electricity customers
-
విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
-
మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ‘డియర్ కస్టమర్.. మీ విద్యుత్ సరఫరా ఈ రోజు రాత్రి 10.38 గంటలకు నిలిచిపోతుంది. మీరు గత నెల బిల్లు చెల్లించలేదు. వెంటనే మా 998... నంబర్లో సంప్రదించండి. ధన్యవాదాలు’. విద్యుత్ శాఖ నుంచి వచ్చినట్లుగా ఉండే ఈ తరహా సందేశాన్ని నమ్మి మీరు ఫోన్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలో నగదు ఖాళీ అయినట్లే. అదేలా అనుకుంటున్నారా.. అయితే ఈ క్రింది పేరా చదవండి.. చదవండి: నేను..నాలా‘గే’ ఉంటా.. స్వలింగ సంపర్కులు, థర్డ్ జండర్స్ ప్రైడ్ వాక్ మీకు వచ్చిన సందేశంలోని నంబర్‌కు ఫోన్ చేయగానే అవతలి వ్యక్తులు అచ్చం విద్యుత్ శాఖ అధికారులుగానే మాట్లాడతారు. మీరు బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఆ సొమ్ము మాకు చేరలేదంటారు. ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్ అవుతాయంటూ నమ్మిస్తారు. అది నమ్మి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.10 చెల్లిస్తే వారికి పంట పండినట్లే. ఇక మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్‌డ్రా అయిపోతాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు పంపించడం, విద్యుత్ బకాయిలపై ఫోన్లో సంప్రదించడం వంటి చర్యలు విద్యుత్ శాఖ చేయదని స్పష్టం చేస్తున్నారు. -
కరెంట్ బిల్లు తగ్గించుకోండిలా..
సాక్షి, అమరావతి: మీ బడ్జెట్‌కు తగ్గట్టుగానే కరెంట్ బిల్లూ రావాలని కోరుకుంటున్నారా? ఇది కష్టమేమీ కాదు. కాకపోతే కరెంట్ వాడకంపై కాస్త అవగాహన ఉండాలి. దేనికి ఎన్ని యూనిట్లు వాడుతున్నామో తెలిస్తే అనవసర వాడకంతోపాటు బిల్లూ తగ్గుతుంది. ఉదాహరణకు కాస్త చీకటి పడితే అన్ని గదుల్లోనూ బల్బులు వెలుగుతాయి. రాత్రి పడుకునే వరకూ ఇవి ఆన్‌లోనే ఉంటాయి. వాతావరణాన్ని బట్టి ఫ్యాన్ వాడకం ఉంటుంది. రోజూ వాడే మోటర్, గీజర్, కుక్కర్, మిక్సీ, ఏసీ, ఏవి ఎన్ని గంటలు వాడుతున్నామో తెలిసే ఉంటుంది. ఇలా లెక్కేసుకోండి...! ఇంట్లో వాడే ప్రతీ విద్యుత్ ఉపకరణాన్ని వాట్స్‌లో లెక్కిస్తారు. వెయ్యి వాల్టులు ఒక గంటపాటు వాడితే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. అంటే వంద వోల్టుల బల్బులు మన ఇంట్లో 10 ఉన్నాయనుకుంటే గంటకు ఒక యూనిట్ విద్యుత్ వాడినట్టే. ఇవి ఎన్ని గంటలు వెలిగితే అన్ని యూనిట్లు. ఇలా ప్రతి ఉపకరణం సామర్థ్యం, వాటివల్ల గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో కింద పట్టిక ద్వారా తెలుసుకోండి. దీన్నిబట్టి నెలవారీ ఎంత విద్యుత్ అవసరమో లెక్కేసుకుని, అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే, మీరు కోరుకున్న బిల్లే మీ చేతికొస్తుంది. -
కరెంట్ షాక్
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచేలా చార్జీల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైంది. బిల్లుల మోత మోగించనుంది. ఇన్నాళ్లూ అంతంతమాత్రంగా విద్యుత్‌ను వినియోగించే పేదలకు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం ఈసారి వారినీ విడిచిపెట్టట్లేదు. పెంచిన చార్జీల ప్రతిపాదనల్ని బుధవారం విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఖరారు చేయాల్సి ఉందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) అధికారులు చెప్తున్నారు. తాజా ప్రతిపాదనలతో జిల్లాపై ఏకంగా నెలకు రూ.25 కోట్ల మేర భారం పడనున్నట్టు సమాచారం. రూ.25 కోట్లు భారం? జిల్లాలో సుమారు 12.55 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో 10 లక్షల 84 వేల 932 గృహ వినియోగదారులు, లక్షా 21 వేల 449 వాణిజ్యం, 5,041 పరిశ్రమలు, 974 హెచ్‌టీ, 376 కుటీర పరిశ్రమలు, 23,439 వ్యవసాయ, 10,549 వీధిలైట్లు, 2,068 ప్రజా నీటి సరఫరా పథకాలు, 6,603 సాధారణ(దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు తదితర) వినియోగ కనెక్షన్లున్నాయి. వీటిద్వారా ప్రస్తుతం సగటున నెలకు రూ.250 కోట్లు వరకు విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉంది. తాజా పెంపుతో జిల్లాపై సుమారు 25 కోట్లు వరకు భారం పడనున్నట్టు అంచనా. ఈ భారం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనాలపై పడనుంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రజలు, మరింత భారం మోసేందుకు సిద్ధంకాక తప్పనిపరిస్థితి. కేటగిరీల వారీ భారం జిల్లాలోని ఎల్టీ కేటగిరీ వినియోగదారుల నుంచి సగటున సుమారు రూ.70 కోట్లు విద్యుత్ చార్జీలు వసూలవుతున్నాయి. ఈ డిమాండ్ రూ.83 కోట్లు వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో గృహ వినియోగం రూ.40 కోట్లు నుంచి రూ.47 కోట్లు, వాణిజ్య కేటగిరీలో రూ.20.5 కోట్లు నుంచి రూ.24.5 కోట్లు, పరిశ్రమలు, ఇతర కేటగిరీలో రూ.కోటి వరకు పెరగొచ్చు. హెచ్‌టీ కేటగిరీలో నెలకు సగటున రూ.180 కోట్లు వరకు విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉంది. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఈ కేటగిరీలో మరో రూ.12 కోట్లు పెరిగి డిమాండ్ రూ.192 కోట్లుకు చేరుకుంటుందని అంచనా. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో.. దానిపై ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశాల్లేవు. ఇప్పటి వరకు లోయర్ కేటగిరీ గృహ వినియోగదారులపై పెద్దగా భారం మోపలేదు. ప్రస్తుత ప్రతిపాదనలు యూనిట్‌కు 55 పైసలు అమలు చేస్తే గృహ వినియోగ కేటగిరీలో భారం వీరిపైనే అధికంగా ఉండే అవకాశాలుంటాయని అధికారులు చెప్తున్నారు.