eligible test
-
75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు. కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్ పియరే అన్నారు. -
‘మెజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారు’
న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్‌తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది. -
6న ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 6న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రాంతీయ సమన్వయ కేంద్ర కోఆర్డినేటర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఇప్పటికే అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్ట్స్ కళాశాలలోని కేంద్రం నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు.