాయిదా వేయించారు. దీనికి సంబంధించి అప్పటి సహకార శాఖ మంత్రి క్రిష్ణారెడ్డి పేరు మీదుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు నుంచి ఈ ఆదేశాలందాయి. తిరిగి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఈ తొమ్మిది పీఎస్సీఎస్లలో విజయం దక్కదనే మరోసారి వాయిదా పడింది. టీడీపీకి ఎదురుగాలి తప్పదనే గతంలో ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. ఈ తొమ్మిది సహకార సంఘాలకు సంబంధించి సుమారు 29 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి కొత్త సభ్యత్వాలకు తావులేనట్టేనని అధికారులు చెప్పారు. దీంతో గతంలో ఓటర్లుగా ఉన్న వారితోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ భావించింది. ఈ మధ్యనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన మండలాల్లో ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ల ద్వారా కార్యకర్తల సమావేశం సైతం నిర్వహించారు. ఇందులో ఖచ్చితంగా టీడీపీ గెలవదని అర్థమైంది. ఆ మేరకు నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకె ళ్లినట్టు సమాచారం. దీంతో పాటు రుణమాఫీ జరగక పోవడంతో రైతుల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఫలితంగానే ఎన్నికలను వాయిదా వేయించినట్టు తెలుస్తోంది. ఇక రైతన్నలకు కష్టాలే.. తొమ్మిది పీఏసీఎస్‌ల పరిధిలోని రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే కార్యవర్గాలు లేక సహకార సంఘాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక పర్సన్ ఇన్‌చార్జ్‌లతోనే సొసైటీల పాలన సాగడంతో రైతులకు మేలు చేకూరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
శాసనసభ స్పీకర్‌గా సిరికొండ
జిల్లాకు తొలి అవకాశం.. సన్నిహితుడి వైపే కేసీఆర్ మొగ్గు ఇప్పటికే డిప్యూటీ సీఎంగా తాటికొండ మరో మంత్రి పదవిపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్‌గా జిల్లాకు చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారికి అవకాశం లభించనుంది. సోమవారం నుంచి శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. స్పీకర్ ఎంపికను ఏకగ్రీవం చేసేందుకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్‌రావు విపక్షాలతో చర్చిస్తున్నారు. స్పీకర్ ఎన్నిక నేడో, రేపో జరుగుతుందని, నూతన సభ్యుల ప్రమాణస్వీకారానికి పట్టే సమయాన్ని బట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. సిరికొండ మధుసూదనాచారి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా విశేష సేవలందించి ఎన్టీఆర్ మనసు చూరగొన్నారు. 1994 ఎన్నికలకు ముందే అప్పటి శాయంపేట నియోజకవర్గ అభ్యర్థిగా చారిని ఎన్టీఆర్ ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 1994లో టీడీపీ అభ్యర్థిగా మధుసూదనాచారి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగిడారు. అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీని వీడి టీఆర్ఎస్ వ్యవస్థాపక సమయంలోనే అందులో చేరారు. అప్పటినుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా ఆయనతో కలిసి సాగుతున్నారు. రాష్ట్ర కార్యాలయ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలైనప్పటికీ... తాజా ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌కు చెందిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిపై విజ యం సాధించారు. మంత్రి పదవి ఆశించినప్పటికీ కేసీఆర్ ఆయనను స్పీకర్‌గా పనిచేయాలని ఒప్పించినట్లు తెలుస్తోంది. అధినే త ఆదేశాలతో స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిం చేందుకు సిరికొండ సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచర వర్గాలు భావిస్తున్నాయి. సిరికొండ ఉన్నత విద్యావంతుడు, శాసనసభా వ్యవహారాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన సిరి కొండ స్పీకర్ బాధ్యతల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టగలరనే విశ్వాసంతో కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. సిరికొండ స్పీకర్ ఎంపిక లాంఛనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనూహ్య పరిణామాలు ఎదురై చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప సిరికొండ నే తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. మరో మంత్రి పదవి ఇస్తారా.. లేదా.. తొలి కేబినేట్లో జిల్లాకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. స్పీకర్‌గా సిరికొండకు అవకాశం లభిస్తే, విప్ పదవుల్లో ఒకటి జిల్లాను వరించే అవకాశం ఉంది. శాసనసభా సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో జిల్లాలో మరొకరికి చోటు కల్పిస్తారనే విశ్వాసంతో ఉన్నారు. దీనిపై సీనియర్ ఎమ్మెల్యేలు ఆశతో ఉన్నారు. డిప్యూటీ సీఎం జిల్లాకు చెందిన వ్యక్తికే ఇవ్వడం వల్ల మరో మంత్రి పదవి ఇస్తారా.. లేదా.. అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.