eluru municipal elections
-
ఏలూరు మేయర్‌గా నూర్జహాన్
ఏలూరు టౌన్: ఏలూరు నగర మేయర్ పీఠంపై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఏలూరు కార్పొరేషన్ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయభేరి మోగించింది. నూతన పాలక వర్గం శుక్రవారం కొలువుదీరింది. నగర మేయర్‌గా నూర్జహాన్, డిప్యూటీ మేయర్లుగా జి.శ్రీనివాసరావు, ఎన్.సుధీర్‌బాబు ఎన్నికయ్యారు. ఏలూరు కార్పొరేషన్‌లోని 50వ డివిజన్ నుంచి గెలుపొందిన నూర్జహాన్ రెండోసారి మేయర్ అయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2014లో ఆమె తొలిసారి మేయర్ పీఠాన్ని అధిరోహించారు. రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక.. రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికలో భాగంగా తిరుపతి రెండో డిప్యూటీ మేయర్‌గా భూమన అభినయరెడ్డి ఎన్నికయ్యారు. విశాఖ: జీవీఎంసీ రెండో డిప్యూటీ మేయర్‌గా కట్టమూరి సతీష్ ఎన్నికయ్యారు విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ రెండో వైస్ ఛైర్మన్‌గా కారుకొండ కృష్ణ, సాలూరు మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్‌గా అప్పలనాయుడు, బొబ్బిలి మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్‌గా చెలికాని మురళి ఎన్నికయ్యారు. విజయ నగరం డిప్యూటీ మేయర్‌గా కొలగట్ల శ్రావణి ఎన్నికయ్యారు. కడప నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా నిత్యానందరెడ్డి ఎన్నికయ్యారు. అనంతపురం: గుంతకల్లు మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్‌గా నైరుతిరెడ్డి ఎన్నికయ్యారు. అనంతపురం కార్పొరేషన్ రెండో డిప్యూటీ మేయర్‌గా విజయ్‌భాస్కర్‌రెడ్డి ఎన్నికయ్యారు. -
ఒకరు 38 ఏళ్లకు 38 ఓట్లతో.. మరొకరు 9 ఓట్లతో
హేలాపురిలో ‘ఫ్యాన్’ విజయభేరి మోగింది.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు పట్టం కట్టేలా నగర ప్రజలు ఏకపక్షంగా తీర్పుచెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ సరికొత్త చరిత్రను లిఖిస్తూ విజయదుందుభి మోగించింది. 50 స్థానాలకు గాను 47 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష టీడీపీ మూడు స్థానాలకు పరిమితం కాగా జనసేన, బీజేపీ కూటమి బోణీ కూడా కొట్టలేకపోయాయి. సాక్షి, ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక పీఠంపై వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభంజనం కొనసాగగా తాజాగా ఏలూరు మేయర్ పీఠం సైతం వైఎస్సార్సీపీకే దక్కింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా రికార్డు విజయాలు నమోదుకావడం గమనార్హం. 30వ డివిజన్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి పప్పు ఉమామహేశ్వరరావు 38 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ టీడీపీ అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983 నుంచి ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ రాగా ఈసారి ఓటమి చవిచూశారు. ఇక16వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి జుజ్జవరపు విజయనిర్మల తన సమీప స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి సంతోషమ్మ కంటే 9 ఓట్ల ఆధిక్యం సాధించారు. రీకౌంటింగ్ జరిపినా ఫలితంలో మార్పు లేకపో వడంతో విజయనిర్మలను విజయం వరించింది. పలు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీ సాధించగా టీడీపీ అభ్యర్థులు మూడు చోట్ల మాత్రమే నామమాత్రపు మెజార్టీలో గెలుపొందారు. అంబరాన్నంటిన సంబరాలు పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. కార్పొరేటర్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబర్చడంపై ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మేయర్ షేక్ నూర్జహాన్, పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు తన అనుచరులతో పెద్ద ఎత్తున వేడుక చేసుకున్నారు. ఫైర్‌స్టేషన్ సెంటర్లో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. విజయం సాధించిన అభ్యర్థులు సైతం సంబరాల్లో మునిగితేలారు. జనసేన ఒక్కచోటా నిలవలేదు జనసేన 20 చోట్ల అభ్యర్థులను బరిలో నిలపగా కనీసం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నా వీరికి ఫలితం కానరాలేదు. నగర ఓటర్లు జనసేన అడ్రస్‌ను గల్లంతు చేశారు. చివరకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అద్దెకు తెచ్చుకుని ప్రచారం చేయించుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. ప్రశాంతంగా కౌంటింగ్ ఏలూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రశాంతంగా జరిగాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనల పాటిస్తూ అధికారులు ప్రక్రియ పూర్తిచేశారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించా రు. జాయింట్ కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, జి.సూరజ్ ధనుంజయ్, ఏలూరు ఆర్డీఓ పి.రచన, ఏలూరు నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. మూడంచెల భద్రత జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ప్రత్యేక పర్యవేక్షణలో కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ నేతృత్వంలో ఐదుగురు డీఎస్పీలు, 15 మంది ఎస్సైలు, సీఐలు, 150 మందికి పైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. 30న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను ఈనెల 30న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమయ్యింది. అందరికీ ధన్యవాదాలు: కలెక్టర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కలెక్టర్ కార్తికేయ మిశ్రా ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, పోలీసు, మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషించారన్నారు. -
ఏలూరు: మృతి చెందిన ఇద్దరు అభ్యర్థుల భారీ విజయం
సాక్షి, ఏలూరు: గెలుస్తామనే ధీమాతో ఎన్నికల బరిలో నిలిచారు. గడపగడపకు తిరిగి తమకు ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. సీఎం జగనన్న మీద నమ్మకంతో జనాలు వారికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ దురదృష్టం కోవిడ్ రూపంలో వారిని కాటేసింది. ఫలితాలు వెలువడటానికి ముందే వారు మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన ఇద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులు రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. 45వ డివిజన్ నుంచి పోటీచేసిన బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058, 46వ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయంతో నగర పీఠాన్ని దక్కించుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ కేవలం మూడు డివిజన్లకే పరిమితమైంది. జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఉనికి కోల్పోయాయి. ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత ఆదివారం నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. -
ఏలూరులో విజయభేరి: మునిసిపల్ కార్పొరేషన్ వైఎస్సార్సీపీ పరం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి అమరావతి: మరోసారి అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయంతో నగర పీఠాన్ని దక్కించుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ కేవలం మూడు డివిజన్లకే పరిమితమైంది. జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఉనికి కోల్పోయాయి. ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత ఆదివారం నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు మొదలు.. ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 50 డివిజన్లకు గాను మూడు డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 47 డివిజన్లకు ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది మార్చి 10న జరిగింది. పోలింగ్ 56.86 శాతంగా నమోదైంది. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నట్లు హైకోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలో తరువాత ప్రకటిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలో మే 7న ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. దీనిపై దాఖలైన కేసును కొట్టివేస్తూ కోవిడ్ నిబంధనలను అనుసరించి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు రెండు నెలలు బ్రేక్ పడగా ఆదివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. మొత్తం 15 ఓట్లకు గాను వైఎస్సార్సీపీకి 11, టీడీపీకి 1, నోటాకు 1 ఓటు పోలయ్యాయి. మరో రెండు ఓట్లు చెల్లలేదు. ఉదయం ఎనిమిది గంటలకు 47 డివిజన్లకు సంబంధించి 47 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రారంభించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ కౌంటింగ్ సరళిని పరిశీలించారు. గెలుపొందిన ఆనందంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో అభ్యర్థుల గెలుపు... 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ 44 స్థానాల్లో ఘన విజయం సాధించింది. 10కి పైగా డివిజన్లలో 1,000 ఓట్ల కంటే అత్యధిక మెజారిటీతో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 23వ డివిజన్ నుంచి గెలుపొందిన కలవకొల్లు సాంబశివరావు 1828 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆరో డివిజన్ నుంచి సుంకర చంద్రశేఖర్ 1753 ఓట్లు, 19వ డివిజన్ నుంచి యర్రంశెట్టి నాగబాబు 1580 ఓట్లు, 50వ డివిజన్ నుంచి మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ 1495 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్ భవనం మృతిచెందిన ఇద్దరు అభ్యర్థుల విజయం... రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతిచెందిన ఇద్దరు అభ్యర్థులు తాజాగా ప్రకటించిన ఫలితాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. వీరిద్దరూ వైఎస్సార్సీపీ అభ్యర్థులే. 45వ డివిజన్ నుంచి పోటీచేసిన బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058, 46వ డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్ పాలనపై జనవిశ్వాసం.. ఈ ఫలితం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలనపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఏలూరు నగరపాలకసంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో ఏలూరులోఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన వారితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఆఖరికి ఫలితాలను అడ్డుకునేందుకు సైతం నీచ రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 47 మంది కార్పొరేటర్లు విజయం సాధించడం సీఎం జగన్ రెండేళ్ల ప్రజారంజక పాలన వల్లేనని పేర్కొన్నారు. విజేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ శ్రీధర్ తదితరులు టీడీపీకి దక్కింది ఆ మూడే... గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 43 డివిజన్లలో గెలుపొందిన టీడీపీ ఈసారి దారుణ పరాజయాన్ని చవిచూసింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. 28, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాలుగు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. 2014తో పోలిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ 43, వైఎస్సార్సీపీ 7 డివిజన్లలో గెలుపొందాయి. నాడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ తన బలాన్ని 47కు పెంచుకుంది. తాజా ఫలితాల్లో వైఎస్సార్సీపీ 47 డివిజన్లలో గెలుపొందగా టీడీపీ మూడు స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. జనసేన ఉనికి గల్లంతు... 20 డివిజన్లలో పోటీకి దిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించినా ఒక్కచోట కూడా బోణీ కొట్టకపోగా కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 16 డివిజన్లలో పోటీచేసిన బీజేపీ అన్నిచోట్లా ఓటమి పాలైంది. వామపక్షాలు రెండూ కలసి నాలుగు డివిజన్లలో పోటీ చేసి పరాజయం పాలయ్యాయి. -
తమ్ముళ్ల డీలా
మునిసి‘పోల్స్’లో ప్రజాతీర్పుపై పోస్టుమార్టం సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ముందంజలో ఉందని, జనం ఆ పార్టీవైపే ఉన్నారని కొద్దిరోజులుగా హంగామా చేసిన తెలుగు తమ్ముళ్లు డీలా పడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపే ఉన్నట్టు పోలింగ్ సరళినిబట్టి విశ్లేషకులు స్పష్టం చేశారు. టీడీపీ అంచనాలు తల్లకిందులవడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. పేదవాడల్లో జనం ఫ్యాన్‌వైపే ఉన్నట్టు వెల్లడి కావడం, మహిళల్లో అధిక శాతం మంది వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోలింగ్‌లో పాల్గొనడంతో టీడీపీని నిస్సత్తువ ఆవహించింది. శనివారం వరకూ హడావుడి చేసిన నేతలంతా పోలింగ్ అనంతరం స్తబ్దుగా ఉండిపోయారు. ‘గోబెల్స్’ ప్రచారమే అస్త్రంగా... ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ వ్యూహం ప్రకారం రకరకాల ప్రచారం చేస్తూ ప్రజల ముందుకెళ్లింది. తమకు తాము బలంగా ఉన్నట్లు ప్రచా రం చేసుకోవడంతోపాటు ప్రత్యర్థులను తక్కువ చేసి చూపించేందుకు అనేక రకాల ఊహాగానాలకు తెరలేపారు. చివరకు మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు తమదేనని భారీ ఎత్తున పందేలు కడుతున్నట్టు నటిస్తూ ప్రత్యర్థులను డోలాయమానంలో పడేసేలా మైండ్ గేమ్ ఆడారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో యువత టీడీపీ వైపు ఆకర్షితుతున్నారనే ప్రచారాన్ని కూడా పెద్దఎత్తున చేరుుం చారు. వైఎస్సార్ సీపీ మాత్రం ఈ ప్రచారాలను పట్టించుకోకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేసింది. ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టుకోగలిగింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి టీడీపీ నేతలు, క్యాడర్ పందాలకు వెనుకాడారు. అప్పటివరకూ తామే గెలుస్తామని చెప్పిన వారంతా వైఎస్సార్ సీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెబుతుండటం విశేషం. ఒక్కోచోట.. ఒక్కో రకంగా ఏలూరులో తొలినుంచీ టీడీపీ గాలి ప్రచారాలపైనే ఎక్కువగా ఆధారపడింది. 50 డివిజన్లకుగాను 32 డివి జన్లలో గెలుస్తామని ఒకటికి నాలుగిం తల పందేలు వేస్తామంటూ నాయకులు హడావుడి చేశారు. కానీ పోలింగ్ తర్వాత వారంతా కనిపించకుండాపోయారు. కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ టీడీపీ 20కిపైగా డివిజన్లు గెలుచుకుంటుందంటూ పందేలకు ముందుకు వచ్చారు. భీమవరం మునిసిపాల్టీలోనూ ఇదే తంతు నడిచింది. అక్కడ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఇతర నేతల వల్ల టీడీపీకి అనుకూల పరిస్థితి ఉందని ఊకదంపుడుగా ఉపన్యాసాలు ఇచ్చినవారంతా ఇప్పుడు నోరుమెదపడం లేదు. తాడేపల్లిగూడెంలో రాజకీయంగా శత్రువులైన కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని, ఇతర నేతలంతా టీడీపీని భుజానవేసుకుని మునిసిపల్ ఎన్నికల్లో పోరా టం చేశారు. పట్టణంలో అన్ని పార్టీలు ఒకవైపు, వైఎస్సార్సీపీ ఒకవైపు ఉందని.. విజయం టీడీపీదేనని చెబుతూవచ్చారు. తీరా పోలింగ్ తర్వాత మునిసిపాల్టీని గెలుచుకుంటామని చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. తణు కు, కొవ్వూరుతోపాటు మిగిలిన అన్ని మునిసిపాల్టీల్లోనూ టీడీపీ నేతలు పోలింగ్ తర్వాత వెనక్కి తగ్గిపోయారు. దీనినిబట్టే మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలకు ఇట్టే అర్థమవుతోంది.