రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా
రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. శనివారం సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... విజయవాడ - గుంటూరు నగరాల మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేస్తానని కావూరి సాంబశివరావు తెలిపారు.